గుహ్యేశ్వరి ఆలయం

గుహ్యేశ్వరి ఆలయం (నేపాలీ: गुह्येश्वरी मन्दिर)ను, గుహేశ్వరి లేదా గుహ్జేశ్వరి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్న పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం గుహ్యేశ్వరి లేదా ఆది శక్తి (దుర్గా దేవి)కి అంకితం చేయబడింది. ఈ ఆలయం నేపాల్లో ప్రసిద్ధ శక్తి పీఠంగా విలసిల్లుతుంది. ఇది పశుపతినాథ్ ఆలయానికి తూర్పున ఒక కిమీ దూరంలో, బాగమతి నది దక్షిణ ఒడ్డున ఉంది. ఈ ఆలయాన్ని పశుపతినాథ్ ఆలయానికి శక్తి పీఠంగా నమ్ముతారు. ఇది హిందువులకు, ముఖ్యంగా తాంత్రిక ఆరాధకులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశం. 17వ శతాబ్దంలో రాజు ప్రతాప్ మల్లా ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడి దేవతను గుహ్యేకలి అని కూడా పిలుస్తారు.[1]

గుహ్యేశ్వరి ఆలయం
గుహ్యేశ్వరి ఆలయ ప్రధాన ద్వారం
గుహ్యేశ్వరి ఆలయ ప్రధాన ద్వారం
భౌగోళికం
భౌగోళికాంశాలు27°42′40″N 85°21′12″E / 27.71111°N 85.35333°E / 27.71111; 85.35333
దేశంనేపాల్
జిల్లాఖాట్మాండు
ప్రదేశంఖాట్మాండు
సంస్కృతి
దైవంపార్వతి (గుహ్యేశ్వరి)
ముఖ్యమైన పర్వాలునవరాత్రి, దశైన్
వాస్తుశైలి
నిర్మాణ శైలులుపగోడ
శాసనాలుప్రతాప్ మల్లా, పృథివినారాయణషా శాసనం

వ్యుత్పత్తి శాస్త్రం

మార్చు

గుహ్య అంటే రహస్యం లేదా దాగి ఉంది అని అర్థం. ఈశ్వరి అంటే దేవత అని అర్థం. ఈ విదంగా సంస్కృత పదాల నుండి ఆలయం పేరు ఉద్భవించింది. సాహిత్యపరంగా, "గుహ్యేశ్వరి" అనే పేరు గుహ దేవతని సూచిస్తుంది. సతీ దేవ దక్ష యజ్ఞంలో విశ్వ శక్తి దేవత అయిన ఆదిశక్తిగా మారినప్పుడు ఆమె స్వీయ దహనం చేస్తుంది. లలితా సహస్రనామంలో దేవి 707వ నామం గుహ్యరూపిణిగా పేర్కొనబడింది. ఈ పేరు దేవత అసాధారణ రూపం అయిన ఆమె మానవ గ్రహణశక్తికి అతీతమైంది అని తెలియజేస్తుంది. షోడశీ మంత్రాలలో పదహారవ అక్షరం అని కూడా ప్రజలు నమ్ముతారు.[2]

ఉదాహరణలు

మార్చు

లలితా సహస్ర నామం లోని 137వ శ్లోకం: సరస్వతీ శాస్త్రమయి| గుహాంబ గుహ్యరూపిణీ||.

గుహ్యేశ్వరి ఆలయ ప్రాంగణాలు, దేవతకు అంకితం చేయబడిన ప్రధాన స్తోత్రాలు:

  • గుహ్య కాళీ సహస్రనామ స్తోత్రం,
  • గుహ్యకాలీ గద్య సంజీవన స్తోత్రమ్
  • గుహ్యకాలీ మహావజ్ర కవచ స్తోత్రమ్

