గొల్లాపిన్ని వాసుదేవశాస్త్రి

గొల్లాపిన్ని వాసుదేవశాస్త్రి సంస్కృతాంధ్ర పండితులు, అవధాని. వీరు గొల్లాపిన్ని వంశంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు గొల్లాపిన్ని సీతారామశాస్త్రి, సుబ్బమ్మ. వీరు ఆయుర్వేదం, జోతిష శాస్త్రాలను అధ్యయనం చేశారు. వీరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంస్కృత కళాశాలలో తర్క, వ్యాకరణ, అలంకార శాస్త్రాలను నేర్చుకున్నారు.

వీరు అనంతపురం జిల్లాలోని ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు. వీరు ఆంధ్రసభ బళ్ళారి సాహిత్య శాఖకు సంయుక్త కార్యదర్శి గాను, హిందూపురం శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాలకు అధ్యక్షులుగాను పనిచేశారు. ఇండియన్ మెడిసన్ మొదలైన పత్రికలలో ఆయుర్వేద వైద్యం గురించి పలు వ్యాసాలు రాశారు.

వీరు అమరుకము, మదనసుందరీ పరిణయము, ఆయుర్వేద సర్వస్వము, జ్యోతిషార్ణవము, మొదలైన గ్రంథాలను రచించారు.