గేమ్ ఓవర్
గేమ్ ఓవర్ 2019లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై ఎస్. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. తాప్సీ, వినోదిని వైద్యనాథన్, అనీష్ కురువిల్లా, సంజన నటరాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 జూన్ 14న విడుదలైంది.[1]
గేమ్ ఓవర్ | |
---|---|
దర్శకత్వం | అశ్విన్ శరవణన్ |
రచన | అశ్విన్ శరవణన్ కావ్య రాంకుమార్ వెంకట్ కచర్ల (తెలుగు డైలాగ్స్) |
కథ | అశ్విన్ శరవణన్ కావ్య రాంకుమార్ |
నిర్మాత | ఎస్. శశికాంత్ చక్రవర్తి రామచంద్ర |
తారాగణం | తాప్సీ వినోదిని వైద్యనాథన్ అనీష్ కురువిల్లా సంజన నటరాజన్ |
ఛాయాగ్రహణం | ఎ. వసంత్ |
కూర్పు | రిచర్డ్ కెవిన్ |
సంగీతం | రాన్ ఏతాన్ యోహన్ |
నిర్మాణ సంస్థలు | వైనాట్ స్టూడియోస్ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 14 జూన్ 2019 |
సినిమా నిడివి | 97 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాషలు |
|
బడ్జెట్ | 7.5 కోట్లు |
బాక్సాఫీసు | 15.91 కోట్లు |
కథ
మార్చుస్వప్న (తాప్సి) తల్లిదండ్రులకు దూరంగా కోకాపేట శివారులోని గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగా వీడియో గేమింగ్ డెవలపర్‌గా పనిచేస్తుంది. ఆమెకు పనిమనిషి కాలమ్మ (వినోదిని వైద్యనాథన్) తోడుగా ఉంటుంది. స్వప్న జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఆమెను మానసికంగా కొన్ని సమస్యలతో బాధపడుతున్న విచిత్రమైన కలలతో అనుక్షణం భయపడుతుంటుంది. స్వప్నకి ఉన్న సమస్యలు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడింది? అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
మార్చు- తాప్సీ - స్వప్న
- సంచన నటరాజన్ - అమృత
- వినోదిని వైద్యనాథన్
- అనీష్ కురువిల్లా
- రమ్య సుబ్రమణియన్
- మాల పార్వతి
- డేవిడ్ సోలమన్ రాజా
- ఇంద్రజిత్
- సుబ్రమణియన్
- కృష్ణ రాజ్
- సూరి
- కెప్టెన్ కెఆర్‌సి ప్రతాప్
- విగ్నేష్ షణ్ముగం
- జోషువా మిల్లర్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్విన్ శరవణన్
- సంగీతం: రాన్ ఏతాన్ యోహన్
- సినిమాటోగ్రఫీ: ఎ. వసంత్
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (5 June 2019). "భయపట్టే తాప్సీ సినిమా.. 'గేమ్ ఓవర్'". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (14 June 2019). "'గేమ్ ఓవర్' మూవీ రివ్యూ". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
- ↑ TV9 Telugu (14 June 2019). "'గేమ్ ఓవర్' తెలుగు మూవీ రివ్యూ!". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)