గాయత్రి జోషి
గాయత్రీ జోషి మాజీ భారతీయ నటి, వీడియో జాకీ, మోడల్. ఆమె నటించిన ఏకైక హిందీ చిత్రం 2004లో వచ్చిన స్వదేస్. ఆమె 2000 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ను 2005 నుండి వివాహం చేసుకుంది.[1][2]
గాయత్రి జోషి | |
---|---|
జననం | నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1999–2004 |
జీవిత భాగస్వామి | వికాస్ ఒబెరాయ్ (m. 2005) |
పిల్లలు | 2 |
అక్టోబరు 2023లో ఇటలీలోని సార్డీనియాలో లగ్జరీ కార్ల ప్రదర్శన పోటీ సందర్భంగా ఘోర కారు ప్రమాదం జరిగిన సంఘటన నుంచి గాయత్రీ జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.[3] ఇదే ఘటనలో మరో కారులో ప్రయాణిస్తున్న స్విట్జర్లాండ్ కు చెందిన జంట మృతి చెందింది.
కెరీర్
మార్చుఛానల్ వి ఇండియాలో వీడియో జాకీగా ఆమె తన వృత్తిని ప్రారంభించింది. ఫెమినా ఇండియా అందాల పోటీలో గెలవాలనే కలలు కన్నది. ఆమె 1999 ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో చివరి ఐదుగురు అభ్యర్థులలో ఒకరిగా నిలిచింది, అలాగే వీక్షకుల ఓటింగ్ ద్వారా సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో కిరీటాన్ని పొందిది.[4] జపాన్‌లో జరిగిన 2000 మిస్ ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయింది.[5] ఆమె అనేక మ్యూజిక్ వీడియోలలో నటించడంతో పాటు అడ్వర్టైజింగ్ మోడల్‌గా పనిచేసింది: ఆమె జగ్జీత్ సింగ్ "కాఘజ్ కి కష్టి", హన్స్ రాజ్ హన్స్ "ఝంజారియా" మ్యూజిక్ వీడియోలలో చేసింది.[6]
కళాశాలలో చదువుతున్నప్పుడు, ఆమె బాంబే డైయింగ్, ఫిలిప్స్, పాండ్స్, గోద్రెజ్, సన్‌సిల్క్, ఎల్జీ, అలాగే షారుఖ్ ఖాన్‌తో కలిసి హ్యుందాయ్ ప్రకటనలకు మోడలింగ్ చేసింది.[7] ఆమె 2001లో సీజన్స్ కేటలాగ్, క్యాలెండర్‌కు కూడా మోడల్‌గా ఉంది. ఆమె డిసెంబర్ 2004లో షారుఖ్, కిషోరి బల్లాల్ సరసన అశుతోష్ గోవారికర్ స్వదేస్‌తో బాలీవుడ్ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది, ఇది భారతీయ సినీ విమర్శకుల నుండి అత్యున్నత ప్రశంసలు అందుకుంది.[8][9][10]
వ్యక్తిగత జీవితం
మార్చుఆమె నాగ్‌పూర్‌లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్‌లో చదువుకుంది. ఆ తరువాత వారి కుటుంబం ముంబైకి మారింది, అక్కడ ఆమె జె. బి. వాచా హైస్కూల్‌లో చేరింది. అలా తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె సిడెన్‌హామ్ కళాశాలలో చదువుకుంది. ఆమె గోద్రెజ్, ఎల్‌జి, పాండ్స్, బాంబే డైయింగ్, సన్‌సిల్క్, ఫిలిప్స్ వంటి బ్రాండ్‌లకు, అలాగే షారుఖ్ ఖాన్‌తో కలిసి హ్యుందాయ్ ప్రకటనలలో మోడల్‌గా చేసింది. ఆ తర్వాత అదే కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందింది.
2005 ఆగష్టు 27న, ఆమె ఒబెరాయ్ కన్‌స్ట్రక్షన్ ప్రచారకర్త అయిన వికాస్ ఒబెరాయ్‌ని వివాహం చేసుకుంది. దీంతో ఆమె చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది.[11][12]
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ IndiaFM (29 August 2005). "Wedding bells for Gayatri". Sify. Archived from the original on 8 October 2018. Retrieved 31 August 2011.
- ↑ Seta, Fenil (17 December 2019). "15 years of Swades EXCLUSIVE: Gayatri Oberoi BREAKS silence on why she quit films : Bollywood News - Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). Archived from the original on 12 January 2020. Retrieved 31 March 2020.
- ↑ "విషాదం: బిలియనీర్ వికాస్, నటి గాయత్రి లగ్జరీ కార్ క్రాష్, వీడియో వైరల్ | Viral Video: Swades Actor Gayatri Joshi In Ferrari-Lamborghini Crash, 2 Dead - Sakshi". web.archive.org. 2023-10-04. Archived from the original on 2023-10-04. Retrieved 2023-10-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Goddess Gayatri". The Telegraph (Calcutta). 12 April 2005. Archived from the original on 22 August 2016. Retrieved 11 August 2016.
- ↑ "Goddess Gayatri". The Telegraph (Calcutta). 12 April 2005. Archived from the original on 22 August 2016. Retrieved 11 August 2016.
- ↑ Basu, Arundhati (5 February 2005). "Reaching for the stars". The Telegraph (Calcutta). Archived from the original on 22 August 2016. Retrieved 10 August 2016.
- ↑ Basu, Arundhati (5 February 2005). "Reaching for the stars". The Telegraph (Calcutta). Archived from the original on 22 August 2016. Retrieved 10 August 2016.
- ↑ Chaubey, Parinita (2 May 2019). "Roles Reversed On Swades Set: When Shah Rukh Khan 'Took Over' The Camera To Shoot His Director". NDTV. Archived from the original on 19 February 2020. Retrieved 31 March 2020.
- ↑ "Akshay Kumar-Twinkle Khanna's movie date with Swades actress Gayatri Joshi". India Today. Archived from the original on 2 July 2020. Retrieved 31 March 2020.
- ↑ D, Avantika (23 December 2019). "Missing: Why did Gayatri Joshi quit Bollywood after a dream debut?" (in Indian English). Yahoo News. Archived from the original on 16 April 2020. Retrieved 31 March 2020.
- ↑ IndiaFM (29 August 2005). "Wedding bells for Gayatri". Sify. Archived from the original on 8 October 2018. Retrieved 31 August 2011.
- ↑ Seta, Fenil (17 December 2019). "15 years of Swades EXCLUSIVE: Gayatri Oberoi BREAKS silence on why she quit films : Bollywood News - Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). Archived from the original on 12 January 2020. Retrieved 31 March 2020.