గురు హర్ గోబింద్

గురు హర్ గోబింద్, సచ్చా బాద్షా ("నిజమైన చక్రవర్తి")గా సుప్రఖ్యాతుడైన, (19 జూన్ 1595 – 3 మార్చి 1644)[1][2] సిక్ఖు గురువుల్లో ఆరవ వ్యక్తి. ముఘల్ చక్రవర్తి జహంగీర్ ఆయన తండ్రి, ఐదవ సిక్ఖు గురువు గురు అర్జున్ను చంపించడంతో 30 మే 1606లో గురువు అయ్యేనాటికి ఆయనకు 11 సంవత్సరాల వయసు.[3] ఇస్లామిక్ మత హింసను నిరోధించి, మత స్వేచ్ఛను రక్షించడానికి సిక్ఖు మతం లోపల అంతర్గతంగా సైనిక సంప్రదాయాన్ని ప్రారంభించినందుకు గుర్తుకు వస్తారు.[3][4] సిక్ఖు గురువుగా ఆయన 37 సంవత్సరాల, 9 నెలల, 3 రోజుల పాటు అత్యంత ఎక్కువ కాలం కొనసాగారు.

గురు హర్ గోబింద్
ਗੁਰੂ ਹਰਿਗੋਬਿੰਦ ਜੀ
గురు హర్ గోబింద్ వాటర్ కలర్ పెయింటింగ్
ప్రభుత్వ మ్యూజియం, చండీగఢ్
జననం19 June 1595 (1595-06-19)
మరణం3 March 1644 (1644-03-04) (aged 48)[1]
ఇతర పేర్లుఆరవ గురువు
సచ్చా బాద్షా
సుపరిచితుడు/
సుపరిచితురాలు
జాబితా
అంతకు ముందు వారుగురు అర్జున్
తరువాతివారుగురు హర్ రాయ్
జీవిత భాగస్వామిమాతా దామోదరి, మాతా నానకీ, మాతా మహాదేవి
పిల్లలుబాబా గుర్దితా, బాబా సూరజ్ మాల్, బాబా అని రాయ్, బాబా అతల్ రాయ్, గురు తేజ్ బహదూర్, బీబీ బిరో
తల్లిదండ్రులుగురు అర్జున్ & మాతా గంగ

తొలినాళ్ళు

మార్చు

1595 సంవత్సరంలో అమృత్ సర్ కు పశ్చిమాన 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వదలి గురు గ్రామంలో గురు హర్గోబింద్ జన్మించారు.[1][5] అతని తండ్రి, సిక్ఖు గురు పరంపరలో ఐదవ గురువు గురు అర్జున్ ని ముఘల్ చక్రవర్తి జహంగీర్ బంధించి, చిత్రహింసలకు గురిచేసి, చంపారు.[4][6] 25 మే 1606న గురు అర్జున్ ను తన వారసునిగా హర్ గోబింద్ ను ప్రకటించారు, మే 30న ఆయన మరణశిక్ష తర్వాత, 24 జూన్ 1606న వారసత్వ కార్యక్రమం నిర్వహించారు.[3][5] గురు హర్ గోబింద్ కు ఆయన తండ్రి సిక్ఖు ప్రజలను కాపాడేందుకు సైనిక సంప్రదాయాన్ని ప్రారంభించమని సూచించారు.[4] అధికారంలోకి రాగానే ఆయన రెండు కత్తులను పెట్టారు: ఒకటి ఆయన ఆధ్యాత్మిక అధికారాన్ని (పిరి), మరొకటి తాత్కాలిక లేక భౌతిక అధికారాన్ని (మిరి) సూచిస్తాయి.[3][7] దాంతో ఆయన సిక్ఖు విశ్వాసంలో సైనిక సంప్రదాయాన్ని ప్రారంభించారు.[3][4] గురు హర్ గోబింద్ కు ముగ్గురు భార్యలు: మాతా దామోదరీ, మాతా నానకి, మాతా మహా దేవి.[1][8]

