అమ్మదొంగా
అమ్మదొంగా 1995 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా.[2] మౌళి క్రియేషన్స్ బ్యానరులో సాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, సౌందర్య, ఆమని నటించారు. రాజ్-కోటి జంట విడిపోయిన తరువాత కోటి ఒంటరిగా సంగీతం అందించిన తొలి సినిమా ఇది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.[3]
అమ్మదొంగ | |
---|---|
![]() | |
దర్శకత్వం | సాగర్ |
రచన | వినయ్ (మాటలు) |
స్క్రీన్‌ప్లే | రమణి |
కథ | గొర్తి సత్యమూర్తి |
నిర్మాత |
|
నటవర్గం | [1] |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాసరెడ్డి[1] |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | కోటి[1] |
నిర్మాణ సంస్థ | మౌళి క్రియేషన్స్ |
విడుదల తేదీలు | 1995 జనవరి 12 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సంక్షిప్త సినిమా కథసవరించు
చక్రధర్ (కృష్ణ), తన చెల్లెలితోపాటు మరో ఇద్దర్ని హత్య చేసిన నేరంమీద జైలుకెళ్ళడంతో కథ మొదలవుతుంది. శిక్ష పూర్తయి, విడుదలై వస్తుండగా సౌందర్య కలిసి అతనితోపాటు కోటిపల్లి వెళుతుంది. అక్కడ రచ్చబండ దగ్గర తనను అన్యాయంగా జైలుకు పంపిన నలుగురు విలన్లనీ ఇప్పుడు హత్య చేసి తప్పించుకుంటానని చెబుతాడు కృష్ణ. అక్కడి ఇన్స్పెక్టర్ చరణ్ రాజ్ కృష్ణ మిత్రుడే కానీ కర్తవ్య బధ్ధుడు. ఒక విలన్ కూతురు కృష్ణ మరదలు, ఆమని. ఇక రెండు హత్యలు చేస్తాడు కృష్ణ. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి కథానాయిక సౌందర్య ఆశ్ఛర్యపరుస్తుంది. ఇక రెండో భాగంలో కృష్ణ గతం వివరించడంతో సౌందర్య నిజం తెలుసుకుంటుంది. తన అన్నను చంపింది కృష్ణ కాదని, గతంలోనూ ఆమనికి పోటీగా ఇంద్రజ ఉందని చరణ్ రాజ్ నుండి కృష్ణని కాపాడడంలో ఇద్దరు కథానాయికలూ పోటీ పడతారు. కృష్ణ తన శపథం నిలబెట్టుకుంటాడు. పగ, ప్రతీకారం కథలో ముగ్గురమ్మాయిల మధ్య కృష్ణ దాగుడు మూతలు, చచ్చిపోయిన ముగ్గురు విలన్లూ దయ్యాలై చేసే హాస్యమూ సినిమాని రక్తి కట్టించాయి.
నటవర్గంసవరించు
సాంకేతికవర్గంసవరించు
- కథ: సత్యమూర్తి
- మాటలు: వినయ్
- కూర్పు: గౌతంరాజు
- కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి
- ఆర్ట్: బాబ్జీ
సినిమా పాటలుసవరించు
ఈ సినిమాకు కోటి సంగీతం అందించాడు.[4]
- "ఏదో మనసుపడ్డాను గానీ" — మనో, కె.ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ
- "తహతహ తాకిడి" — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- "నీతో సాయంత్రం" - ఎస్పీబి, చిత్ర, శైలజ
- "బోలో కృష్ణముకుందా" — ఎస్పీబి, చిత్ర
- "జం జుమ్మనీ" — ఎస్పీబి, చిత్ర
- "పిల్ల అదరహో" — మనో, స్వర్ణలత
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 "Amma Donga film info". moviebuff.com. Retrieved 14 July 2020.
- ↑ MovieGQ. "Amma Donga 1995 film". Retrieved 14 July 2020.
- ↑ "Sankranti Superheroes of Tollywood". telugu360.com. 9 January 2016. Retrieved 6 July 2020.
- ↑ "Amma Donga Songs". gaana.com. Retrieved 14 July 2020.