శక్తి పీఠంగా ఆలయం

మార్చు

ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని రూపొందించడంలో దక్ష యాగం, సతీదేవి స్వీయ దహనం అనే పురాణాలు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అలాగే భారతదేశ సంస్కృతిపై కూడా ప్రభావం చూపాయి. ఈ సంఘటన శక్తి పీఠాల అభివృద్ధికి దారితీసింది, తద్వారా శక్తిమతం బలపడింది. శివుడు తన మామ (అనగా, దక్షుడు) చేత అవమానించబడినప్పుడు, అతని భార్య సతీదేవి చాలా కోపంగా ఉంది, ఆమె యాగ (పవిత్రమైన అగ్నికి నైవేద్యాలతో కూడిన ఆచారం) మంటల్లోకి దూకింది. శివుడు దుఃఖానికి లోనై ఆమె శవాన్ని ఎత్తుకుని తిరగటం ప్రారంభించాడు, ఆమె శరీర భాగాలు భూమిపై పడిపోయాయి. ఇలా పడిపోయిన ప్రతీ చోట శక్తి పీఠాలు వెలిశాయి. ఇలా మొత్తం 51 శక్తి పీఠాలు ప్రతిష్టించబడ్డాయని ప్రజలు నమ్ముతారు. ఈ 51 శక్తి పీఠాలు కూడా సంస్కృత వర్ణమాలలోని 51 అక్షరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, గుహ్యేశ్వరి ఆలయం సతిదేవి తుంటి లేదా వెనుక భాగం పడిపోయిన ప్రదేశాన్ని సూచిస్తుంది. గుహ్య అనే పదాన్ని తరచుగా యోనిని సూచిస్తున్నట్లుగా పొరబడతారు. అస్సాంలోని "కామరూప-కామాఖ్య" పేరుతో పూజించబడుతున్న మరొక శక్తి పీఠంలో సతీదేవి జననాంగాలు పడిపోయాయని చెబుతారు. మరొక సంస్కరణ ఏమిటంటే, గుహ్యేశ్వరి ఆలయం దేవత రెండు మోకాళ్ళు పడిపోయినట్లు చెప్పబడిన ప్రదేశాన్ని సూచిస్తుంది. ప్రతి శక్తి పీఠం ఒక శక్తికి, ఒక కాలభైరవుడికి అంకితం చేయబడి ఉంటుంది. ఆలయం మధ్యలో వెండి, బంగారు పొరతో కప్పబడిన కలశం (నీటి కూజా)లో అమ్మవారిని పూజిస్తారు. ఈ కలశం ఒక రాతి పునాదిపై ఉంటుంది, ఇది భూగర్భ సహజ నీటి బుగ్గను కప్పి ఉంచుతుంది, దాని నుండి నీరు పునాది అంచుల నుండి బయటకు వస్తుంది. ఈ ఆలయం ప్రాంగణం మధ్యలో ఉంది, చివరి పైకప్పును అలంకరించే విదంగా నాలుగు పూతపూసిన పాములు ఉన్నాయి. ఈ ఆలయం తాంత్రిక అభ్యాసకులచే గౌరవించబడుతూ, ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం గురించి కాళీ తంత్రం, చండీ తంత్రం, శివ తంత్ర రహస్యాలలో కూడా ప్రస్తావించబడింది. తంత్ర శక్తిని పొందేందుకు అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ఆలయం పరిగణించబడుతుంది. గుహ్యేశ్వరి దేవి విశ్వరూపం ఆమెను అసంఖ్యాకమైన చేతులతో విభిన్న రంగుల తలలు కలిగి ఉంటుంది. దశైన్, నవరాత్రి సమయంలో ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది.[3]

వజ్రయాన బౌద్ధమతం

మార్చు

నెవారి వజ్రయాన బౌద్ధులు గుహ్యేశ్వరి దేవిని వజ్రవారాహి రూపంలో వజ్రయోగినిగా పవిత్రంగా భావిస్తారు. స్వయంభూనాథ్ స్థూపం ఉన్న పౌరాణిక కమలంను మూల స్థానంగా భావిస్తారు, టిబెటన్ భాషలో, ఈ ప్రదేశాన్ని పాక్మో న్గుల్చు (వారాహి గర్భ ద్రవం) అంటారు. ఆలయ బావిలో ఉన్న నీటి బుగ్గ నుండి ప్రవహించే నీటిని యోని స్రావాలుగా, ఉమ్మనీటి ద్రవాలుగా లేదా వజ్రవారాహి జలాలుగా నమ్ముతారు.[4]

మూలాలు

మార్చు
  1. "Kathmandu page 4". virtualtraveling.endesign.nl. Retrieved 2014-01-25.
  2. "Shakti Sadhana Org: : LalithA SahasranAma". shaktisadhana.50megs.com. Retrieved 2014-01-25.
  3. "Kottiyoor Devaswam Temple Administration Portal". kottiyoordevaswom.com/. Kottiyoor Devaswam. Retrieved 20 July 2013.
  4. Dowman, Keith (2007). A Buddhist Guide to the Power Places of the Kathmandu Valley. Kathmandu: Vajra Publications. pp. 59–60. ISBN 978-9937-506-02-1.

వెలుపలి లంకెలు

మార్చు