గాదిగూడ మండలం
గాదిగూడ మండలం,తెలంగాణ రాష్ట్రం,ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] గాదిగూడ, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 52 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని కొత్తగా ఏర్పరచారు. ఇందులో 30 గ్రామాలున్నాయి.[2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం ఉట్నూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.
గాదిగూడ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, గాదిగూడ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°34′13″N 78°27′06″E / 19.570142°N 78.451767°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | గాదిగూడ |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 227 km² (87.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 20,087 |
- పురుషులు | 10,419 |
- స్త్రీలు | 9,668 |
పిన్‌కోడ్ | 504308 |
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు
మార్చుఇంతకుముందు గాదిగూడ గ్రామం ఉట్నూరు రెవెన్యూ డివిజను పరిధిలోని నార్నూరు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గాదిగూడ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా,తిరిగి ఉట్నూరు రెవెన్యూ డివిజను పరిధిలోనే కొనసాగిస్తూ 0+30 (ముప్పది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 227 చ.కి.మీ. కాగా, జనాభా 20,087. జనాభాలో పురుషులు 10,419 కాగా, స్త్రీల సంఖ్య 9,668. మండలంలో 4,144 గృహాలున్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-28.