హిందూపురం

ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా, హిందూపురం మండలం లోని పట్టణం

హిందూపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన పురపాలకసంఘం హోదా కలిగి పట్టణం. హిందూపురం మండలానికి కేంద్రం స్థానం.

గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 2,03,538 - పురుషులు 1,02,664 - స్త్రీలు 1,00,874. పిన్ కోడ్: 515201.

చరిత్ర, విశేషాలుసవరించు

హిందూపురం మొదటి నుంచి ఓ ప్రముఖ వర్తక కేంద్రం,రాజకీయంగా పలుకుబడి కలిగిన పట్టణం. స్థానిక స్థలచరిత్ర ప్రకారం మరాఠా యోధుడు మురారి రావు ఈ గ్రామాన్ని కట్టించి తన తండ్రి బిరుదైన హిందూరావు పేరుమీద హిందూపురం అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది.ఇక్కడ వర్తకులు ఎక్కువగా వున్నారు సుప్రసిద్ధి గాంచిన లేపాక్షి హిందూపురం తాలూకా లోనిది. కల్లూరి సుబ్బారావు హిందూపురానికి చెందిన వాడే. కళాశాల స్థాపించి ఎందరికో విద్యా దానం చేసిన దాసా గోవిందయ్య చిరస్మరణీయుడు. ఇచ్చట యల్.జి.బాలకృష్ణన్ సూపర్ స్పిన్నింగ్ మిల్లులు స్థాపించి అనేక వేల మందికి ఉపాధి కల్పించాడు. పట్టణ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ మిల్లుల వల్ల జీవనోపాధి పొందుతున్నారు.

పట్టణంలోని విద్యాసౌకర్యాలుసవరించు

ఎస్.డి.జి.ఎస్.కళాశాలసవరించు

శ్రీ దాసా సూర్యప్రకాశ్,ఈ కళాశాల ఫౌండర్ ప్రెసిడంట్.

రవాణా సౌకర్యాలుసవరించు

 
హిందూపురం రైల్వే స్టేషన్ సైన్ బోర్డు దృశ్య చిత్రం

హిందూపురం ఈ ప్రాంతంలోని ప్రధాన నగరాలతో రోడ్డు, రైలు ద్వారా అనుసంధానించబడి ఉంది. ఇందులో జాతీయ రహదారి నెం .7, బెంగళూరు హైవే, పరిగి రోడ్, లేపాక్షి రోడ్, పెనుకొండ రోడ్ కొన్ని ఉన్నాయి. రైల్వే జోన్ బెంగళూరు-ధర్మవరం జంక్షన్ స్ట్రెచ్ లోని హిందూపూర్ రైల్వే స్టేషన్ (కోడ్ - 'HUP') - సౌత్ వెస్ట్రన్ రైల్వే ఈ మార్గంలో ఉంది. .

పాలనా విభాగాలుసవరించు

ఇది లోక్ సభ నియోజక వర్గం కేంద్ర స్థానమే కానీ రెవిన్యూ డివిజను కేంద్ర స్థానం కాదు. అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండడు. ఇది పెనుగొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

ప్రత్యేక ఆర్థిక మండళ్ళుసవరించు

హిందూపురం ప్రాంతం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 64 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ప్రభుత్వం హిందూపురం, పరిగి, కొడికొండ, ఓబుళదేవరచెరువు 'ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కోసం భూసేకరణ చేపట్టింది.

  • రహెజా (నియోజన్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..) తూమకుంటలో 350 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించారు.గార్మెంట్స్‌లో శిక్షణ ఇస్తున్నారు.
  • ఇండస్‌ఫిలా కంపెనీ శంకుస్థాపన జరిగింది
  • గోళ్లాపురం వద్ద పరిశ్రమల స్థాపనకు 1100 ఎకరాలకు పైగా ఏపీఐఐసీ సేకరించింది.
  • గోళ్లాపురం వద్ద విప్రొ సంస్థ కూడా ఉంది.
  • రాశి ప్రాపర్టీస్‌, ఇండస్ట్రిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 916ఎకరాల్లో, పరిగి మండలంలో వ్యాపార్‌ ఇండస్ట్రియల్‌ పార్కుకోసం 1418ఎకరాలు సేకరించారు.
  • లేపాక్షి నాలెడ్జి హబ్‌ చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో సెజ్‌ కోసం 9,428ఎకరాలు సేకరించారు.
  • సైన్స్‌ సిటీ... ఓడీసీ, అమడగూరు మండలాల్లో 640ఎకరాలను సేకరించారు.

