గుంజన్ సక్సేనా ది కార్లిల్ గర్ల్

గుంజన్ సక్సేనా’ ది కార్లిల్ గర్ల్ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎయిర్ ఫోర్స్‌లో తొలి మహిళా అధికారిగా పాల్గొన్న గుంజన్ సక్సేనా నిజ జీవిత కథ ఆధారంగా 2020 లో వచ్చిన హిందీ సినిమా.[1] ఈ చిత్ర ట్రైల‌ర్‌ను 2020, ఆగష్టు 1న రిలీజ్ చేశారు.[2]కరోనా వ్యాధి కారణంగా ధియేటర్లు మూసి ఉండడంతో ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్‌లో 2020, ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేశారు.[3]

‘గుంజన్ సక్సెేనా’ ‘ది కార్గిల్ గర్ల్
దర్శకత్వంశరణ్ శర్మ
రచననిఖిల్ మెహరోత్రా
శరణ్ శర్మ
నిర్మాతకరణ్ జోహార్
జీ స్టూడియోస్
హిరు యాష్ జోహార్
అపూర్వ మెహతా
తారాగణంజాన్వీ కపూర్‌, పంకజ్‌ త్రిపాఠి, అంగద్‌ బేడీ, వినీత్‌ కుమార్‌సింగ్‌, మానవ్‌ విజ్‌
ఛాయాగ్రహణంమనుష్ నందన్
కూర్పునితిన్ బైద్
సంగీతంబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్:
జాన్‌ స్టీవర్ట్‌
పాటలు:
అమిత్ త్రివేది
నిర్మాణ
సంస్థలు
జీ స్టూడియోస్
ధర్మ ప్రొడక్షన్స్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీ
2020 ఆగస్టు 12 (2020-08-12)
సినిమా నిడివి
112 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

కథ మార్చు

గుంజన్‌ సక్సేనా(జాన్వీ కపూర్‌) చిన్నతనంలో విమానం నడిపే పైలట్‌ను చూసి.. తాను కూడా పైలట్‌ అవ్వాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఆమెకు పైలట్‌ శిక్షణ ఇప్పించేంత డబ్బు తన తండ్రి (పంకజ్‌ త్రిపాఠి) వద్ద లేకపోవడంతో ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ అవుతానంటుంది. అందరూ గుంజన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినా.. తండ్రి మాత్రం ప్రోత్సహిస్తాడు. ఫైల‌ట్స్ కేవ‌లం పురుషులు మాత్ర‌మే కాగ‌ల‌రు అని భావిస్తున్న త‌రుణంలో గుంజ‌న్ స‌క్సేనా ఫైల‌ట్ ఎందుకు కావాల‌నుకుంది? ఫైల‌ట్ అయ్యే క్ర‌మంలో ఆమె ఎదుర్కొన్న స‌వాళ్లేంటి? వీటన్నింటిని ఎదుర్కొని గుంజన్‌ మంచి పైలట్‌గా ఎలా గుర్తింపు పొందింది? కార్గిల్‌ యుద్ధంలో ఎవరు చేయలేని సాహసాలు ఆమె ఎలా చేయగలిగింది? ఆమె స‌వాళ్ల‌ను అధిగ‌మించి దేశానికి ఎలా సేవ చేసింది? అనేదే సినిమా కథ .

నటీనటులు - సినిమాలో పాత్ర పేరు మార్చు

మూలాలు మార్చు

  1. News18 Telugu (1 August 2020). "జాన్వీ కపూర్ 'గుంజన్ సక్సేనా' ది కార్గిల్ గర్ల్ ట్రైలర్ విడుదల." Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhrajyothy (1 August 2020). "'గుంజన్ సక్సేనా' ట్రైలర్ విడుదల". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
  3. Eenadu (12 August 2020). "రివ్యూ: గుంజన్‌ సక్సే నా: ది కార్గిల్‌ గర్ల్‌ - gubjan saxena review". www.eenadu.net. Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.