గాదెవారిగూడెం, కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలానికి చెందినరెవెన్యూయేతర గ్రామం .ఇది సముద్రమట్టానికి 73 మీ.ఎత్తులో ఉంది. గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఏకైక పాఠశాల. పాఠశాలలో 2014 నాటి విద్యార్థు ల సంఖ్య 67. గ్రామంలో ఉన్న కొద్దిపాటి మిగిలిన వారు సమీపంలోని ఊటుకూరు, ఆర్లపాడు గ్రామాలలో పాఠశాలలో చదువుతారు.

గాదెవారిగూడెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గంపలగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి గడ్డం లక్ష్మి
పిన్ కోడ్ 521403
ఎస్.టి.డి కోడ్ 08673

గ్రామంలో రాజకీయాలు

మార్చు
  • 2013 జూలైలో ఈ గ్రామానికి జరిగిన సర్పంచి ఎన్నికలలో ఈ గ్రామానికి చెందిన 70 ఏళ్ళ గడ్డం లక్ష్మి ఏకైక అభ్యర్థి. ఈమెకు ప్రత్యామ్నాయంగా పోటీ చేసేటందుకు ఈ గ్రామంలో వేరే ఓటరు ఎవరూ లేరు. అందువలన సర్పంచి పదవికి ఈమె ఏకగ్రీవమని చెప్పక్కర లేదు.
  • 1982-1994 మధ్య దివంగత తుటారి శేషయ్య ఈ గ్రామ సర్పంచిగానూ, ఒక విడత ఊటుకూరు పి.ఏ.సీ.యస్. అధ్యక్షులుగానూ పనిచేశారు. 2001-2006 మధ్య ఈ గ్రామానికి సర్పంచిగా తుటారి శ్రీనివాసరావు పనిచేశారు. 2006-2011 మధ్య ఈ గ్రామానికి సర్పంచిగా శ్రీమతి తుటారి విజయకుమారి పనిచేశారు. ఇద్దరి హయాంలోనూ సిమెంటు రహదారి, రీటెయినింగ్ వాల్ నిర్మాణం జరిగినవి. పంచాయతీ భవన నిర్మాణం మొదలు పెట్టినారు గానీ, వీరి హయాంలో సగమే పూర్తయినది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

సిద్దార్ధ హైస్కూల్, ఊటుకూరు, జిల్లాపరిషత్ హైస్కూల్, కనుమూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

పెనుగొలను, ఉట్కూర్ నుండ్ రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 60 కి.మీ

మూలాలు

మార్చు