గురు హర్ గోబింద్ రాజకీయ వ్యవహారాల్లో రాణించారు, ఆయన దర్బారు శోభాకరంగా ఉండేది. మత విశ్వాసానికి అంకితమైన అనుచరులకు శిక్షణనివ్వడం, ఆయుధాలు సమకూర్చుకోవడం ప్రారంభమైంది. క్రమంగా ఆయన ఏడువందలు గుర్రాలు కలిగి, తన సైన్యం మూడువందల ఆశ్విక దళానికి, అరవై తుపాకీ దళానికి కాలగతిలో అభివృద్ధి చెందింది. దీనికి తోడు ఐదువందల మంది పంజాబ్ లోని మాఝా ప్రాంతం నుంచి కాల్బలం నుంచి వచ్చి చేరారు.

వ్యక్తిత్వం

మార్చు

గురు హర్ గోబింద్ యుద్ధ కళల్లో గొప్ప నిష్ణాతుడు, శస్త్రార్ విద్య పారంగతునిగా పేరుపొందారు,[9] అద్భుతమైన వేటగాడు.[10] గురు హర్ గోబింద్ ప్రజలను శారీరికంగా మంచి ఆరోగ్యం, స్థితి నిలబెట్టుకొమ్మని, భౌతికమైన పోరాటానికి ఎప్పుడూ వారి శరీరాలు సిద్ధంగా ఉండాలని ప్రోత్సహించారు.

సమర్థ్ రామదాస్, గురు హర్ గోబింద్

మార్చు
 
గురు హర్ గోబింద్ జీ, సమర్థ్ రామదాస్

ప్రాచీన పంజాబీ రాతప్రతి పంజా సాఖియన్ ను అనుసరించిన సిక్ఖు సంప్రదాయం ప్రకారం గురు హర్ గోబింద్, సమర్థ్ రామదాస్ శ్రీనగర్ లో గర్హ్ వాల్ కొండల్లో కలిశారు. ఈ సమావేశాన్ని హనుమత్ స్వామీ 1793లో రాసిన రామదాస్ స్వామీ బఖర్ అన్న మరాఠీ మూలంలో ధృవపరిచారు. 1630ల్లో సమర్థ్ రామదాస్ ఉత్తరానికి చేసిన తీర్థయాత్రలు, గురు హర్ గోబింద్ నానాక్ మఠాకు తూర్పుకు ప్రయాణించినప్పుడు ఈ కలయిక సాధ్యపడివుంటుందని భావిస్తున్నారు. వారు కలసినప్పుడు గురు హర గోబింద్ అప్పుడే వేట వినోదం నుంచి వెనక్కివచ్చారని అంటారు. ఆయన పూర్తిగా సాయుధుడై, గుర్రాన్ని అధిరోహించి ఉన్నారు.

"మీరు గురునానక్ గద్దెను ఆక్రమించారని విన్నాను. గురు నానక్ త్యాగ సింధువు. మీరు ఆయుధాలు ధరించి, సైన్యాన్ని, అశ్వాలని కలిగివున్నారు. మిమ్మల్ని సచ్చా బాద్షా (నిజమైన చక్రవర్తి) అని పిలిపించుకుంటున్నారు. మీరు ఏ విధమైన సాధువు?" అన్నారు సమర్థ్ రామదాస్.

గురు హర్ గోబింద్ సమాధానమిస్తూ, "ఆంతరమున సన్యాసిని, బాహిరమున రాకుమారుణ్ణి. ఆయుధం పేదసాదలకు రక్షణ, క్రూర రాజుకు శిక్షకు. బాబా నానక్ ప్రపంచాన్ని విడిచిపెట్టలేదు మాయను విడిచిపెట్టారు:

"బాతన్ ఫకీరీ, జాహిర్ అమీరీ, శస్తర్ గరీబీ కీ రఖ్యా, జర్వాన్ కీ భఖియా, బాబా నానక్ సన్సార్ నహీ త్యాగ్యా, మాయా త్యాగి థీ."

