గురు తేగ్ బహదూర్

సిక్కుల తొమ్మిదో గురువు
(గురు తేజ్ బహదూర్ నుండి దారిమార్పు చెందింది)

గురు తేగ్ బహదూర్ (పంజాబీ: ਗੁਰੂ ਤੇਗ਼ ਬਹਾਦਰ) (1621 ఏప్రిల్ 21 - 1675 నవంబరు 24 [1][2]), 10 మంది సిక్ఖు గురువుల్లో తొమ్మిదవ వారు. తొలి గురువు నానక్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఆయన రాసిన 115 కవితలు గురు గ్రంథ్ సాహిబ్ లో ఉన్నాయి. కాశ్మీరీ పండిట్లను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేస్తూంటే వ్యతిరేకించినందుకు, తాను స్వయంగా ఇస్లాం మతంలోకి మారేందుకు తిరస్కరించినందుకుతో గురు తేగ్ బహదూర్ ను ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీలో బహిరంగంగా తల నరికించి చంపారు.[3][4][5][6] గురు ద్వారా సిస్ గంజ్ సాహిబ్, గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ అన్న పేర్లతో ఢిల్లీలో ఉన్న రెండు ప్రదేశాలు ఆయనను నరికి చంపడం, ఆయన శరీరాన్ని అంత్యక్రియలు చేయడం జరిగిన ప్రదేశాలు, స్మృతి మందిరాలు.

గురు తేగ్ బహదూర్
జననం
త్యాగ్ మాల్

21 April 1621 (1621-04-21)
మరణం24 November 1675 (1675-11-25) (aged 54)
జాతీయతభారత దేశం
ఇతర పేర్లుభారత దేశపు కవచం, ఖడ్గపు ఉన్నతి, తొమ్మిదో గురువు, నిజమైన రాజు
క్రియాశీల సంవత్సరాలు1664–1675
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గురు గ్రంథ్ సాహిబ్ కు ఆధ్యాత్మికమైన కృషి, బలవంతంగా మత మార్పిడికి గురవుతున్న కాశ్మీరీ పండిట్ల మతమార్పిడిని వ్యతిరేకంగా నిలిచి, తానూ ఇస్లాంలోకి మారినందుకు బలిదానం, ఆనంద్ పూర్ సాహిబ్ స్థాపన, పటియాలా స్థాపన
అంతకు ముందు వారుగురు హర్ క్రిషన్
తరువాతివారుగురు గోబింద్ సింగ్
పిల్లలుగురు గోబింద్ సింగ్

తొలినాళ్ళ జీవితం

మార్చు

గురు తేగ్ బహదూర్ సోధి కుటుంబంలో జన్మించారు.[7] ఆరవ సిక్ఖు గురువైన గురు హర్ గోబింద్కు ఒక కుమార్తె బీబీ వీరో, ఐదుగురు కుమారులు: బాబా గురుదిత్తా, సూరజ్ మాల్, అని రాయ్, త్యాగా మాల్ ఖత్రీ ఉన్నారు.[8] త్యాగా మాల్ ఖత్రీ అమృత్ సర్లో 1 ఏప్రిల్ 1621న జన్మించారు. ఆయనకు తేగ్ బహదూర్ (ఖడ్గ ప్రశస్తి) అన్న పేరు ఆయన ముఘల్ సైన్యంతో జరిగిన పోరాటంలో కనబరిచిన వీరత్వాన్ని చూశాకా గురు హర్ గోబింద్ పెట్టారు.

అప్పట్లో అమృత్ సర్ సిక్ఖు విశ్వాసానికి ప్రధాన కేంద్రంగా విలసిల్లేది. సిక్ఖు గురువు స్థానం, దేశ వ్యాప్తంగా మసంద్ లు లేదా మత ప్రచారకులు వచ్చి గురువుతో మాట్లాడివెళ్ళే ప్రదేశం కావడంతో రాజ్యానికి రాజధాని అన్న స్థానాన్ని అభివృద్ధి చేసుకుంది. గురు తేగ్ బహదూర్ సిక్ఖు సంస్కృతిలో పెరిగారు. ఆయన విలువిద్య, గుర్రపు స్వారీ మొదలైన యుద్ధ కళల్లో శిక్షణ పొందారు, ప్రాచీన సాహిత్యాన్ని చదువుకున్నారు. ఆయన సుదీర్ఘ సమయం పాటు ఏకాంతంలోకి వెళ్ళి ధ్యానం సాగించేవారు. తేగ్ బహదూర్ మాతా గుజ్రిని 3 ఫిబ్రవరి 1633న వివాహం చేసుకున్నారు.[9]

