గారమూర్

అస్సాంలోని మజులి జిల్లా ముఖ్య పట్టణం.

గారమూర్, అస్సాంలోని మజులి జిల్లా ముఖ్య పట్టణం. 2011వ భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 5,085 జనాభా ఉంది.

గారమూర్
పట్టణం
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
Population
 (2011)[1]
 • Total5,085
భాష
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
785104

భౌగోళికం మార్చు

రాష్ట్ర రాజధాని దిస్పూర్ నుండి 301 కి.మీ.ల దూరంలో, జోర్హాట్ నుండి ఉత్తరం వైపు 25 కి.మీ.ల దూరంలో, మజులి నుండి 10 కి.మీ.ల దూరంలో ఈ గారమూర్ పట్టణం ఉంది. జోర్హాట్, మరియాని, సిబ్సాగర్, నహర్‌లాగన్ నగరాలు గారమూర్‌కు సమీపంలో ఉన్నాయి. జోర్హాట్, నిమాటిఘాట్, ధోకువాఖానా, లూయిట్-ఖబోలుఘాట్ నుండి గారమూర్ పట్టణానికి సులభంగా చేరుకోవచ్చు.[2]

సంస్కృతి మార్చు

ఈ చిన్న పట్టణం ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపమైన మజులిలోని అనేక సత్రాలలో ఒకటి. మజులి ప్రాంతం ఒకప్పుడు అహోం రాజ్యానికి సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. నృత్యం, నాటకం, మాస్కుల తయారీ, వైష్ణవ సంస్కృతి అన్నీ ఇక్కడ ప్రజల రోజువారీ జీవితం.

ఇక్కడి గిరిజనులు తయారుచేసే చేనేత వస్త్రాలు చూడ ముచ్చటగా ఉంటాయి. గారమూర్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోర్హాట్‌లో అహోం రాజులకు చెందిన అనేక మత, సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటకులు ఇక్కడి తేయాకు తోటలలో విహారం చేయవచ్చు.[3]

మూలాలు మార్చు

  1. "Census 2011, Garamur Phutuki Chapori village Data".
  2. "Garamur Village". www.onefivenine.com. Retrieved 2020-12-23.
  3. The Economic Times, Travel (15 January 2015). "Garamur in Assam: Visit the largest river island of India". Archived from the original on 23 December 2020. Retrieved 23 December 2020.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గారమూర్&oldid=3945295" నుండి వెలికితీశారు