గురు హర్ గోబింద్ చెప్పిన ఈ మాటలు సమర్థ రామదాస్ హృదయంలో స్పందన కలిగించింది, వెనువెంటనే ఆయన ఇది మన మనసులను కలుపుతున్న భావమని సమాధానం ఇచ్చారు. [11] [12]

జహంగీరుతో సంబంధాలు, ముఘల్స్ తో పోరాటాలు

మార్చు
 
గురు హర్ గోబింద్ జహంగీర్ ఆదేశంతో గ్వాలియర్ కోట నుంచి విడుదలయ్యారు

గురు హర్ గోబింద్ తన అనుచరులను సాయుధులను చేయడానికి అనేక కారణాలున్నాయి. బాహ్య, అంతర్గత స్థితిగతులు మారిపోతున్నాయి. కొత్త వాతావరణానికి అనుగుణంగా తన పాలసీలను గురువు సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. అక్బర్ కాలంలో మత సహనం ఉండగా సిక్ఖు మతం, దాని నిర్మాణం రూపుదిద్దుకున్నాయి. అక్బర్ సిక్ఖుమతం అభివృద్ధిలో ఎప్పుడు జోక్యం కలిగించుకోలేదు. పైగా కొన్ని సార్లు సహకరించారు. అయితే గురు అర్జున్ సింగ్ హత్య చేసి, గురు హర్ గోబింద్ ను ఖైదుచేయడంతో జహంగీరు హయాంలో మరింత సమస్యాత్మకమైన కాలం ముందుందని తెలిసింది. కేవలం శాంతియుతమైన నిర్మాణం ఇక ఏమాత్రం సరిపోదని తేలింది. గురు అర్జున్, గురు హర్ గోబింద్ ఇద్దరూ సిక్ఖు సమాజాన్ని ఆయుధాల శక్తి లేకుకండా కాపాడుకోవడం ఇక సాధ్యం కాదని అవగాహన చేసుకున్నారు.[7] సిక్ఖు గురువైన తన తండ్రిని జహంగీర్ చంపించడంతో సిక్ఖు సమాజపు సైనిక కోణంపై దృష్టిసారించడం ప్రధానమైంది. మిరీ, పిరీ (భౌతిక శక్తి, ఆధ్యాత్మిక అధికారం) అన్న రెండు కత్తులను సంకేతాత్మకంగా ధరించేవారు. రాందాస్ పూర్ (నేటి అమృత్ సర్)ను రక్షించేందుకు కోటని కట్టి, సాధారణమైన దర్బారు అకాల్ తఖ్త్ ఏర్పాటుచేశారు.[13]

గురు అర్జున్ మరణానంతరం హర్ గోబింద్ తీసుకున్న చర్యలతో జహంగీర్ గురు హర్ గోబింద్ ను గ్వాలియర్ కోటలో నిర్బంధించారు. ఆయన ఎన్నేళ్ళు జైలులో ఉన్నారో నిర్థారణగా తెలియదు, 1611 లేదా 1612 కావచ్చని భావిస్తున్నారు. ఆ సమయానికి ముఘల్ దర్బారులో మతావేశ పరులను జహంగీర్ కాలక్రమేణా దూరంపెట్టడం, ఆయన పాలసీల్లో మత సామరస్యం చోటుచేసుకోవడం జరిగాయి. హర్ గోబింద్ అమాయకుడని, ప్రమాదకారి కాదని నమ్మకం కలిగాకా విడుదలకు ఆదేశించారు.[13][14][15] జహంగీర్ హయాంలో ఆయన ముఘల్స్ కు వ్యతిరేకంగా రోహిల్లా యుద్ధంలో పాల్గొన్నారు. సిక్ఖుల సాయుధీకరణకు ఈ యుద్ధం ప్రతిస్పందన. గవర్నర్ అబ్దుల్ ఖాన్ నేతృత్వంలోని ముఘలులు సిక్ఖుల చేతిలో ఓటమి పాలయ్యారు.[16]

ఆయన విడుదల తర్వాత గురు హర్ గోబింద్-జహంగీర్ ల నడుమ చాలావరకూ స్నేహ సంబంధాలే కొనసాగాయి. జహంగీర్ పాలనాకాలంలో హర్ గోబింద్ పరిపాలనలో స్థానం పొందారు. జహంగీర్ కాశ్మీర్, రాజ్ పుతానా వెళ్ళినప్పుడు హర్ గోబింద్ ఆయనతో వెళ్ళారు, ఎంతో కాలం నుంచి తిరుగుబాట్లు చేస్తూ అన్ని అణచివేత ప్రయత్నాలను విఫలం చేస్తూన్న నాలాఘర్ కు చెందిన తారా చంద్ ను ఆయన అణచివేశారు.[17][18][19]

