గజ్వేల్ సైదయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గజ్వేల్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

గజ్వేల్ సైదయ్య

ఎమ్మెల్యే
పదవీ కాలం
1962 – 1983
నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
కొడకొండ్ల, గజ్వేల్ మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం 1996
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి సాయమ్మ
సంతానం కృష్ణ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

గజ్వేల్ సైదయ్య 1962లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వెంకటస్వామి పై 1035 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించాడు. గజ్వేల్ సైదయ్య 1978లో ఇందిర కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థిగా అల్లం సాయిలు పై గెలిచి గజ్వేల్ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించాడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యునిగా, లిడ్‌క్యాప్ మెంబర్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడు.[3][4]

మూలాలు మార్చు

  1. Sakshi (6 April 2014). "నిస్వార్థ సేవకు స్ఫూర్తి గజ్వేల్ సైదయ్య". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  2. Eenadu (26 October 2023). "అందని ద్రాక్ష 'ఎమ్మెల్యే'". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  3. Andhra Bhoomi (14 October 2018). "చరిత్రను ఇముడ్చుకుంది". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  4. Eenadu (29 October 2023). "ఇంకా జనం గుండెల్లోనే." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.