గిర్ సోమనాథ్ జిల్లా

గుజరాత్ లోని జిల్లా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో గిర్ సోమనాథ్ జిల్లా ఒకటి. వెరవల్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్య 3.5 లక్షలు. జునాగఢ్ జిల్లా నుండి ఈ జిల్లాను వేరు చేసిన తరువాత వైశాల్యపరంగా గిర్ సోమనాథ్ జిల్లా జునాగఢ్ జిల్లాకంటే చిన్నదిగా ఉంది. 2013 ఆగస్టు 15 న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి. ఈ జిల్లా గిర్ నేషనల్ పార్క్, అభయారణ్యం, సోమనాథ్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది.[2] కొత్తగా రూపొందించిన గిర్ సోమనాథ్ జిల్లాలో వెరవ, తలల, కొడినార్, ఉన, గిర్ గదడ తాలూకాలు ఉన్నాయి.

గిర్ సోమనాథ్ జిల్లా
జిల్లా
సోమనాథ్ ఆలయం
సోమనాథ్ ఆలయం
గుజరాత్‌లోని జిల్లా స్థానం
గుజరాత్‌లోని జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంగుజరాత్
ప్రధాన కార్యాలయంవెరావల్
Area
 • Total3,755 km2 (1,450 sq mi)
Population
 (2011[1])
 • Total9,46,790
Time zoneUTC+5:30 (భారతీయ కాలమాన ప్రకారం)

వృక్షజాలం , జంతుజాలం మార్చు

గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న గిర్ అరణ్యాలలో సింహాలు, జింకలు, కోతులు, పలు పక్షిజాతులు, జంతువులు ఉన్నాయి. ఆసియన్ సింహాలు గిర్‌ అరణ్యాలలో మాత్రమే కనిపిస్తాయి.

భౌగోళికం మార్చు

గిర్ సోమనాథ్ జిల్లా గుజరాత్ రాష్ట్రానికి పశ్చిమాన, సౌరాష్ట్ర ద్వీపకల్పానికి నైరుతి దిశలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన పోరుబందర్ జిల్లా ఉంది. దీనికి దక్షిణాన గల్ఫ్ ఆఫ్ కాంబే, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున జునాగఢ్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా మార్చు

రైలు రవాణా మార్చు

గిర్ సోమనాథ్ జిల్లా కేంద్రమైన వెరావల్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్. ఈ నగరం అహ్మదాబాద్, రాజ్ కోట్, ఉజ్జయిని, వడోదర, పూణే, చెన్నై, న్యూఢిల్లీ, భోపాల్, ముంబై, జబల్పూర్, తిరువనంతపురంలకు ఎక్స్‌ప్రెస్ వే ద్వారా అనుసంధానించబడి ఉంది.

రోడ్డు రవాణా మార్చు

అహ్మదాబాద్, రాజ్ కోట్, సూరత్, భావ్ నగర్, భుజ్, జునాగఢ్, గాంధీనగర్, ద్వారకాయి వంటి రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాంతాలకు సోమనాథ్ రోడ్డు రవాణా ద్వారా అనుసంధానించబడి ఉంది .

మూలాలు మార్చు

  1. 1.0 1.1 [permanent dead link] Industrial Potentiality Survey Report of Gir Somnath District [2016-17
  2. http://www.narendramodi.in/promises-delivered-gujarat-cabinet-approves-creation-[permanent dead link] of-7-new-districts-and-22-new-talukas/

వెలుపలి లింకులు మార్చు