షాజహాన్ తో యుద్ధం

మార్చు

షాజహాన్ హయాంలో సంబంధాలు తిరిగి చెడిపోయాయి. షాజహాన్ మతసహనం లేని వ్యక్తి అయి లాహోర్ లో ఉన్న సిక్ఖుల తొలి పుణ్యక్షేత్రం బోలిని నాశనం చేశారు.[20] ముఘల్ అధికారులకు, సిక్ఖులకు మధ్య చిన్న తగాదాలుగా ప్రారంభమై పెద్ద స్థాయిలోకి మారుతూ పెద్ద ఎత్తున వేలాది వ్యక్తులూ ఇరువైపులా మరణించడానికి దారితీసింది.[7] అమృత్ సర్, కర్తర్ పూర్, ఇతర ప్రాంతాల్లో యుద్ధాల్లో పోరాడారు. గురు హర్ గోబింద్ ముఘల్ సైన్యాలను అమృత్ సర్ వద్ద అమృత్ సర్ యుద్ధంలో 1634న విజయం సాధించారు. గురు హర్ గోబింద్ పైకి మొఘల్ సైన్య విభాగాన్ని పంపారు, ఐతే దాడికి వచ్చినవారు ఓడిపోయి, వారి నాయకులు మృతిచెందారు.[21] గురు హర్ గోబింద్ ఓ కత్తి తీసుకుని, సామ్రాజ్యపు సైన్యాలపై తన సైన్యంతో దండయాత్రలకు వెళ్ళారు, ధైర్యంగా వారిని ప్రొవిన్షియల్ ముస్లిం గవర్నర్లు లేక వ్యక్తిగత ప్రత్యర్థులను ఓడించేందుకు నడిపారు. పైంద్ ఖాన్ ను ప్రావిన్షియల్ సైన్యాలకు నాయకునిగా నియమించి గురు హర్ గోబింద్ పై దండయాత్ర ప్రారంభించారు. గురు హర్ గోబింద్ పై దాడి జరిగింది కానీ చివరకు బాల్యమిత్రుడైన ఖాన్ ను స్వయంగా హర్ గోబింద్ చంపాల్సివచ్చింది. గురువు తిరిగి విజయుడై నిలిచారు.[21]

గురు హర్ గోబింద్ చిన్ననాటి మిత్రుడు పైంద్ ఖాన్ అతనికి శత్రువయ్యాడు. కారణాన్ని పలు ఆకరాలు చెప్తున్నదాన్ని బట్టి- గురువు అనుచరుడి విలువైన డేగను పైంద్ ఖాన్ అడిగి తీసుకుని, తిరిగిస్తానని చివరకు ఇవ్వకపోవడంతో చినికి చినికి గాలివాన అయింది. ఇతర ఆకరాల ప్రకారం ఖాన్ గర్వానికి హర్ గోబింద్ ఆత్మ గౌరవం సంఘర్షించాయి. గురు గోబింద్ ఎప్పటికీ ప్రమాదకరమేనని భావించే ముఘల్ అధికారులు కొందరు దీన్ని అవకాశంగా తీసుకున్నారు.[21] గురు హర్ గోబింద్ కూడా కార్తర్ పూర్ యుద్ధంలో పాల్గొన్నారు. 19 మార్చి 1644న పంజాబ్ ప్రాంతంలో కిరాత్ పూర్ రూప్ నగర్ వద్ద మరణించారు.

