గీతం అనునది కర్ణాటక సంగీతం లో సరళమైన సంగీత రూపం. వీటిని సాహిత్యం (పాటలు) తో తాళాలను ప్రవేశపెడుతున్న క్రమంలో ఈ "గీతం" ను సృష్టించాడు. సంస్కృత భాషలో గీతం అనగా "పాట" అని అర్థం.

కృష్ణ ఆలపిస్తున్ననారాయణగురు గీతం

నిర్మాణంసవరించు

సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). సాహిత్యంలో ప్రతీ అక్షరానికీ ఒక స్వరాన్ని తీసుకుంటూ, తరచుగా ఏ విధమైన సంగతి,వైవిద్యం లేకుండా ఉంటుంది. ఆరంభం నుండి చివరకు పునరావృతం చేయకుండా గీతాన్ని పాడారు. అయినప్పటికీ చాలా గీతాలలో మొదటి భాగాన్ని పునరావృతం చేసి పాడుతారు. గీతాలను మధ్యస్థ టెంపోతో కూర్చుతారు. వాటికి సంగతి, వైవిద్యం లేకుండా సహజసిద్ధమైన సంగీతంతో కూర్చుతారు. సాహిత్యం (పాట) నేపధ్యం దేవుని స్థుతించుట. సంగీతం నేర్చుకొనే విద్యార్థులు సరళస్వరాలు, అలంకారాలు అభ్యసించిన తరువాత గీతాలను నేర్చుకుంటారు.

గీతాలలో రకాలుసవరించు

కర్ణాటక సంగీత సాంప్రదాయంలో మూడు రకాల గీతాలున్నాయి:

 • సామాన్య గీతం: ఇది సాధారణమైన పాట. దీనిని సాధారణ గీతం లేదా సంచరి గీతం అని కూడా పిలుస్తారు.
 • లక్షణ గీతం: పాటల సాహిత్యం, దేవుని స్తుతించడానికి బదులుగా చాలా పదాలనుపయోగించి రాగం లక్షణాలతో, వక్రస్వర, గ్రహ, న్యాస, అంస, మాతృ రాంగం వంటి ఇతర వివరాలతో కూర్చబడుతుంది. అనేక లక్షణ గీతాలను ప్రసిద్ధ వాగ్గేయకారుడు పురందర దాసు కూర్చాడు. [1]
 • సులాది గీతం:

ప్రసిద్ధమైన గీతాలుసవరించు

 1. వరవీణా మృదుపాణీ (సంస్కృతం): మోహనరాగం (28వ మేళకర్త రాగం హరికాంభోజి జన్యరాగం) - చతుస్థుతి జాతి రూపకతాళం.[2]
 2. శ్రీ గణ నాథ (లంబోదర) (సంస్కృతం): మలహరి రాగం (15వ మేళకర్త రాగం మాయామాళవగౌళ జన్యరాగం) - చతుస్తుతి, రూపక తాళం.[3]
 3. ఆనలేకర : సుద్ధ సావేరి రాగం (29వ మేళకర్త రాగం శంకరాభరణం జన్యరాగం) - తీస్రా జతి త్రుపుట తాళం.[4]
 4. కమల జాదల (తెలుగు): కళ్యాణి రాగం ( 65వ మేళకర్త రాగం) - తీస్రా జతి త్రిపుట తాళం.[5]

ఉదాహరణలుసవరించు

వరవీణా మృదుపాణీ[6]సవరించు

వరవీణా మృదుపాణీ - వనరుహలోచనరాణీ
సురుచిర బంబరవేణీ - సురనుత కళ్యాణీ
నిరుపమ శుభగుణ లోలా - నిరత జయాప్రద శీలా
వరదాప్రియ రంగనాయకి- వాంఛిత ఫలదాయకి
సరసీజాసన జననీ - జయజయజయ

శ్రీగణనాథసవరించు

శ్రీ గణనాధ సింధూర వర్ణ కరుణసాగర కరివదన
లంబోదర లకుమికరా అంబాసుత అమరవినుత
సిద్ద చారణ గణసేవిత సిద్ది వినాయక నమోనమో
లంబోదర లకుమికరా అంబాసుత అమరవినుత...

కమలజాదల[7]సవరించు

కమల జాదళ విమల సునయన
కరివరద కరుణాంబుధే
కరుణ శరధే కమాలా కాంతా...
కేశి నరకాసుర విభేదన
వరద వేలా సురపురోత్తమ
కరుణ శరధే కమాలా కాంతా...

మూలాలుసవరించు

 1. Royal Carpet: Glossary of Carnatic Terms G
 2. "Carnatic Songs - vara vINA (gItam, gItham) varaveena varavIna". www.karnatik.com. Retrieved 2018-05-30.
 3. Swara Music Academy (2016-08-17), Malavika Carnatic Gheethams 1 Lambodara Lakumikara Training By: Swara Music Academy Hyderabad-USA, retrieved 2018-05-30
 4. Swara Music Academy (2016-08-17), Malavika Carnatic Gheethams 6 Analekara Training By: Swara Music Academy Hyderabad-USA, retrieved 2018-05-30
 5. Swara Music Academy (2016-08-17), Malavika Carnatic Gheethams 7 Kamalajaadala Training By: Swara Music Academy Hyderabad-USA, retrieved 2018-05-30
 6. Swara Music Academy (2016-08-17), Malavika Carnatic Gheethams 5 Varaveena Training By: Swara Music Academy Hyderabad-USA, retrieved 2018-05-30
 7. "Kamalajadala (Kalyani Geetham)". www.shivkumar.org. Retrieved 2018-05-30.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గీతం&oldid=3492820" నుండి వెలికితీశారు