గాడ్‌ఫాదర్
గాడ్ ఫాదర్ 1995 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం, దీనిని ప్రత్యూషా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రత్యూష నిర్మించగా, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు.[1] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్, వని విశ్వనాథ్, కస్తూరి ప్రధాన పాత్రల్లో నటించారు.[2] రాజ్-కోటి సంగీతం అందించారు. ఇది వారి కలయికలో చివరి సినిమా.[3]
గాడ్‌ఫాదర్ (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్, వాణీ విశ్వనాధ్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | ప్రత్యూష ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుకోటీశ్వరుడు రాజశేఖరం (అక్కినేని నాగేశ్వరరావు) పెద్ద కాలనీ రాజా నగర్ కు ఓనరు. ఇది గూండా శంకర్ (వినోద్ కుమార్) నేతృత్వంలోని అనేక సంఘవ్యతిరేక కార్యక్రమాలకు నెలవు. స్థానిక రాజకీయ నాయకులు మీసాల పోతురాజు (కాస్ట్యూమ్ కృష్ణ) & మల్లేష్ (కోట శ్రీనివాసరావు) వారి స్వార్థ రాజకీయ ప్రయత్నాల కోసం వారిని దుర్వినియోగం చేస్తారు. చివరికి, రాజశేఖరం విరాళాలు ఇవ్వడానికి నిరాకరించడంతో వారు అతడితో విభేదిస్తారు. ఈ కాలనీ నేపథ్యంలో వాళ్ళ మధ్య జరిగే గొడవలు ఎలా పరిష్కారమౌతాయనేది చిత్ర కథ.
నటవర్గం
మార్చు- రాజశేఖరంగా అక్కినేని నాగేశ్వరరావు
- శంకర్ పాత్రలో వినోద్ కుమార్
- రాణిగా వాణీ విశ్వనాథ్
- డాక్టర్ అరుణగా కస్తూరి
- మలేష్ గా కోట శ్రీనివాసరావు
- విశ్వనాథం కుమారుడిగా శ్రీహరి
- బాబు మోహన్ దొంగగా
- మీసాల పోతురాజుగా కృష్ణుడు
- విశ్వనాథంగా విసు
- దొంగగా అనంత్
- మావుళ్ళమ్మగా కోవై సరళ
- వై విజయ
- శాంతిగా బేబీ లకుమ
సాంకేతిక వర్గం
మార్చు- కళ: రమణ బాబు
- నృత్యాలు: డికెఎస్ బాబు, శివ సుబ్రమణ్యం
- పోరాటాలు: సాహుల్
- సంభాషణలు: సత్యానంద్
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, చిత్ర
- సంగీతం: రాజ్-కోటి
- కథ: ఎర్రా శెట్టి సాయి, ఏచూరి వెంకట్రావు
- కూర్పు: సురేష్ తాతా
- ఛాయాగ్రహణం: కోడి లక్ష్మణ్
- నిర్మాత: ప్రత్యూష
- చిత్రానువాదం - దర్శకుడు: కోడి రామకృష్ణ
- బ్యానర్: ప్రత్యూష ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1995
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "మంచి మార్పుకే శ్రీకారం" | సి. నారాయణరెడ్డి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:00 |
2. | "నీతి శాస్త్రమా" | సి. నారాయణరెడ్డి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 3:42 |
3. | "చిటపట చినుకుల" | జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:00 |
4. | "ఒళ్ళంతా పూలజల్లు" | జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:35 |
5. | "ఏదుకున్నవాడే" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:50 |
మొత్తం నిడివి: | 21:07 |
మూలాలు
మార్చు- ↑ "God Father (Direction)". Filmiclub.
- ↑ "God Father (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-09-26. Retrieved 2020-08-30.
- ↑ "God Father (Review)". The Cine Bay. Archived from the original on 2018-09-26. Retrieved 2020-08-30.