ప్రభావాలు

మార్చు

గురు హర్ గోబింద్ హయాంలో సిక్ఖులు పెద్ద సంఖ్యలో పెరిగారు, గురు అర్జున్ పాలసీలు, గురు హర్ గోబింద్ సాయుధ పద్ధతుల వల్ల సిక్ఖులు సామ్రాజ్యంలో విభిన్నమైన ప్రత్యేక అంగంగా కనిపించసాగారు. ఆయన ప్రభావం పట్ల గురు హర్ గోబింద్ కు అవగాహన ఉంది కానీ తన వ్యక్తిగత జీవితంలో తన నిజాయితీ కల వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. నానక్ గా తన జీవన శైలిని తీర్చిదిద్దుకుంటూ, గురు నానక్ తన పరంపర వారసుల్లో జీవించేవున్నారన్న గట్టి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.[22]

ప్రాచుర్యం, ప్రసిద్ధి

మార్చు

గురు హర్ గోబింద్ జీవితంలో చేసిన సుప్రసిద్ధ కార్యాలు ఇవి:

  • యుద్ధ కళలను, ఆయుధాలను ప్రవేశపెట్టి సిక్ఖుల రాజకీయ పాలసీని మార్చివేశారు.
  • మిరి, పిరి అన్న ఖడ్గాలను స్వీకరించారు.
  • సిక్ఖుల ఐదు తఖ్త్ ల్లో (అధికార పీఠాలు) ఒకటి అయిన అకాల్ తఖ్త్ను 1608లో నిర్మించారు.
  • పంజాబ్ ప్రాంతంలో జలందర్ జిల్లాలో కిరాత్ పూర్ నగరాన్ని నిర్మించారు.
  • గ్వాలియర్ కోటలో దాదాపు ఏడాదికి పైగా కాలం ఖైదు చేయబడ్డారు, విడుదల చేసేప్పుడు తోటి 52మంది రాజకీయ ఖైదీలను కూడా విడుదల చేయాలని పట్టుబట్టారు. దీన్నే సిక్ఖులు బంది చోర్ దివస్ గా జరుపుకుంటారు.
  • యుద్ధతంత్రంలో పాల్గొన్న తొలి సిక్ఖు గురువు.
  • పంజాబ్ ప్రాంతంలోని మాఝాలో ముఘలులను యుద్ధంలో ఓడించి ఆయన గెలుచుకున్న హర్ గోబింద్ పూర్ నగరానికి ఆయన పేరు పెట్టారు.