రాజకీయాలుసవరించు

నీటి సమస్యసవరించు

హిందూపురం అంటేనే నీటి కరవు గుర్తొస్తుంది. ఏళ్లతరబడి ఇక్కడ దాహం కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పథకాలు ఒట్టిపోయాయి. ప్రజలు పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి. మరోవైపు పట్టణానికి తాగునీటిని అందించాల్సిన పీఏబీఆర్‌ పథకం పడకేసింది. కొళాయిలకు పదిరోజులకు ఒకసారే నీరు సరఫరా అవుతోంది. అందులోనూ అరకొరే. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో లాతూరులా మారనుంది. హిందూపురానికి పీఏబీఆర్‌ ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయిలో నీటిని తెప్పించి.. సమస్యను పరిష్కరిస్తామంటూ ఇక్కడి పాలకులు నిత్యం హామీలు గుప్పిస్తున్నారు. కానీ ఆచరణలో విఫలం అవుతున్నారు. 2009 కాంగ్రెస్‌ హయాంలో రూ.620 కోట్లతో నిర్మించిన పీఏబీఆర్‌ గురించి చెప్పుకొంటూ వచ్చారు. నేటి పాలకులు రూ.1,000 కోట్లతో ప్రత్యేక పైపులైను వేయిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. కానీ పట్టణంలో నీటి సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నారు. కనీస అవసరాలకూ ట్యాంకర్ల నీటిపైనే ఆధారపడుతున్నారంటే.. నీటి కరవు ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లోని గ్రామాల్లో జనాభా దాదాపు రెండు లక్షలు ఉంది. రోజుకు ఒక మనిషికి కనీసం 100 లీటర్ల లెక్కన ఇచ్చినా... 20 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం. దీనికితోడు పశువులు ఇతరత్రా అవసరాలకు మరో 10 మిలియన్‌ లీటర్లు అవసరం. అయితే అన్ని కలుపుకొని 10 మిలియన్‌ లీటర్ల నీరు మాత్రమే అందుతోంది. అందులోనూ పట్టణానికి 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు[1].

సమస్య చరిత్రసవరించు

గత పాలకులకు దూరదృష్టి లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పురం వాసులకు కష్టాలు తప్పడం లేదు. పట్టణంలో నీటి సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం రూ.620 కోట్లతో పీఏబీఆర్‌ పథకాన్ని నిర్మించారు. కానీ పనుల్లో నాణ్యత లేకపోవడం, పథకం నిర్వహణ లోపాల కారణంగా ఉపయోగం లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం పట్టణంలో ఒక్కో వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించాల్సి ఉంది. అందులో నాల్గో వంతు కూడా సరఫరా చేయలేక పోతున్నారు. పీఏబీఆర్‌ నుంచి ప్రతి రోజు 10 మిలియన్‌ లీటర్ల నీటిని సరఫరా చేయాలన్నది లక్ష్యం. కానీ ప్రారంభం నుంచి సగటున 5 మిలియన్లు మించి సరఫరా కాలేదంటే.. పథకం నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో వూహించవచ్చు. 2016 లో నాలుగు నెలలుగా సగటున రోజుకు కేవలం 2.5 మిలియన్‌ లీటర్లు మాత్రమే అందిస్తున్నారు[1].

