గంధం నూనె లేదా చందన తైలం ఒక ఆవశ్యక నూనె.ఆవశ్యక నూనెలు సువాసననిచ్చు రసాయనాలను కల్గి వున్నవి అందువలన ఆవశ్యక నూనెలను సుగంధ తైలాలు అంటారు.ఆవశ్యక నూనెలను ఎక్కువగా పరిమళ ద్రవ్యాలుగా ఉపయోగించినప్పటికి ఔషదగుణాలను కల్గి ఉన్నందున వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. గంధం/చదనం చెట్టులోపలురకాలు ఉన్నాయి.సుగంధ నూనెను ఎక్కువగాశాంటాలమ్ ఆల్బమ్, శాంటాలమ్ స్పీకటమ్ రకాపు చేట్ల చేవదీరిన కాండం నుండి ఉత్పత్తి చేస్తారు.గంధం చెట్టు నుండి ఆవశ్యక నూనెను ఆవిరిస్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారాసంగ్రహిస్తారు. గంధపు నూనె అనేది గంధపుచెట్ల యొక్క గంధపుచెక్కల నుండి కట్ చేసిన చిప్స్, బిల్లేట్ల యొక్క ఆవిరి స్వేదనం నుండి లభించే ఒక సుగంధపు తైలం. గంధం నూనెను పరిమళ ద్రవ్యాలలోను, సౌందర్య సాధనలలోను, పవిత్ర లేపనాలలోను ఉపయోగిస్తారు.[1]

స్వచ్ఛమైన గంధం తైలం కలిగిన ఒక గాజు సీసా

గంధం చెట్టు

మార్చు

గంధంచెట్టు సతత హారిత వృక్షం. చెట్టు కాండం బ్రౌన్ బూడిద వర్ణంలో వుండును.చెట్టు వేర్లు పక్క చెట్లలోకివ్యాపింపచేస్తుంది. 9 మీటర్ల ఎత్తు వరకు పెరుగును.సన్నని పెక్కు కొమ్మలను కల్గిగి వుండును. నునుపైన ఉపరితలం వున్న ఆకులను కల్గి ఉంది. పింకు-పపృల్ రంగులో చిన్నని పూలను కల్గి ఉంది. చెట్టు కాండం చేవదేరాటానికి 30 నుండి 60 సంవత్సరాలు పట్టును. చేవదీరిన కాండాన్నికత్తరించి నూనె తీసిన తరువాత మిగిలిన పచ్చని కాండపు ముక్కలను స్క్రాపింగ్స్ క్రింద అమ్ముతారు. మైసూరు గంధపు చెట్టునుండి తీసిన చందన తైలాన్ని ప్రపంచంలో అత్యుత్తమైనసుగంధ తైలమని భావిస్తారు. నాలుగు వేల సంవత్సరాల క్రితం నుండే గంధాన్ని భారతదేశం నుండి ఈజిప్టు, గ్రీసు, రోముకు వెళ్ళు ప్రయాణికుల సమూహం తీసుకెళ్ళే వారని లిఖిత పూర్వక ఆధారాలు ఉన్నాయి.అక్కడి పలు దేవాలయాలు గంధపు చెక్కలతో నిర్మించారు. ఈజిప్టులో గంధపు నూనెను.మరణించినవారి దేహాలనుకుళ్ళిపోకుండ పరిమళద్రవ్యములలో వేసి యుంౘుటకు (embalming) వాడేవారు.

భారతదేశంలో గంధాన్ని అరగదీసి చేసిన లేపనాన్ని శుభకార్యాలలో, దైవపూజలో ఉపయోగిస్తారు. ఒకప్పుడు గంధం చెక్క/కలపతో గృహోపకరణాలు, మందశాలు, ఇతర చెక్క వస్తువులు చేసినప్పటికీ, గంధం కలప మరింత ఖరీదైనది మారటం వలన ప్రస్తుతం (2018) కేవలం గంధం నూనెను సంగ్రహించుటకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

నూనెలోని ప్రధాన భాగాలు

మార్చు

గంధం నూనె 50-60% ట్రిసిక్లిక్ α-శాంతలాల్ యొక్క 90% కంటే ఎక్కువ సెస్‌క్యూటర్‌పినిక్ ఆల్కహాల్ కలిగి ఉంటాయి. β-శాంతలాల్ 20-25% ఉంటాయి[2][3]. చందన తైలాన్ని సుగంధ ద్రవ్యాలలో, కాస్మోటిక్స్ అలాగే సబ్బులతయారీలో, ఇతర అత్తరు లలో మిశ్రమం చేసి ఉపయోగిస్తారు.అంతే కాకుండా చందన తైలాన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. గంధం చెట్టు శాంటాలేసియేకుటుంబానికి చెందిన మొక్క. శాంటాలమ్ ఆల్బమ్ అనే వృక్షశాస్త్ర పేరు వున్న చెట్టును ఈస్ట్ ఇండియా సాండల్ వుడ్, శాంటల్, సాండర్స్, మైసూర్ శాండల్ వుడ్ అని అంటారు.ఈ రకాపు గంధం చెట్టు ఆస్ట్రేలియా గంధం చెట్టుకన్న ఉత్తమ మైనది.ఎక్కువ సువాసన ఇచ్చును.నూనెలో సాంటైల్ ఆసిటేట్, శాంటాలేన్ కూడా ఉన్నాయి.

