గులాబ్ జామున్
గులాబ్ జామ్ ఘనరూప పాలు కలిగిన వంటకం.
![]() గులాబ్ జామ్ లతో కూడిన పాత్ర | |
మూలము | |
---|---|
ఇతర పేర్లు | పాకిస్థాన్ : జామన్ ఇతర దేశాలు : లాల్‌మోహన్,జాగ్ మోహన్, గర్బీలా సిమాన్,షాహి, కలా జామ్, వాఫెల్ బాల్. |
ప్రదేశం లేదా రాష్ట్రం | పాకిస్థాన్, భారతదేశము, నేపాల్, బంగ్లాదేశ్, ట్రినిడాడ్, గయానా, సురినాం, జమైకా. |
వంటకం వివరాలు | |
వడ్డించే విధానం | Dessert |
వడ్డించే ఉష్ణోగ్రత | వేడి, శీతల, లేదా సాధారణ ఉష్ణోగ్రత |
ప్రధానపదార్థాలు | కోవా, జాఫ్రాన్ |
వైవిధ్యాలు | కాలా జామున్ |


పరిచయం సవరించు
ఈ వంటకం దక్షిణ ఆసియాలో ప్రసిద్ధ దేశాలైన భారతదేశము, శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో అధిక ప్రాచుర్యం పొందినది. అంతే కాకుండ ఇది కరేబియన్ దేశాలైన థాయ్‌లాండ్, గయానా, సురినాం, జమైకా లలో కూడా ప్రసిద్ధి చెందిన వంటకం. నేపాల్ లో దీనిని "లాల్-మోహన్" అని పిలుస్తారు. దీనిని ప్రధానంగా ఘనరూప పాలతో తయారుచేస్తారు. సాంప్రదాయకంగా దీనిని తాజా పెరుగుతో కూడిన పాలతో కూడా తయారుచేస్తారు. భారతదేశంలో ఘన పాల ఉత్పత్తులను పాలను తక్కువ ఉష్ణం అందించి చాలాసేపు దానిలో ఉన్న నీటిశాతం పూర్తిగా పోవువరకు వేడిచేసి తయారుచేస్తారు. ఈ ఘనాకార పాల ఉత్పత్తిని "ఖోయా" అని పాకిస్థాన్, ఇండియాలలో పిలుస్తారు. ఈ పదార్థాన్ని చిన్న చిన్న గోళాకార ఉండలుగా చేస్తారు. వాటిని అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద వేయించి (సుమారు 148 °C వరకు) తయారుచేస్తారు.[1] అలా వేగిన ఉండల్నితీసి పాకంలో వెయ్యాలి. పది నిముషాలు అలాగే ఉంచితే పాకం పీల్చుకొని గులాబ్ జాములు తినటానికి రెడీగా ఉంటాయి.[2] ఈ రోజుల్లో "గులాబ్ జామ్" మిశ్రమం మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ వంటకాన్ని శుభకార్యాలలోనూ, పుట్టిన రోజు పార్టీలలోనూ ఉపయోగిస్తారు.
పద వ్యుత్పత్తి సవరించు
"గులాబ్ జామ్" అనే పదం పర్షియా పదమైన gol (పువ్వు), āb (నీరు) ల నుండి పుట్టినది. దీని అర్థము రోజ్ వాటర్ తో కూడిన దర్వం, ఉర్థూలో Jaman, హిందూస్థానిలో jamun, m., అనగా అదే ఆకారం పరిమాణం గల సైజైజియం జంబోలానమ్ అనే పండు అని అర్థము.[3]
తయారీ విధానము సవరించు
కావలసిన పదార్దములు సవరించు
- గులాబ్ జామ్ పేకెట్ : ఒకటి (200g)
- పంచదార : అర కేజీ (500గ్రా)
- యాలుకలపొడి : అర టీ స్పూన్
- నూనె : పావుకేజీ
విధానం సవరించు
- గులాబ్ జామ్ పెకిట్ కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళుపోసి కలపాలి.
- ఒక పది నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
- పక్క స్టవ్ కూడా వెలిగించి, వేరే గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి లేత పాకం పట్టాలి.
- కలిపిన పిండిని తీసుకోని చిన్నచిన్న ఉండలుగా చేసి, కాగే నూనెలో చిన్న మంట మీద దోరగా వేగనివ్వాలి.
- అలా వేగిన ఉండల్నితీసి పాకంలో వెయ్యాలి. పది నిముషాలు అలాగే ఉంచితే పాకం పీల్చుకొని గులాబ్ జాంలు తినటానికి రెడీగా ఉంటాయి.
- రుచికరమైన గులాబ్ జామ్ తయారీకి పిండి కలిపేటప్పుడు అందులో కాస్త పన్నీర్ కలిపితే జామూన్‌లు మృదువుగా ఉంటాయి. అలాగే పిండిని కలిపే సమయంలో జీడిపప్పులను పొడిగా కొట్టి కలిపితే రుచితో పాటు వెరైటీగా ఉంటాయి.
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ Marty Snortum, Lachu Moorjani (2005). Ajanta: regional feasts of India. Gibbs Smith. p. 17. ISBN 1-58685-777-0.
- ↑ shraddha.bht. "Gulab Jamoon". Konkani Recipes. Archived from the original on 7 జూలై 2011. Retrieved 25 May 2010.
- ↑ Sweet Invention: A History of Dessert.
ఇతర పఠనాలు సవరించు
- Lachu Moorjani (2005). Ajanta: Regional Feasts of India. Salt Lake City, UT: Gibbs Smith. ISBN 1-58685-777-0.