గ్యారీ గిల్మర్

(గారీ గిల్మోర్ నుండి దారిమార్పు చెందింది)

గ్యారీ జాన్ గిల్మర్ (1951 జూన్ 26 - 2014 జూన్ 10) 1973 - 1977 మధ్య 15 టెస్టులు, 5 వన్డే ఇంటర్నేషనల్స్ (ODIలు) ఆడిన ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్.

గ్యారీ గిల్మర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గ్యారీ జాన్ గిల్మర్
పుట్టిన తేదీ(1951-06-26)1951 జూన్ 26
వరాటా, న్యూ సౌత్ వేల్స్
మరణించిన తేదీ2014 జూన్ 10(2014-06-10) (వయసు 62)
సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్
బ్యాటింగుఎడమచేతివాటం
బౌలింగుఎడమచేతివాటం ఫాస్ట్ మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 267)1973 డిసెంబరు 29 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1977 మార్చి 12 - ఇంగ్లండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 22)1974 మార్చి 20 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1975 డిసెంబరు 20 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1971/72–1979/80న్యూ సౌత్ వేల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్ట్ ఎ క్రికెట్
మ్యాచ్‌లు 15 5 75 19
చేసిన పరుగులు 483 42 3,126 182
బ్యాటింగు సగటు 23.00 42.00 30.64 14.00
100లు/50లు 1/3 0/0 5/18 0/0
అత్యుత్తమ స్కోరు 101 28* 122 44
వేసిన బంతులు 2,661 320 13,830 1,046
వికెట్లు 54 16 233 29
బౌలింగు సగటు 26.03 10.31 31.52 22.34
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 2 6 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/85 6/14 6/85 6/14
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 2/– 68/– 4/–
మూలం: ESPNcricinfo, 2014 జూన్ 12

అతని కెరీర్ శిఖరాగ్రంలో, గిల్మర్ "ప్రతిభ గల హిట్టింగ్"తో పాటుగా "చొచ్చుకొనిపోయే" లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలింగ్, మంచి స్లిప్ క్యాచింగ్‌ కలయికగా ఆడేవాడు.[1] అతన్ని ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఎలాన్ డేవిడ్‌సన్‌తో పోల్చేవారు.[1] న్యూకాజిల్‌కు ఆడినవారిలో గొప్ప ఆల్-రౌండర్ అని పేరుబడడమే కాదు, ఆ జట్టుకు చెందిన అతి గొప్ప క్రికెటర్‌ అని కూడా కొందరు అతని గురించి పేర్కొంటారు.[2]


ఆస్ట్రేలియాలోని న్యూక్యాజిల్‌కు చెందిన వారాతా సబర్బ్ ప్రాంతంలో జన్మించిన అతను పాఠశాల దశలో బేస్‌బాల్, క్రికెట్ కూడా బాగా ఆడేవాడు.[3] 1971లో 20వ ఏట ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన గిల్మర్ మొదటి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 40, 122 పరుగులు చేసి, బౌలింగ్‌లోనూ 2-27, 0-40 ప్రదర్శన చేశాడు. అప్పటి నుంచి 1974 వరకూ కౌంటీ క్రికెట్లో అప్పుడప్పుడూ తడబడ్డా నమ్మదగ్గ ఆల్రౌండర్‌గా పేరు సంపాదించుకున్నాడు.

  1. 1.0 1.1 Haigh, Gideon. "Gary Gilmour". ESPNCricinfo. ESPN EMEA Ltd. Retrieved 1 February 2011.
  2. Dan Proudman, "Gary Gilmour: Charisma at the crease" Archived 3 మార్చి 2016 at the Wayback Machine, The Newcastle Herald 10 June 2014 accessed 11 June 2014
  3. Bill Collins, Max Aitken and Bob Cork, One hundred years of public school sport in New South Wales 1889–1989 (Sydney, ca. 1990, New South Wales Department of School Education, p180ff)