గాంధీగ్రామ్ (విశాఖపట్నం)
గాంధీగ్రామ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిమితుల్లోకి వచ్చే ఈ ప్రాంతం నగరంలోని నావికా, పౌర ప్రాంతాలలో ఒకటిగా ఉంది.[2] సింధియా, మల్కాపురం మధ్యనున్న ఈ ప్రాంతంలో నావికాదళ ఆసుపత్రి, నావికా పాఠశాలలు ఉన్నాయి.[3]
గాంధీగ్రామ్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°40′53″N 83°15′33″E / 17.681492°N 83.259135°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530 005 |
Vehicle registration | ఏపి-31 |
భౌగోళికం
మార్చుఇది 17°40′53″N 83°15′33″E / 17.681492°N 83.259135°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
మార్చుగాంధీగ్రామ్ చుట్టూ పడమర వైపు బుచ్చెయ్యపేట మండలం, ఉత్తరం వైపు చీడికాడ మండలం, దక్షిణం వైపు అనకాపల్లి మండలం, తూర్పు వైపు కె. కోటపాడు మండలం ఉన్నాయి.
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గాంధీగ్రామ్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, సింధియా, మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, గోపాలపట్నం, సింహాచలం, అనకాపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు
మార్చు- శ్రీరామ దేవాలయం
- అంకుపాలెం దుర్గాదేవి దేవాలయం
- గౌష్‌పాక్ నిషాని
- మదీనా మసీదు
- బయ్యవరం మసీదు
మూలాలు
మార్చు- ↑ "Gandhigram Village , Chodavaram Mandal , Visakhapatanam District". www.onefivenine.com. Retrieved 17 May 2021.
- ↑ "location". maps of india. 28 March 2013. Retrieved 17 May 2021.
- ↑ "about". the hindu. 12 April 2016. Retrieved 17 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 17 May 2021.