యుద్ధాలు

మార్చు
  1. రోహిల్లా యుద్ధం
  2. అమృత్ సర్ యుద్ధం (1634)
  3. కర్తార్ పూర్ యుద్ధం
  4. కిరాత్ పూర్ యుద్ధం
  5. గురుసార్ యుద్ధం
  6. హర్ గోబింద్ పూర్ యుద్ధం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Fauja Singh. "HARGOBIND GURU (1595-1644)". Encyclopaedia of Sikhism. Punjabi University Punjabi. Retrieved 7 December 2015.
  2. Guru Har Gobind Ji, the true emperor
  3. 3.0 3.1 3.2 3.3 3.4 HS Syan (2013), Sikh Militancy in the Seventeenth Century, IB Tauris, ISBN 978-1780762500, pages 48-55
  4. 4.0 4.1 4.2 4.3 Pashaura Singh (2005), Understanding the Martyrdom of Guru Arjan Archived 2016-03-03 at the Wayback Machine, Journal of Philosophical Society, 12(1), pp. 29-62
  5. 5.0 5.1 HS Singha (2009), Sikh Studies, Book 7, Hemkunt Press, ISBN 978-8170102458, pages 18-19
  6. Louis E. Fenech, Martyrdom in the Sikh Tradition, Oxford University Press, pages 118-121
  7. 7.0 7.1 7.2 V. D. Mahajan (1970). Muslim Rule In India. S. Chand, New Delhi, p.223.
  8. Fenech and McLeod (2014), Historical Dictionary of Sikhism, 3rd Edition, Rowman & Littlefield, ISBN 978-1442236004, page 145
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-13. Retrieved 2016-07-31.
  10. Grewal, J.S. Sikh History from Persian Sources: Translations of Major Texts ISBN 978-8185229171 "ఎందరో ఆయనకు భక్తులయ్యారు. నానక్ దేవునిలో ఏకత్వాన్ని నమ్మారు, మహమ్మదీయ తత్త్వ శాస్త్రంలో దాన్ని ఉద్ఘాటించిన విధంగానే విశ్వసించారు. ఆత్మలు ఒక శరీరం నుంచి మరోదానికి చేరడాన్ని కూడా విశ్వసించారు. మద్యం, పంది మాంసాలను మత చట్టానికి వ్యతిరేకమనే ప్రకటించారు. స్వయంగా తానే మాంసాహారాన్ని వదిలివేశారు. జంతువులకు హానిచేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ శాసించారు. ఆయన తర్వాతే మాంసాన్ని భుజించడం సిక్ఖుల్లో విస్తరించింది. ఆయన పరంపర వారసుడైన గురు అర్జున్ దేవ్ దీన్ని సరికాదని, చెడ్డ విషయమని భావించారు. ఆయన ప్రజలు మాంసాన్ని తినడం నిషేధిస్తూ, 'ఇది నానక్ ఆకాంక్షలకు అనుగుణమైనది కాద'న్నారు. గురు అర్జున్ కుమారుడు గురు హర్ గోబింద్ వేటాడారు, మాంసం తిన్నారు. ఆయన అనుయాయుల్లో పలువురు ఆ అలవాటు స్వీకరించారు.
  11. Dr.Ganda Singh (1979). Guru Hargobind and Samarth Ram Das :Punjab Past and Present 13(1). pp. 240–242.
  12. Sikhiwiki (2015). Guru Hargobind and Samarth Ramdas Meeting.
  13. 13.0 13.1 Phyllis G. Jestice (2004). Holy People of the World: A Cross-cultural Encyclopedia, Volume 1. ABC-CLIO. pp. 345, 346. ISBN 9781576073551.
  14. Arvind-Pal Singh Mandair (2013). Sikhism: A Guide for the Perplexed. A & C Black. p. 48. ISBN 9781441117083.
  15. Raj Pal Singh (2004). The Sikhs : Their Journey Of Five Hundred Years. Pentagon Press. pp. 22, 23. ISBN 9788186505465.
  16. Jaques, Tony. Dictionary of Battles and Sieges. Greenwood Publishing Group. p. 860. ISBN 978-0-313-33536-5. Retrieved 31 July 2010.
  17. Jasbir Singh Sarna (2014). The Sikh Shrines in Jammu & Kashmir. p. 28. ISBN 9788186741306.[permanent dead link]
  18. Surjit Singh Gandhi (2007). History of Sikh Gurus Retold: 1606-1708 C.E. Atlatic Publishers & Distributors. p. 506. ISBN 9788126908592.
  19. Joseph Davey Cunningham, H.L.O. Garrett (2012). "A History of the Sikhs from the Origin of the Nation to the Battles of the Sutlej". Asian Educational Services. p. 57. ISBN 9788120609501.
  20. Sikhism Origin and Development By Dalbir Singh Dhillon, p121 "In the year A. D. 1632, Shah Jahan revived his religious policy and issued ... of his policy, the Gurdwara and a Baoli at Lahore was destroyed and a mosque was erected over its place"
  21. 21.0 21.1 21.2 Cunningham, Joseph Davey (1849). A History Of The Sikhs (1853 ed.). London: John Murray. pp. 55.
  22. Cunningham, Joseph Davey (1849). A History Of The Sikhs (1853 ed.). London: John Murray. pp. 57.

ఇవీ చదవండి

మార్చు
  • డాక్టర్ హర్జిందర్ సింగ్ దిల్జీర్ (2005), Sikh Twareekh Vich Akal Takht Sahib Da Role, Sikh University Press.
  • డాక్టర్ హర్జిందర్ సింగ్ దిల్జీర్ (2011), Akal Takht Sahib (Concept & Role), Sikh University Press.
  • డాక్టర్ హర్జిందర్ సింగ్ దిల్జీర్ (2008), Sikh Twareekh (5 volumes), Sikh University Press.
  • డాక్టర్ హర్జిందర్ సింగ్ దిల్జీర్ (2012), SIKH HISTORY in 10 volumes, Sikh University Press.

సకి

బయటి లింకులు

మార్చు