డి. రాజా రెడ్డి

తెలంగాణకు చెందిన న్యూరో సర్జన్

డా. డి. రాజా రెడ్డి, తెలంగాణకు చెందిన న్యూరో సర్జన్. నిమ్స్ డైరెక్టర్ గా పనిచేశాడు.

డా. డి. రాజా రెడ్డి
జననం1938, నవంబరు 18
వృత్తిన్యూరో సర్జన్

జననం, విద్య మార్చు

రాజా రెడ్డి 1938, నవంబరు 18న తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బిక్నూర్ మండలం, జంగంపల్లి గ్రామంలో జన్మించాడు. 1962లో హైదరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, 1968లో రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో ఫెలో అయ్యాడు.[1]

వృత్తిరంగం మార్చు

1990-1993 మధ్యకాలంలో నిజాం ఇన్‌స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా ఉన్నాడు.[2] 2010లో భారతదేశంలోని స్థానిక ఫ్లోరోసిస్ సమస్యను పరిశీలిస్తున్న ఎండిమిక్ స్కెలిటల్ ఫ్లోరోసిస్ అనే పుస్తకానికి సహ రచయితగా పనిచేశాడు.[3]

నామిమోలజిస్ట్ గా, డెక్కన్ నాణేలపై పరిశోధన కూడా చేశాడు. పురాతన నాణేలపై 9 పుస్తకాలు, నాణ్యశాస్త్రంపై 25 కంటే ఎక్కువ వ్యాసాలు రాశాడు. డెక్కన్ ఆర్కియోలాజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడిగా ఉన్నాడు.[4] మద్రాస్ న్యూరో ట్రస్ట్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా అందుకున్నాడు.[5]

ఇతర వివరాలు మార్చు

  • ఇండియన్ సర్జికల్ & న్యూరోలాజికల్ సొసైటీస్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జరీ, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ న్యూరో సర్జరీ, ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లలో సభ్యుడిగా ఉన్నాడు.
  • బ్రెయిన్ అనూరిజం కాయిలింగ్, బ్రెయిన్ డ్యూరల్ ఆర్టెరియోవెనస్ ఫిస్టులా ఎంబోలైజేషన్, కరోటిడ్ బాడీ ట్యూమర్ ఎంబోలైజేషన్, లామినెక్టమీ, బ్రెయిన్ ఆర్టెరియోవెనస్ ఫిస్టులా ఎంబోలైజేషన్ మొదలైన వైద్య సేవలు అందిస్తున్నారు.

మూలాలు మార్చు

  1. Munjal, YP (30 August 2015). API Textbook of Medicine (Vols. 1 & 2). p. xxi. ISBN 978-9351524151. Retrieved 2023-06-14.
  2. "Top doctors assess fluorosis situation in Nalgonda villages". The Hindu. 15 February 2010. Retrieved 2023-06-14.
  3. Misra, Umakant (1 April 2010). "Endemic skeletal fluorosis (review)". Neurology India. Archived from the original on 13 June 2018. Retrieved 2023-06-14.
  4. Reddy (2011). Numismatica Indica : festschrift to Prof. D. Raja Reddy (1st ed.). New Delhi: Research India Press. ISBN 978-8189131470. {{cite book}}: |access-date= requires |url= (help)
  5. "MADRAS NEURO TRUST". www.madrasneurotrust.org. Archived from the original on 2017-02-20. Retrieved 2023-06-14.