గురక (Snoring) చాలా సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య. నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి నిద్రలేమికి కారణం అవుతుంది.

పంది గురక

ఇది శ్వాసించే సమయంలో సహజంగా ఎదుర్కొనే సమస్య. నిద్రించే సమయంలో వ్యక్తి శ్వాసపీల్చేటప్పుడు, శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గురకకు దారితీస్తుంది. నిద్రిస్తున్నపుడు శ్వాసతీసుకోవడంలో గాలి సర్కులేట్ అవుతూ ఓకల్ కార్డులను కంపింప చేస్తూ ధ్వని పుట్టిస్తుంది. గాలి అధికమయ్యే కొద్ది ధ్వని అధికమవుతుంది. నిద్రించే సమయంలో నోరు, ముక్కు ద్వారా గాలి సులభంగా పోకపోవడం వల్ల గురకకు కారణం అవుతుంది.[1]

కారణాలు

మార్చు

వైద్య సలహాలు

మార్చు
  • లావుగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.
  • నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మంచాన్ని తలవైపు ఎత్తు ఉండేలాగా అమర్చుకోండి.
  • నీటి ఆవిరిలో యూకలిప్టస్ తైలాన్ని వేసి ఆవిరి పడితే శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తగ్గుతుంది.
  • గురక నిలపడానికి, ఆవిరి పట్టడం చాలా సింపుల్ హోం రెమెడీ. ఇది శాస్వనాళంలో మ్యూకస్ ను బయటకు నెట్టివేయడం వల్ల నాజల్ బ్లాకేజ్ ను క్లియర్ చేస్తుంది. దాంతో శ్వాస ఫ్రీగా ఆడుతుంది.

ఇదికూడా చూడండి

మార్చు

నిద్రలో శ్వాసకు అంతరాయాలు

మూలాలు

మార్చు
  1. Sindhu (2014-01-08). "గురక నివారించడానికి కొన్ని ఉత్తమ చిట్కాలు". telugu.boldsky.com. Retrieved 2020-09-25.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గురక&oldid=4306215" నుండి వెలికితీశారు