గుబ్బి తోటదప్ప

వ్యాపారవేత్త, పరోపకారి

రావు బహదూర్ "ధర్మప్రవర్ధ" గుబ్బి తోటదప్ప (1838-1910) (స్థలం: గుబ్బి), ఒక భారతీయ వ్యాపారవేత్త, పరోపకారి.[1] అతను దేశవ్యాప్తంగా పర్యాటకులకు "తోటదప్ప చత్ర" అని పిలిచే ఉచిత వసతి గృహాన్ని స్థాపించారు.[1] అతనికి బ్రిటిష్ ప్రభుత్వం "రావు బహదూర్", మైసూర్ మహారాజు నాలుగవ కృష్ణరాజ ఒడయారు "ధర్మప్రవర్థ" అనే బిరుదుతో గౌరవించారు.[1]

రావు బహదూర్ ధర్మప్రవర్ధ
గుబ్బి తోటదప్ప
వ్యక్తిగత వివరాలు
జననం1838
గుబ్బి, తుమకూరు, మైసూర్ రాజ్యం (ఇప్పుడే కర్ణాటక)
మరణం1910
బెంగుళూర్
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిగౌరమ్మ
వృత్తిదాత, RBDGTC ట్రస్ట్ వ్యవస్థాపకుడు
నైపుణ్యంవ్యాపారవేత్త
రావు బహదూర్ ధర్మప్రవర్ధ గుబ్బి తోటదప్ప చారిటీస్ (RBDGTC)

ప్రారంభ సంవత్సరాలు

మార్చు

1838 సంవత్సరంలో గుబ్బిలోని లింగాయతి కుటుంబంలో తోటదప్ప జన్మించారు. అతని కుటుంబం తరువాతి కాలంలో బెంగుళూరుకు తరలి వెళ్ళింది, అక్కడ మముల్‌పేటలో తన వ్యాపారాన్ని ప్రారంభించారు.

సామాజిక సేవ

మార్చు
 
RBDGTC ట్రస్ట్ ముందు గుబ్బి తోటదప్ప విగ్రహం

గుబ్బి తోటదప్పకు సంతానం లేదు. తన ఆస్తిని పర్యాటకులకు, విద్యార్థుల ప్రయోజనాలకు ఉపయోగించాలని అతని ఆశయం. రావు బహదూర్ ధర్మప్రవర్ధ గుబ్బి తోటదప్ప చారిటీస్ (RBDGTC) అనే ట్రస్ట్ ను స్థాపించారు. 1897లో, ఈ ట్రస్ట్ బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని భూమిని కొనుగోలు చేసింది. 1903 ఫిబ్రవరి 11న, నాలుగవ కృష్ణరాజ ఒడయారు అధికారికంగా ధర్మఛత్రా (పర్యాటకులకు), ఉచిత హాస్టల్ (విద్యార్థులకు) ప్రారంభించారు.[2] తన చివరి రోజులలో అతను తన ఆస్తి మొత్తాన్ని RBDGTC ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. కె.పుట్టన్న చెట్టిని ఆ ట్రస్ట్ యొక్క మొదటి అధ్యక్షుడిగా నియమించారు. ఈ ట్రస్ట్ దాని పనిని కొనసాగిస్తోంది. ఈ హాస్టల్ సదుపాయం కర్ణాటకలో విస్తరించి ఉంది. 2005లో, హాస్టల్ పునర్నిర్మించబడింది. దాని శత జయంతి కోసం ట్రస్ట్ ఆదాయ వనరుగా కెంపెగౌడ బస్‌స్టేషన్ వద్ద బెల్ హోటల్ నిర్మించింది. బస సౌకర్యాలు నామమాత్రపు రుసుముతో వసతి సదుపాయం ఉంది. మతంతో సంబంధం లేకుండా అందరికీ ప్రవేశం ఉంది.[2] వీరశైవా (లింగాయతి) వర్గానికి చెందిన విద్యార్థులకు హాస్టల్‌లో ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వంవారు హాస్టల్ మంజూరు చేయలేదు. ప్రతి సంవత్సరం లింగాయతి విద్యార్థులకు అర్హత కోసం ట్రస్ట్ స్కాలర్షిప్పులు ఇస్తుంది.[3]

గౌరవాలు

మార్చు
  • 1905 లో మైసూర్ మహారాజు, నాలుగవ కృష్ణరాజ ఒడయారు తన సామాజిక సేవలకు గుర్తింపుగా "ధర్మప్రవర్థ" అనే ప్రసంశ ఇచ్చారు,
  • 1910 లో, జార్జ్ V, అప్పటి భారతదేశం యొక్క చక్రవర్తి, అతనికి "రావు బహదూర్" బిరుదు ఇచ్చి సత్కరించాడు.

1910 ఫిబ్రవరి 21న, 72 సంవత్సరాల వయస్సులో తోటదప్ప మరణించారు.

ప్రభావం

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Divya Sreedharan. "For now, this old shelter". Online Edition of the Hindu, dated 2 February 2003. 2003, the Hindu. Archived from the original on 30 ఆగస్టు 2014. Retrieved 28 August 2014.
  2. 2.0 2.1 Y Maheswara Reddy. "A model for sustainable charity". the Indian express, dated 6 December 2011. 2011, the newindianexpress. Archived from the original on 7 అక్టోబరు 2014. Retrieved 28 August 2014.
  3. Staff Reporter. "Applications invited". Online Edition of the Hindu, dated 23 September 2012. 2012, The Hindu. Retrieved 28 August 2014.

బాహ్య లింకులు

మార్చు