బకాలా నివాసం

మార్చు

1640ల్లో గురు హర్ గోబింద్ మరణ కాలం ఆసన్నమైనప్పుడు ఆయన తన భార్య నానకీని అమృత్ సర్ జిల్లాలోని తన పూర్వీకుల గ్రామమైన బకాలాకు గురు తేగ్ బహదూర్, మాతా గుజ్రీలతో పాటు వెళ్ళమని ఆదేశించారు. గుర్ బిలాస్ దేస్విన్ పతిషాహిలో వర్ణించినదాని ప్రకారం బకాలా అప్పటికి అందమైన తటాకాలు, బావులు, బోలీలతో విలసిల్లే సుభిక్షమైన పట్టణం. గురు తేగ్ బహదూర్ బకాలాలో 26 సంవత్సరాల 9 నెలల 13 రోజుల పాటు ధ్యానం చేస్తూ, భార్య, తల్లితో జీవించారు.[10] ఆయన ప్రధానమైన సమయాన్ని ధ్యానంలోనే గడిపినా బాధ్యతాయుతంగా కుటుంబాన్ని చూసుకున్నారు. ఆయన బకాలాలో ఉన్న కాలంలో ఆ పట్టణం నుంచి పర్యటించి పలు ప్రదేశాలకు వెళ్ళేవారు, ఆ క్రమంలోనే ఢిల్లీలో సిక్ఖుల ఎనిమిదవ గురువు అయిన గురు హర్ క్రిషన్ను సందర్శించారు.[10]

గురువుగా

మార్చు

మార్చి 1664లో గురు హర్ క్రిషన్ కు మశూచి సోకింది. ఆయన అనుచరులు హర్ క్రిషన్ తదనంతరం ఎవరు తమను నడిపిస్తారని గురుత్వం గురించి ప్రశ్నించగా బాబా బకాలా అంటూ, తన వారసుడు బకాలాలో దొరుకుతాడని సూచించారు. గురువు మరణించేప్పుడు సందిగ్ధానికి తావిచ్చేలా వ్యక్తి పేరు కాక, ప్రదేశం పేరు ఉచ్చరించడంతో అనేకులు తామే కొత్త గురువులమని చెప్పుకోసాగారు.[11] గురువు స్థానాన్ని ఆశిస్తూ అంతమంది బయలుదేరడంతో సిక్ఖులు అయోమయంలో పడిపోయారు.[11][12]

గురు తేగ్ బహదూర్ 9వ సిక్ఖు గురువుగా ఎలా ఎంపికయ్యారన్న (నిర్ధారణ అయ్యారు) అంశంపై సిక్ఖు సంప్రదాయంలో ఓ గాథ ఉంది. బాబా మఖన్ షా లబానా అన్న సంపన్న వ్యాపారి తన జీవితాన్ని కాపాడమని ప్రార్థించి, తాను బతికి బట్టకడితే సిక్ఖు గురువుకు 500 బంగారు నాణాలు కానుకగా సమర్పించుకుంటానని మొక్కుకున్నారు.[11] ఆయన తొమ్మిదవ గురువును వెతకడం ప్రారంభించారు. ఆయన గురువు పదవి తనదంటే తనదంటున్న ప్రతి హక్కుదారు వద్దకూ వెళ్ళి రెండేసి బంగారు నాణాలు ఇవ్వనారంభించారు, నిజమైన సిక్ఖు గురువుకు తాను మనసులో మొక్కుకున్న ఐదువందల బంగారు నాణాల మొక్కు తెలిసివుంటుందన్న ఆలోచనతో. ప్రతి గురు నామ వాచ్యుడూ ఆయన వద్ద రెండేసి బంగారు నాణాలు స్వీకరించి, ఆయనకు వీడ్కోలు పలుకుతున్నారు.[11] ఆయన ఆ క్రమంలో గురు తేగ్ బహదూర్ కూడా బకాలా వాసి కాబట్టి ఆయన అయివుండచ్చన్న ఆలోచనతో, సాధారణంగా తానిచ్చే రెండు నాణాలను బహదూర్ కు కూడా ఇచ్చారు. తేగ్ బహదూర్ ఆయనను దయతో దీవిస్తూ, అయినా లబానా మొక్కుకున్నది ఐదువందల నాణాలని గుర్తుచేశారు. మఖాన్ షా లాబానా ఆశ్చర్యానందాలతో పులకితుడై, వెంటనే తేరుకుని పై అంతస్తుకు పరుగు తీశారు. అక్కడ నుంచి జనాలందరినీ ఉద్దేశిస్తూ పెద్ద పెట్టున "గురు లాఢో రే, గురు లాఢో రే" అంటే నేను గురువు ఎవరో కనుగొన్నాను, నేను గురువును కనుగొన్నాను అని అరిచారు.[11]