నూనె గుణాలు

మార్చు

గంధం నూనె విష స్వాభావాం లేని నూనె, అలాగే నాన్ఇ రిటంట్ నూనె.ఎటువంటి ప్రధాన పార్శదుష్ప్రభావాలు లేనప్పటికి కొందరిలో చర్మం పై ప్రకోప ప్రభావం చూపించవచ్చు.అలాగే పలు అలెర్జీ జబ్బులతో బాధ పాడేవారు, గర్భంతో వున్నవారు ఈ నూనెను ఔషధంగా లేదా ఆరోమాతేరపిలో ఉపయోగించునపుడు తగు సూచనన మేరకు మాత్రమే ఉపయోగించుట మంచిది..

  • నూనె భౌతిక గుణాల పట్టిక[4]
వరుస సంఖ్య గుణం విలువ మితి
1 సాంద్రత ( 25 °C వద్ద) 0.974 గ్రాములు/మీ.లీ
2 వక్రీభవన సూచిక 1.507
3 బాష్పీ భవన స్థానం 270 °C
4 ఫ్లాష్ పాయింట్ >230 °F

నూనె సంగ్రహణ

మార్చు

చేవకు వచ్చిన గంధపు ముక్కలనుండే నూనెను సంగ్రహిస్తారు.సాధారణంగా నూనెను స్టీము డిస్టీలేసను పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు.నూనె దిగుబడి 4-6.5%వరకు వుండును.అయితే నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో కూడా సంగ్రహించవచ్చు.అవి ఒకటి లిక్విడ్ సాల్వెంట్ విధానం మరొకటి సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ విధానం. మరో విధానం హైడ్రో డిస్టిలెసను విధానం.స్టీము డిస్టిలేసనుకు 14-36 గంటల సమయం పట్టును.మిగతా డిస్టిలేసను పద్ధతులకన్న ఈ విధానం ఎక్కువ సమయంతీసుకున్నను ఈ ప్రక్రియ ద్వారా సేకరించిన నూనెలో శాంటాలోల్ 84.32%వరకు వుండును సుగంధ నూనెను ఎక్కువగాశాంటాలమ్ ఆల్బమ్, శాంటాలమ్ స్పీకటమ్ రకాపు చేట్ల చేవదీరిన కాండం నుండి ఉత్పత్తి చేస్తారు.గంధం చెట్టు నుండి ఆవశ్యక నూనెను ఆవిరిస్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారాసంగ్రహిస్తారు.

కార్బన్ డయాక్సైడ్ పద్దతిలో సంగ్రహణ

మార్చు

లిక్విడ్ కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించి నూనెను సంగ్రహించవచ్చు. ఈ విధానాన్ని సూపర్ క్రిటికల్ ఎక్సు ట్రాక్సను అనికూడా అంటారు.ఎక్కువ వత్తిడిలో వున్న కార్బన్ డయాక్సైడ్ ద్రవలక్షణాలను కల్గి, ద్రావణి (solvent) గా పనిచేసి గంధం చెక్కలోని ఆవశ్యక నూనెను సంగ్రహించును. మామూలుగా స్టీము, హైడ్రోడిస్టిలేసను కిధానంలో నూనెను సంగ్రగించుటకు140˚-212˚ F ఉష్ణోగ్రత అవసరం కాగా, లిక్విడ్ కార్బన్ డయాక్సైడ్ విధానంలో 95˚-100˚ F వద్దనే నూనెను సంగ్రహణ చెయ్యవచ్చు.కాకపోతే ఈ విధానంలో ఉత్పత్తి అయిన నూనెలో శాంటాలోల్ శాతం 82.5%వరకు వుండును.ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలెసను పద్ధతిలో తీసిన నూనెలో శాంటాలోల్ శాతం 82.5%వరకు వుండగా, హైడ్రో డిస్టీలేసను పద్ధతిలో సంగ్రహించిన నూనెలో శాంటాలోల్ 52.59% వరకు వుండును. (Journal of Natural Products, source, 2011).

