గాడ్‌ఫాదర్

(గాడ్‌ఫాదర్‌ నుండి దారిమార్పు చెందింది)

గాడ్ ఫాదర్ 1995 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం, దీనిని ప్రత్యూషా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రత్యూష నిర్మించగా, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు.[1] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్, వని విశ్వనాథ్, కస్తూరి ప్రధాన పాత్రల్లో నటించారు.[2] రాజ్-కోటి సంగీతం అందించారు. ఇది వారి కలయికలో చివరి సినిమా.[3]

‌గాడ్‌ఫాదర్
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వినోద్ కుమార్,
వాణీ విశ్వనాధ్
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ ప్రత్యూష ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ మార్చు

కోటీశ్వరుడు రాజశేఖరం (అక్కినేని నాగేశ్వరరావు) పెద్ద కాలనీ రాజా నగర్ కు ఓనరు. ఇది గూండా శంకర్ (వినోద్ కుమార్) నేతృత్వంలోని అనేక సంఘవ్యతిరేక కార్యక్రమాలకు నెలవు. స్థానిక రాజకీయ నాయకులు మీసాల పోతురాజు (కాస్ట్యూమ్ కృష్ణ) & మల్లేష్ (కోట శ్రీనివాసరావు) వారి స్వార్థ రాజకీయ ప్రయత్నాల కోసం వారిని దుర్వినియోగం చేస్తారు. చివరికి, రాజశేఖరం విరాళాలు ఇవ్వడానికి నిరాకరించడంతో వారు అతడితో విభేదిస్తారు. ఈ కాలనీ నేపథ్యంలో వాళ్ళ మధ్య జరిగే గొడవలు ఎలా పరిష్కారమౌతాయనేది చిత్ర కథ.

నటవర్గం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."మంచి మార్పుకే శ్రీకారం"సి. నారాయణరెడ్డిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:00
2."నీతి శాస్త్రమా"సి. నారాయణరెడ్డిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం3:42
3."చిటపట చినుకుల"జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:00
4."ఒళ్ళంతా పూలజల్లు"జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:35
5."ఏదుకున్నవాడే"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:50
Total length:21:07

మూలాలు మార్చు

  1. "God Father (Direction)". Filmiclub.
  2. "God Father (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-09-26. Retrieved 2020-08-30.
  3. "God Father (Review)". The Cine Bay. Archived from the original on 2018-09-26. Retrieved 2020-08-30.