అనీష్ కురువిల్లా

సినీ నటుడు, దర్శకుడు

అనీష్ కురువిల్లా ఒక సినీ దర్శకుడు, నటుడు.[1] శేఖర్ కమ్ముల దాదాపు అన్ని సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాడు. శేఖర్ మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆనంద్ సినిమాలో సహాయ పాత్ర పోషించాడు. తరువాత ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. నటనలో పన్నెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ 2016 లో పెళ్ళిచూపులు సినిమాలో కనిపించాడు. ఎం. ఎస్. ధోనీ జీవిత చరిత్ర సినిమాలో కూడా ఒక పాత్ర పోషించాడు.

అనీష్ కురువిల్లా
సినివారం కార్యక్రమంలో అనీష్ కురువిల్లా
జననం
వృత్తిదర్శకుడు, నటుడు

వ్యక్తిగత వివరాలు మార్చు

అనీష్ హైదరాబాదు లోని ఒక మలయాళ కుటుంబంలో జన్మించాడు. హైదరాబాదులో పెరిగాడు. రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు.[2]

కెరీర్ మార్చు

అనీష్ శేఖర్ కమ్ముల రూపొందించిన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. తరువాత శేఖర్ సారథ్యంలో వచ్చిన సినిమాలకు నిర్మాణంలో భాగస్వామిగా ఉండేవాడు. శేఖర్ తోనే కాక నగేశ్ కుకునూర్, మణిశంకర్ లాంటి సినీ రూపకర్తల దగ్గగ కూడా పనిచేసి దర్శకత్వంలో మెలకువలు నేర్చుకున్నాడు. దర్శకుడిగా అనీష్ మొదటి సినిమా కమల్ కామరాజు హీరోగా, శేఖర్ కమ్ముల నిర్మించిన ఆవకాయ్ బిర్యానీ.[3] తరువాత నటుడు శర్వానంద్ నిర్మించి నటించిన కో అంటే కోటి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.[4]

సినిమాలు మార్చు

నటుడిగా మార్చు

దర్శకుడిగా మార్చు

వెబ్ సిరీస్ మార్చు

మూలాలు మార్చు

  1. Sunita Chowdhary, Y. "Anish Kuruvilla moves to the forefront". thehindu.com. Kasturi and Sons. Retrieved 25 October 2016.
  2. "అనీష్ కురువిల్లా తో శేఖర్ కమ్ముల ముఖాముఖి". idlebrain.com. జీవి. Retrieved 27 October 2016.
  3. "వడ్డనకు సిద్ధమవుతున్న "ఆవకాయ్ బిర్యాని"". telugu.webdunia.com. వెబ్ దునియా. Retrieved 27 October 2016.
  4. "Anish Kuruvilla set to make his debut in Malayalam". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 27 October 2016.
  5. ఈనాడు, సినిమా (18 October 2019). "రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌". www.eenadu.net. Archived from the original on 18 October 2019. Retrieved 15 January 2020.
  6. సాక్షి, సినిమా (31 January 2020). "'చూసీ చూడంగానే' మూవీ రివ్యూ". Archived from the original on 6 February 2020. Retrieved 7 February 2020.
  7. ఈనాడు, సినిమా (31 January 2020). "రివ్యూ: చూసీ చూడంగానే." Archived from the original on 6 February 2020. Retrieved 7 February 2020.

బయటి లింకులు మార్చు