ఆగస్టు 1664లో సిక్ఖు సంగత్ బకాలా వచ్చి, తేగ్ బహదూర్ ను 9వ గురువుగా అభిషేకించింది. దివాన్ దుర్గా మాల్ నేతృత్వంలోని సంగత్ గురుత్వాన్ని తేగ్ బహదూర్ కు ఇస్తూ అధికారిక లాంఛన యుతమైన తిక్కా వేడుకలు నిర్వహించింది.[12]

ముఘల్ చక్రవర్తి జహంగీర్ గురు అర్జున్ను చంపాకా ప్రారంభమైన సిక్ఖు ఆచారం ప్రకారం సాయుధులైన అంగరక్షకులు ఆయనను చుట్టుముట్టారు.[13] తేగ్ బహదూర్ ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు.[14]

కృతులు

మార్చు

గురు గ్రంథ్ సాహిబ్ కు అనేకమైన అనేక కృతులు ఆయన రచించినవి చేరాయి, వాటిలో గ్రంథ్ సాహిబ్ చివరిలో వచ్చే సలోక్ లు, ద్విపదలు కూడా ఉన్నాయి.[14] గురు తేగ్ బహదూర్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు, మహాలీలో అనేక సిక్ఖు మందిరాలు నిర్మించమని గోబింద్ సహాలీ ఆయనను అడిగారు. ఆయన రచనల్లో 116 శబద్ లు, 15 రాగాలు, సిక్ఖు మత సంప్రదాయంలోని బనిలో భాగమైన 782 కృతులు ఉన్నాయి.[15]

ఆది గ్రంథ్ లోని 219 నుంచి 1427 పుటల వరకూ ఆయన రచించిన రచనలే ఉన్నాయి.[16] భగవంతుని గుణాలు, మానవ బంధాలు, శరీరం, మనస్సు, బుద్ధి, దు:ఖం, ఆత్మ గౌరవం, సేవ, మరణం, కర్తవ్యం వంటి అనేకానేక విస్తృతమైన అంశాలకు విస్తరించివుంది..[16] ఉదాహరణకు సోరాత్ రాగ్లో గురు తేగ్ బహదూర్ ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో వివరిస్తారిలా, [16]

జో న దుఖ్ మే దుఖ్ నహీ మానే, సుఖ్ స్నేహ్ అర్ భాయ్ నహీ జా కై, కాంచన్ మాతీ మానే
న నింద్య నేహ్న్ ఉస్తాత్ జా కై లోభ్ మోహ్ అభిమానా
హరక్జ్ సోగ్ తే రహే నియరో నహే మాన్ అప్ మానా, ఆశా మన్సా సగల్ త్యాగే
జగ్ తే రహే నిరాశా, కామ్ క్రోధ్ జేహ్ పర్సై
తే ఘట్ బ్రహ్మ నివాసా

ఎవరైతే దురదృష్టానికి చీకాకు పడడో, ఎవరైతే సుఖాలు, బంధాలు, భయాల వెనుకపడడో, ఎవరైతే బంగారాన్ని మట్టిగా ఎంచుతాడో
అతను ఇతరుల గురించి చెడుగానూ మాట్లాడడు, తన గురించి పొగిడితే పొంగిపోడు, అసూయ, బంధాలు, దురహంకారాలను తప్పించుకుంటాడు.
ఉప్పొంగిపోవడానికి, కుమిలిపోవడానికి అతను అతీతుడు, అవమానాలు, సన్మానాల ప్రభావానికి లోనుకాడు. కోరిక, అసూయలను త్యజిస్తాడు.
బాహ్య ప్రపంచానికి తగులుకోడు, ఇంద్రియాలు, కోపం అతన్ని ప్రభావితం చేయవు.
భగవంతుడు అలాంటి వ్యక్తిలో నివసిస్తాడు.

