కిషోరి బల్లాళ్

కన్నడ, హిందీ చలనచిత్ర నటి

కిషోరి బల్లాళ్ (మ. ఫిబ్రవరి 18, 2020) కన్నడ, హిందీ చలనచిత్ర నటి.[1] 2007లో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిష బామ్మగా నటించింది.[2]

కిషోరి బల్లాళ్
కిషోరి బల్లాళ్
జననం
కిషోరి బల్లాళ్

మరణం2020 ఫిబ్రవరి 18
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1960–2020
జీవిత భాగస్వామిఎన్. శ్రీపతి బల్లాళ్

జీవిత విశేషాలుసవరించు

కిషోరి బల్లాళ్ కర్నాటక రాష్ట్రంలో జన్మించింది. ఎన్. శ్రీపతి బల్లాళ్ తో కిషోరి బల్లాళ్ వివాహం జరిగింది.

సినిమారంగంసవరించు

కిషోరి బల్లాళ్ తన 15 ఏళ్ళ వయసులో 1960లో ఇవలెంత హెందాతీ అనే కన్నడ చిత్రంలో బాలనటిగా సినిమారంగంలోకి ప్రవేశించింది.[3] దాదాపు 72 చిత్రాలలో నటించిన కిషోరి బల్లాళ్ సినిమారంగంలో పేరొందిన దర్శకులు, నటులతో కలిసి పనిచేసింది.[4] కన్నడ చిత్రాలలోపాటు హిందీ చిత్రాలలో కూడా నటించిన ఈమె, షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రంలో కేర్ టేకర్ కావేరీ అమ్మ పాత్రలను పోషించింది.[1] 2016లో మహావీర మాచిదేవా, ఆశ్రా చిత్రాలలో నటించింది. కన్నడ టెలివిజన్ రంగంలో మంచి ఆదరణ పొందిన అమృతవర్షిణి ధారావాహికలో ప్రధానపాత్రలో నటించింది.[5]

నటించిన చిత్రాలుసవరించు

 1. 2016 - కహి (అజ్జీ)
 2. 2016 - ఆశ్రా (రెండవ బిల్లింగ్) [6]
 3. 2016 - నాని (కిషోరి బాల్లాళ్)
 4. 2015 - రింగ్ రోడ్ (నానమ్మ)
 5. 2015 - క్యారీ ఆన్ మరాఠా (కిషోరి బాల్లాళ్)
 6. 2015 - బాంబే మిట్టై (కిషోరి బాల్లాళ్) ) [7]
 7. 2014 - ఆక్రమణ
 8. 2013 - గలాటే (కిషోరి బాల్లాళ్)
 9. 2012 - అయ్యా (సూర్య తల్లి)
 10. 2012 - బంగార్డ కురల్[8]
 11. 2011 - కెంపేగౌడ (కావ్య అమ్మమ్మ)
 12. 2010 - లాఫంగే పరిండే
 13. 2009 - క్విక్ గన్ మురుగన్ (శ్రీమతి ఎస్.జి. మురుగన్)
 14. 2008 - అక్కా తంగి (కిషోరి బాల్లాళ్)
 15. 2005 - నమ్మణ్ణ (కిషోరి బాల్లాళ్)
 16. 2004 -స్వదేశ్ (కావేరి అమ్మగా) [9]
 17. 2003 - II ఖుషి (కిషోరి బాల్లాళ్)
 18. 2003 - ఏక్ అలగ్ మౌసం
 19. 2000 - స్పర్శ
 20. 1989 - గేర్‌ కానూని (కిషోరి బాల్లాళ్)

పురస్కారాలుసవరించు

 1. కెంపేగౌడ ప్రశస్తి
 2. కన్నడ అకాడమీ ప్రశస్తి
 3. ఐఫా ప్రశస్తి

మరణంసవరించు

కిషోరి బల్లాళ్ బెంగళూరులోని ఆసుపత్రిలో 2020, ఫిబ్రవరి 18న మరణించింది.[10]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Kannada Movie Actress Kishori Ballal - Nettv4u". nettv4u.com. Archived from the original on 30 August 2017. Retrieved 23 February 2020.
 2. 10టీవి, సినిమా (19 February 2020). "స్వదేశీ 'కావేరి అమ్మ' కన్నుమూత". www.10tv.in (in ఇంగ్లీష్). Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.
 3. సాక్షి, సినిమా (19 February 2020). "సీనియర్‌ కన్నడ నటి మృతి". Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.
 4. నమస్తే తెలంగాణ, సినిమా (19 February 2020). "అనారోగ్యంతో సీనియ‌ర్ న‌టి మృతి". www.ntnews.com. Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.
 5. "Amruthavarshini: 5 years and counting - Times of India". indiatimes.com. Retrieved 23 February 2020.
 6. "Aasra Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Retrieved 23 February 2020.
 7. "Disha Pandey finishes shooting for Bombay Mittai - Times of India". indiatimes.com. Retrieved 23 February 2020.
 8. "Mangalore: Ram Shetty's 'Bangarda Kural' Ready to Bloom". daijiworld.com. Retrieved 23 February 2020.
 9. Elley, Derek (18 December 2004). "Review: 'Swades: We, the People'". variety.com. Retrieved 23 February 2020.
 10. The Times of India, Entertainment (18 February 2020). "Veteran Kannada actress Kishori Ballal passes away". Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.

ఇతర లంకెలుసవరించు