గజ్జల వినాయక శర్మ

గజ్జల వినాయక శర్మ ఒక సినీ రచయిత.[1] దాదాపు 60 సినిమాలకు పైగా పనిచేశాడు. అందులో ఎక్కువ భాగం ఈ. వి. వి. సత్యనారాయణ, సాగర్ సినిమాలే.

వ్యక్తిగత వివరాలుసవరించు

వినాయక శర్మ స్వస్థలం వరంగల్. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అక్టోబరు 13, 2016 న సికింద్రాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. అదే రోజున సికింద్రాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

సినీరంగంసవరించు

ప్రేమఖైదీ సినిమాతో మాటల రచయితగా తన ప్రస్థానం ప్రారంభించాడు. ఈవివి దర్శకత్వం వహించిన చెవిలో పువ్వు అనే చిత్రానికి ఓ పాట కూడా రాశాడు. ఏవండీ ఆవిడ వచ్చింది, అమ్మదొంగా, అమ్మనా కోడలా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆయన రచనలు విపుల, చతుర లాంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈనాడు దినపత్రికలో సంపాదకీయం పేజీలో అనేక వ్యంగ్య వ్యాసాలు రాశాడు. అంతే కాకుండా పలు టీవీ చానళ్ళకు ఫ్రీలాంస్ రచయితగా కూడా పనిచేశాడు.

మూలాలుసవరించు

  1. "ఓ కలం ఆగింది". ఈనాడు. 14 October 2016. Archived from the original on 14 October 2016. Retrieved 14 October 2016.