గాంధీ వైద్య కళాశాల
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
గాంధీ వైద్య కళాశాల (Gandhi Medical College) హైదరాబాదులోని ప్రసిద్ధి చెందిన ఒక వైద్య కళాశాల (Medical College). ఇక్కడ ఎం.బి.బి.ఎస్., ఎం.డి., ఎం.ఎస్., డి.ఎం. వంటి కోర్సుల బోధన జరుగుతున్నది. ఇంకా నర్సింగ్, పెరామెడికల్ కోర్సులు కూడా చెప్పబడుతాయి. మొత్తం వైద్య రంగానికి చెందిన 37 డిగ్రీలు ఇక్కడ బోధనలో ఉన్నాయి. యేటా ఎం.బి.బి.ఎస్. కోర్సులో 150 మంది విద్యార్థులు, 80 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు చేరతారు. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాఠాలజీ, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి విభాగాలున్నాయి.
![]() | |
నినాదం | తమసోమా జ్యోతిర్గమయ |
---|---|
రకం | Tertiary care medical center |
స్థాపితం | 1954 |
వ్యవస్థాపకుడు | సయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్ |
ప్రధానాధ్యాపకుడు | బి.ఎస్.వి.మంజుల[1] |
స్థానం | సికింద్రాబాద్, తెలంగాణ, భారతదేశం |
అనుబంధాలు | Kaloji Narayana Rao University of Health Sciences |
ఇది 1954 సెప్టెంబరు 14న "పీపుల్స్ మెడికల్ కాలేజి"గా ప్రారంభమైంది. అప్పటిలో ఇది హుమాయూన్ నగర్‌లో ప్రస్తుతం "సరోజినీదేవి కంటి ఆసుపత్రి" అన్న స్థలానికి సమీపంలో ఉండేది. వైద్య విద్యావసరాలకు ఉస్మానియా మెడికల్ కాలేజి చాలనందున ఇది ప్రాంభించారు. డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ ఈ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా 1954 మేనుండి 1956 జూలై వరకు పనిచేశాడు. 1955 జూన్ 25న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేత ఈ కళాశాల ప్రాంభోత్సవం జరిగింది. 1956 నాటికి కళాశాల ఆర్థికమైన ఇబ్బందులనెదుర్కోవడం వలన హైదరాబాదు ప్రభుత్వం ఈ కళాశాలను తన అధీనంలోకి తీసుకొంది. 1958లో కాలేజిని బషీర్‌బాగ్‌కు తరలించారు. 2003లో కాలేజిని మరల ముషీరాబాద్‌కు తరలించారు.
కాలేజి టీచింగ్ హాస్పిటల్ 1851లో ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం (infirmary) గా మొదలయ్యింది. 7వ కింగ్ ఎడ్వర్డ్ పేరుమీద దీనికి KEM హాస్పిటల్ అని పేరు పెట్టారు. 1958లో దీని పేరును "గాంధీ హాస్పిటల్"గా మార్చారు.
యేటా ఈ హాస్పిటల్‌లో 80,000 మంది ఔట్‌పేషెంట్లు, 42,000 మంది ఇన్‌పేషెంటులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ 11,000 పెద్ద శస్త్ర చికిత్సలు, 15,000 చిన్న శస్త్ర చికిత్సలు జరుపుతున్నారు. హాస్పిటల్‌లో 27 డిపార్టుమెంటులున్నాయి.
1954-2003 మధ్యకాలంలో 6090 విద్యార్థులు వైద్యవిద్యలో జాయిన్ అయ్యారు. 1950-1960 దశకాలలో కాలేజి, హాస్పిటల్ అనుసంధానించబడ్డాయి. 1970 దశకంనుండి సూపర్-స్పెషాలిటీ విభాగాలలో (కార్డియాలజీ, కార్డియో ఠొరాయిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటివి) అభివృద్ధి అధికంగా ఉంది.
61 వార్షికోత్సవంసవరించు
MONDAY, September 14, 2015 నేడు వార్షికోత్సవం అనగా సోమవారము, సెప్టెంబరు 14, 2015 గాంధీ మెడికల్ కళాశాల 61వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. అలూమిని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్‌రెడి, ్డ కార్యదర్శి డాక్టర్ లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ లింగయ్య నేతృత్వంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుకుంటున్న మెడికల్ విద్యార్థులు హాజరుకానున్నారు.
పూర్వ విద్యార్థులలో ప్రముఖులుసవరించు
- జె. గీతారెడ్డి - ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.
- బలిజేపల్లి సాయిలక్ష్మి - చెన్నైలో ఏకం అనే సంస్థను స్థాపించి చిన్న పిల్లలకు వైద్య సేవలందిస్తున్నారు.
మూలాలుసవరించు
- ↑ "Gandhi Medical College & Hospital". www.gandhimedicalcollege.ncgg.in (in ఇంగ్లీష్). Gandhi Medical College & Hospital, Secunderabad. Archived from the original on 2018-06-12. Retrieved 2018-04-29.
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Gandhi Medical College. |
- గాంధీ వైద్య కళాశాల అధికారిక వెబ్ సైటు.
- నమస్తే తెలంగాణ 14.9.2015.