గణపత్రావ్ దేవ్‌జీ తపసే

హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ గవర్నర్

గణపత్రావ్ దేవ్‌జీ తపసే (30 అక్టోబర్ 1909[1] – 3 అక్టోబర్ 1992) భారతీయ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య కార్యకర్త. ముంబాయులో జన్మించిన ఈయన మహారాష్ట్రలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజకీయ పార్టీ నాయకుడు. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ గా చేసారు.


దేవ్‌జీ ఫెర్గూసన్ కాలేజ్ లో, లా కాలేజ్ ఆఫ్ పూణేలో చదివారు. 1940లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. తరువాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మళ్ళీ కొంత కాలం జైలు జీవితం గడిపారు. 1946, 1952 వరుస ఎన్నికలలో సతారా జిల్లా నుండి బొంబాయి శాసనసభకు ఎన్నికయ్యారు. అతను 3 ఏప్రిల్ 1962 నుండి 2 ఏప్రిల్ 1968[2] వరకు రాజ్యసభ సభ్యుడుగా చేసారు. తరువాత 1971 వరకు రైల్వే సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా వ్యవహరించారు. 2 అక్టోబర్ 1977 నుండి 27 ఫిబ్రవరి 1980[3] వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. తరిగి 28 ఫిబ్రవరి 1982 నుండి 14 జూన్ 1984 వరకు హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు.

రచనలు మార్చు

ముడ్‌హౌస్ టు రాజ్‌భవన్ - గవర్నర్ ఆత్మకథ (1983)

మూలాలు మార్చు

  1. His actual date of birth according to the Rajya Sabha website is 30 October 1908, though his official date of birth found in the Governor of Uttar Pradesh website is 15 July 1909
  2. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF).
  3. "Shri Ganpat Rao Devji Tapase, Governor of UP". Governor of Uttar Pradesh website. Archived from the original on 21 July 2011. Retrieved 4 March 2011.