గూడూరి నాగరత్నం

గూడూరి నాగరత్నం రాజమండ్రి పట్టణానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు.

గూడూరి నాగరత్నమ్మ

కుటుంబ నేపథ్యం

మార్చు

గూడూరి నాగరత్నం 1913 జూలై 6న యర్నగూడెంలో జన్మించారు. ఆమె భర్త రంగయ్య, కుమారుడు నరసింహాశర్మ. ఈమె భర్త రంగయ్య చాగల్లు ప్రాంత పరిసర ప్రాంతల్లో 1926-32 మధ్య హరిజన, ఖద్దరు ప్రచారాలు చేసాడు.

స్వాతంత్ర్యోద్యమంలో

మార్చు

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పిలుపును అనుసరించి 1926-32 కాలంలో హరిజనోద్ధరణ, ఖద్దరు ప్రచారం వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించింది. 1932లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని, 10 నెలల పాటు రాయవెల్లూరు, కన్ననూరు జైళ్ళలో కారాగార శిక్షను అనుభవించింది. ఆమె 1983 నవంబరు 3న మరణించింది.[1]

సంఘ సంస్కరణ

మార్చు

కాంగ్రెస్ తీర్మానాలను అనుసరించి గూడూరు ఆశ్రమంలో చేరి చుట్టుపక్కల గ్రామాల్లో హరిజనోద్ధరణకు కృషిచేశారు. ఆమె స్వయంగా వర్ణాంతర వివాహం చేసుకోవడం ఆమె కర్తవ్యనిష్ఠకు ఉదాహరణగా నిలుస్తుంది.

మూలాలు

మార్చు
  1. "స్వాతంత్ర్య సమర ఆంధ్ర వీరవనితలు" (PDF).[permanent dead link]