గంధపు నూనె

మార్చు

గంధం నూనె ఒక పరిమళమైన, అహల్లదకరమైన సువాసన కల్గి ఉంది.నూనె లేత పసుపు లేదా బంగారు రంగులో వుండును. గంధం తైలంలో ఆల్కహాల్ లు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి.సెస్కుయిటెర్పినిక్ ఆల్కహాలు 90% వరకు వుండగా, అందులో ట్రై సైక్లిక్ ఆల్ఫా-శాంటాలోల్ 50-60% వరకు, బీటా శాంటాలోల్ 20-25% వరకు విడంగా మిగిలిన రసాయన సమ్మేళనాలు తక్కువ శాతంలో వుండును.గంధం చెట్టు యొక్క రకం, జాతి పెరిగిన భూవాతావరణం, భూ స్వాభావం బట్టి గంధం నూనెలోని రసాయన సమ్మేళనల సంఖ్య, శాతం మారును.అలాగే నూనెను సంగ్రహించిన పద్ధతి మీద కూడా ఆధారపడి వుండును.2018 నాటికి ISO (ISO 3518: 2002E) ప్రామాణీకత ప్రకారం శాంటాలమ్ ఆల్బమ్ చెట్టు కాండం నుండి సంగ్రహించినా సుగంధ తైలంలో ఆల్ఫా శాంటాలోల్ కనీసం 41-55 %, బీటా శాంటాలోల్ కనీసం 16-25%వుండాలి.

గంధం నూనెను కాండంతో పాటు వేర్లనుండి కూడా సంగ్రహిస్తారు.గంధం నూనెయొక్క విశిష్టమైన పరిమళం కారణంగా దీనిని ఎక్కువగా పరిమళ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. అంతేకాదు హిందు, జైన, బుద్ధ, జొరాస్ట్రియన్ మతంలో చందన నూనెను పవిత్ర నూనెగా భావిస్తారు.

సాంప్రదాయ ఉపయోగాలు

మార్చు
  • గంధపు తైలాన్ని శారీరక, మానసిక రుగ్మతల యొక్క రెండు చికిత్సల కొరకు ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు.
  • గంధం నూనె ఎక్కువ ఖరీరైన తైలం అయినప్పటికి ఛాతీ, మూత్ర కోశ సంబంధ జబ్బులను నయం చేయుటకు ఉపయోగపడును.గంధం నూనె మానసిక ఆందోళన, అద్రిక్తతను, ఆతురతను తగ్గించును.

గంధపుచెక్క

మార్చు

గంధపుచెక్క అనగా ఒక సువాసనల చెక్క, దీని నుండి నూనెను తయారు చేస్తారు. దీనిని పరిమళాలకు, ఔషధాల కోసం ఉపయోగిస్తారు. ఇవి భారతదేశం, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పసిఫిక్ ద్వీపాలలో కనిపిస్తాయి. దీని ప్రజాతి శాంటాలం. ఇండోనేషియా, మలేషియాలలో దీని స్థానిక పేరు చందన.

గంధపు నూనె ఉపయోగాలు

మార్చు
  • చందన తైలాన్నిఆయుర్వేద వైద్యంలో మానసిక అస్వస్థను తగ్గించుటకు, somaticకే కాకుండా జలుబు, శ్వాసకోషా జబ్బుకుంజ్వరానికి, మూత్రకోశ, నాళజబ్బుల నియంత్రణకు, వ్యాధుల సంక్రమణ నివారణకు,, నొప్పులనివారణకు ఉపయోగిస్తారు.
  • సాధారణంగా గంధం తైలాన్ని నేరుగా చర్మానికి రాయకుండా బాదం, జోజోబా, ద్రాక్ష విత్తనాల నూనె వంటి వాటితో (carrier oils) మిశ్రమం చేసి ఉపయోగిస్తారు.మర్దన నూనెగా గంధం నూనెను వాడునపుడు మొదట చర్మ ము పై ఒక ప్రాతంలో కొద్దిగా రాశి పరీక్షించిచూసి ఆపైన వాడుట మంచిది

ఇవి కూడా చూడండి

మార్చు

శ్రీగంధం

మూలాలు

మార్చు
  1. Kapoor LD (2001). Handbook of Ayurvedic Medicinal Plants. Herbal Reference Library Series. Vol. 2. Boca Raton, FL: CRC Press. ISBN 9780849329296.
  2. Krotz A, Helmchen G (1994). "Total Syntheses, Optical Rotations and Fragrance Properties of Sandalwood Constituents: (-)-(Z)- and (-)-(E)-β-Santalol and Their Enantiomers, ent-β-Santalene". Liebigs Ann Chem. 1994 (6): 601–609. doi:10.1002/jlac.199419940610.
  3. Sandalwood Essential Oil Archived 2019-03-22 at the Wayback Machine, http://scienceofacne.com/sandalwood-essential-oil/ Archived 2019-03-22 at the Wayback Machine
  4. "8006-87-9(Sandalwood oil) Product Description". chemicalbook.com. Archived from the original on 2018-08-29. Retrieved 2018-08-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

మార్చు