రమ్య సుబ్రమణియన్

రమ్య సుబ్రమణియన్, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి, టెలివిజన్ హోస్ట్ కూడా అయిన ఆమె వి.జె. రమ్యగా ప్రసిద్ధిచెందింది.

రమ్య సుబ్రమణియన్
ఆడై ట్రైలర్ లాంచ్‌లో రమ్య సుబ్రమణియన్
జననం
వృత్తినటి, ప్రభావశీలి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అపరాజిత్ జయరామన్
(m. 2014; div. 2015)

ఆమె తెలుగుతెరపై కొన్ని డబ్బింగ్ చిత్రాలతో పాటు నేరుగా వచ్చిన సినిమాలలోనూ కనిపించింది. 2019లో గేమ్ ఓవర్లో ఆమె నటించింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 2023 రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా అన్నీ మంచి శకునములేలో కూడా ఆమె నటించింది.[1]

ఆమె జిల్లా, రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించింది. జనవరి 2023న, ఆమె చెన్నై మారథాన్‌లో పాల్గొన్నది.[2][3] ఆమె స్టాప్ వెయిటింగ్(Stop Weighting ) పుస్తక రచయిత్రి.[4] అంకే కాకుండా, ఆమె స్టే ఫిట్ రమ్య (Stay Fit with Ramya )అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతోంది.

కెరీర్ మార్చు

ఆమె 2004లో మిస్ చెన్నై పోటీలో పాల్గొన్నది.[5] ఆ తర్వాత స్టార్ విజయ్‌లో కలక్కపోవదు యారు?, ఉంగలిల్ యార్ అడుత ప్రభుదేవా?, నమ్మ వీటు కళ్యాణం, కేడీ బాయ్స్ కిల్లాడి గర్ల్స్‌తో సహా టెలివిజన్ షోలను హోస్ట్ చేసింది.[6] వివాహానంతరం, తాను టెలివిజన్ కమిట్‌మెంట్‌లను తగ్గించుకుంటానని ఆమె వెల్లడించింది.[7]

2007లో, ఆమె తొలిసారిగా మోజిలో చిన్న పాత్రతో నటించింది.[8] 2015లో మణిరత్నం తెరకెక్కించిన ఓ కాదల్ కన్మణిలో దుల్కర్ సల్మాన్ స్నేహితురాలు అనన్య పాత్రలో మెప్పించింది.[9][10] ఈ చిత్రం తెలుగులో ఓకే బంగారంగా అనువాదం చేయబడింది. అదే సంవత్సరంలో, ఆమె 92.7 బిగ్ ఎఫ్ఎమ్‌లో ఆర్.జె. అయ్యింది.[11] ఫిట్‌నెస్ ప్రత్యేక సంచిక వి మ్యాగజైన్ ఆగస్టు 2019 నెల కవర్‌పై ఆమె మెరిసింది.[12]

వ్యక్తిగత జీవితం మార్చు

ఆమె తమిళనాడులోని తంజావూరులో జన్మించింది. పద్మ శేషాద్రి బాలభవన్‌లో 10వ తరగతి వరకు పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె 11వ, 12వ తరగతి ఆదర్శ విద్యాలయంలో కొనసాగింది. ఆమె విజువల్ కమ్యూనికేషన్‌లో బీఎస్సీ డిగ్రీని చెన్నైలోని ఎం.ఒ.పి. వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి పూర్తిచేసింది.[13]

ఆమె 2014లో అపరాజిత్ జయరామన్‌ను వివాహం చేసుకుంది, అయితే ఆ జంట 2015లో విడిపోయింది.[14]

మూలాలు మార్చు

 1. "Anni Manchi Sakunamule teaser – Delightful with family emotions". 123telugu.com (in ఇంగ్లీష్). 2023-03-04. Retrieved 2023-03-13.
 2. "தங்க பதக்கம் வென்றார் தொகுப்பாளினி ரம்யா!". Dinamani (in తమిళము). Retrieved 2023-01-31.
 3. மலர், மாலை (2017-04-03). "பளுதூக்கும் போட்டியில் தங்கம் வென்ற ரம்யா". www.maalaimalar.com (in తమిళము). Retrieved 2023-01-31.
 4. Joardar, Ranu (2022-12-01). "Actor Ramya Subramanian on her weight loss journey". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-01-31.
 5. "VJ Ramya Subramanian is a fitness pro; her workout videos will inspire you". The Times of India. 3 May 2019. Archived from the original on 23 October 2020. Retrieved 16 June 2021.
 6. Raghavan, Nikhil (3 March 2014). "ShotCuts: What a brainwave!". The Hindu. Archived from the original on 16 June 2021. Retrieved 16 June 2021.
 7. CR, Sharanya (22 March 2014). "I am choosy about my work now: Ramya". The Times of India. Archived from the original on 6 October 2015. Retrieved 10 January 2016.
 8. "VJ Ramya takes a 'kutty break' from social media to 'unplug'". The Times of India. 26 May 2020. Archived from the original on 28 May 2020. Retrieved 16 June 2021.
 9. "Ramya Subramanian moves to big screen". Sify. 30 November 2014. Archived from the original on 13 October 2015. Retrieved 10 January 2016.
 10. "VJ Ramya reveals she accepted OK Kanmani because of Mani Ratnam". IndiaGlitz. 20 April 2015. Archived from the original on 20 July 2019. Retrieved 16 June 2021.
 11. "Ramya is an RJ now". The Times of India. 1 September 2015. Archived from the original on 5 September 2015. Retrieved 22 October 2015.
 12. "Ramya Subramanian Exclusive Photoshoot". WE Magazine. 7 August 2019. Archived from the original on 8 August 2019. Retrieved 8 August 2019.
 13. Das, Papri (5 December 2013). "VJ Ramya is anchoring for the fun of it". Deccan Chronicle. Archived from the original on 29 August 2019. Retrieved 16 June 2021.
 14. "VJ Ramya confirms ending marriage". The Times of India. 12 September 2015. Archived from the original on 11 August 2020. Retrieved 25 June 2020.