గణేష్ హుక్కేరి (జననం 24 జూలై 1978) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చిక్కోడి-సదలగా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

గణేష్ హుక్కేరి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 ఆగస్టు 26
ముందు ప్రకాష్ బాబాన్న హుక్కేరి
నియోజకవర్గం చిక్కోడి-సదలగా

వ్యక్తిగత వివరాలు

జననం (1978-07-24) 1978 జూలై 24 (వయసు 46)
చిక్కోడి , కర్ణాటక , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి స్వప్నాలి హుక్కేరి
సంతానం 2
నివాసం ఎగ్జాంబా పోస్ట్
చికోడి తాలూకా
బెల్గావి జిల్లా
591244
పూర్వ విద్యార్థి కర్నాటక్ యూనివర్సిటీ , ధార్వాడ్ ( BBA )
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

గణేష్ తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాలలోకి వచ్చి బెలగావి జిల్లా పరిషత్ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో చిక్కోడి-సదలగా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన అతని తండ్రి ప్రకాష్ హుక్కేరి 2014లో లోక్‌సభకు ఎన్నికైన తర్వాత చిక్కోడి-సదలగా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] సెప్టెంబరు 2016లో కర్ణాటక రెవెన్యూ శాఖలో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యాడు.[2] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అన్నాసాహెబ్ శంకర్ జోల్లెపై 10,569 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] గణేష్ 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రమేష్ కత్తిపై 78,774 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Karnataka bypoll results: Congress wins 2 seats; BJP wins 1, faces shocking defeat in Bellary - IBNLive". 2014-08-27. Archived from the original on 27 August 2014. Retrieved 2024-05-01.
  2. Deccan Herald (26 August 2014). "Cong gets Chikodi, Bellary Rural; BJP retains Shikaripur" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.