— గురు తేగ్ బహదూర్, సోరాత్ 633 (గోపాల్ సింగ్ ఆంగ్లానువాదానికి సంతోష్ తెలుగు సేత), [16]

ప్రయాణాలు

మార్చు

ఢాకా, అస్సాం సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు గురు తేగ్ బహదూర్ విస్తారంగా పర్యటించి తొలి సిక్ఖు గురువు నానక్ బోధనలు ప్రవచించారు. ఆయన పర్యటించి, వసించిన ప్రాంతాలు సిక్ఖు మందిరాలు అయ్యాయి.[17] ఆయన ప్రయాణాల్లో గురు తేగ్ బహదూర్ సిక్ఖు ఆలోచనలు, సందేశం విస్తరిస్తూనే సముదాయ బావులు, లాంగర్లు (పేదల కోసం స్వచ్ఛంద సముదాయ వంటశాల) నెలకొల్పారు.[18][19]

400వ జయంతి

మార్చు

తేగ్ బహదూర్ 400వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ 2022 ఏప్రిల్ 21న ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే గురు తేగ్ బహుదూర్ జ్ఞాపకార్థం ఓ పోస్టల్ స్టాంపు, నాణేన్ని కూడా విడుదల చేయనున్నారు.[20]

మూలాలు

మార్చు
 1. W. H. McLeod (1984). Textual Sources for the Study of Sikhism. Manchester University Press. pp. 31–33. Retrieved 14 November 2013.
 2. "The Ninth Master Guru Tegh Bahadur (1621 - 1675)". sikhs.org. Retrieved 23 November 2014.
 3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; cs2013 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; pslf అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 5. Guru Tegh Bahadur BBC Religions (2009)
 6. Islamic Jihad: A Legacy of Forced Conversion, Imperialism, and Slavery - By M. A. Khan, page 199
 7. Nabha, Kahan. Mahan Kosh.
 8. "Guru Gobind". Archived from the original on 2015-01-08. Retrieved 2016-08-01.
 9. Smith, Bonnie (2008). The Oxford encyclopedia of women in world history. Oxford, New York: Oxford University Press. p. 410. ISBN 978-0-19-514890-9.
 10. 10.0 10.1 Gandhi, Surjit (2007). History of Sikh gurus retold. Atlantic Publishers. pp. 621–622. ISBN 978-81-269-0858-5.
 11. 11.0 11.1 11.2 11.3 11.4 Kohli, Mohindar (1992). Guru Tegh Bahadur : testimony of conscience. Sahitya Akademi. pp. 13–15. ISBN 978-81-7201-234-2.
 12. 12.0 12.1 Singha, H. S. (2000). The encyclopedia of Sikhism. Hemkunt Publishers. p. 85. ISBN 978-81-7010-301-1.
 13. H.R. Gupta. History of the Sikhs: The Sikh Gurus, 1469-1708. Vol. 1. p. 188. ISBN 9788121502764.
 14. 14.0 14.1 Kohli, Mohindar (1992). Guru Tegh Bahadur : testimony of conscience. Sahitya Akademi. pp. 37–41. ISBN 978-81-7201-234-2.
 15. Singh, Prithi (2006). The history of Sikh gurus. Lotus Press. p. 170. ISBN 978-81-8382-075-2.
 16. 16.0 16.1 16.2 16.3 Tegh Bahadur (Translated by Gopal Singh) (2005). Mahalla nawan : compositions of Guru Tegh Bahādur-the ninth guru (from Sri Guru Granth Sahib): Bāṇī Gurū Tega Bahādara. Allied Publishers. pp. xxviii–xxxiii, 15–27. ISBN 978-81-7764-897-3.
 17. Singha, H. S. (2000). The encyclopedia of Sikhism. Hemkunt Publishers. pp. 139–140. ISBN 978-81-7010-301-1.
 18. Singh, Prithi (2006). The history of Sikh gurus. Lotus Press. pp. 187–189. ISBN 978-81-8382-075-2.
 19. Pruthi, Raj (2004). Sikhism and Indian civilization. p. 88. ISBN 978-81-7141-879-4.
 20. "మోదీ నయా ట్రెండ్.. గురువారం ఎర్రకోట నుంచి ప్రసంగం". ETV Bharat News. Retrieved 2022-04-18.