గిరిపురం బాపట్ల జిల్లా, నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గిరిపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గిరిపురం is located in Andhra Pradesh
గిరిపురం
గిరిపురం
అక్షాంశరేఖాంశాలు: 16°02′N 80°44′E / 16.04°N 80.73°E / 16.04; 80.73
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522268
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామ పంచాయతీ

మార్చు

గిరిపురం గ్రామం, నగరం గ్రామానికి శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

మార్చు

గ్రామంలోని ఈ ఆలయంలో, స్వామివారి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2014, మే నెల 6 నుండి 10 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 9వ తేదీ శుక్రవారం నాడు, స్వామివారికి శాంతికళ్యాణం నిర్వహించారు. 10వ తేదీ శనివారం నాడు, ఈ ఆలయంలో సామూహిక సత్యనారాయణస్వామివారి వ్రతాలు జరిగినవి. ఈ వ్రతాలలో వందలాదిమంది దంపతులు కూర్చున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమాలలో ఈదుపల్లి, ముత్తుపల్లి, నగరం, కారంకివారిపాలెం, పూడివాడ, గాలివారిపాలెం, బెల్లంవారిపాలెం, యేలేటిపాలెం మొదలగు గ్రామాల ప్రజలు విశేషసంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-2వతేదీ, శ్రావణ శనివారం నాడు, శాంతికళ్యాణం నిర్వహించారు. వాతావరణం అనుకూలించి, వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలంతా శాంతి సౌభాగ్యాలు, సిరిసంపదలతో చల్లగా వర్ధిల్లాలని, దంపతులతో విశేషపూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేసారు.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి,అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత పనులు