నీటి లెక్కలుసవరించు

పట్టణానికి నిత్యం 20 మిలియన్‌ లీటర్లు అవసరం. ప్రస్తుతం పీఏబీఆర్‌ నుంచి సగటున 2.5 మిలియన్‌ లీటర్లు మాత్రమే అందుతోంది. మున్సిపాల్టీకి చెందిన బోర్లలో దాదాపు 1.5 మిలియన్‌ లీటర్లు లభ్యమవుతోంది. ఇదే నీటిని కొంత పైపుల ద్వారా, మరికొంత 25 ట్యాంకుల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. 50 ప్రైవేటు ట్యాంకులను అద్దెకు తీసుకొని, వీటి ద్వారా రోజు 200 ట్రిప్పుల నీటిని అందిస్తున్నారు. ఈ నీరు దాదాపు 1 మిలియన్‌ లీటర్లు ఉంటుంది. మున్సిపాల్టీ మొత్తంగా కలిపి రోజుకు 5 మిలియన్ల లీటర్లు సరఫరా చేస్తోంది. దీనికితోడు పట్టణంలో దాదాపు 270 ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా 1000 ట్రిప్‌ల నీటిని ప్రజలకు విక్రయిస్తున్నారు. ఇలా అన్నీకలిపినా 5 మిలియన్‌ లీటర్లు మాత్రమే అందుతోంది. మరో 10 మిలియన్ల లీటర్ల నీటి కొరతను ప్రజలు ఎదుర్కొంటున్నారు[1].

నీటి ట్యాంకర్లుసవరించు

పట్టణంలో గతంలో 236 బోర్లు ఉండేవి. వాటి సంఖ్య 2016 నాటికి 120కి చేరింది. 2016 మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే 30కి పైగా బోర్లు ఎండిపోయాయి. వందకు పైగా బోర్లలో నీటిమట్టం తగ్గింది. కేవలం 30 బోర్లలో మాత్రమే పూర్తి స్థాయిలో నీరు వస్తోంది. పీఏబీఆర్‌ నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. దీంతో కేవలం ట్యాంకర్ల ద్వారా మాత్రమే పట్టణ ప్రజలకు సరఫరా చేయాల్సి వస్తోంది. మున్సిపాలిటీ తరపున 75 ట్యాంకర్ల ద్వారా రోజుకు దాదాపు 400 ట్రిప్పుల నీటిని అందిస్తున్నారు. ఇలా నీటి కోసం రోజుకు రూ.లక్ష దాక ఖర్చు పెడుతున్నారు[1].

వ్యవసాయంపై ప్రభావంసవరించు

హిందూపురం పట్టణంలో నెలకొన్న నీటి సమస్య కారణంగా ఈ ప్రాంతంలో వ్యవసాయం పక్కన పెట్టేశారు. వ్యవసాయ బోర్ల నుంచి పట్టణానికి నీటిని సరఫరా చేస్తున్నారు. దాదాపు 100 బోర్ల నుంచి పట్టణానికి నీటిని ప్రైవేటు ట్యాంకర్లతో తీసుకొస్తున్నారు. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని పల్లెల నుంచి నీటిని తీసుకురావాల్సిన వస్తోంది. లేపాక్షి మండలం చోళసముద్రం, పరిగి మండలం కొడిగినహళ్లి, శాసనకోట, హిందూపురం గ్రామీణ మండలం పూలకుంట, బీరేపల్లి, కొటిపి, మణేసముద్రం, కిరికెర తదితర పంచాయతీల్లోని గ్రామాల నుంచి పట్టణానికి నీటిని తీసుకువస్తున్నారు. ఫలితంగా సడ్లపల్లి, కొట్నూరు, శ్రీకంఠాపురం, ముదిరెడ్డిపల్లి, సుగూరు తదితర గ్రామాల్లో పూర్తిగా వ్యవసాయాన్ని పక్కన పెట్టి, పట్టణానికి నీటిని అందిస్తున్నారు[1].

భూగర్భ జలాలుసవరించు

హిందూపురం ప్రాంతంలో కొత్తగా బోర్లు వేసినా ప్రయోజనం లేదని అధికారులు తేల్చేశారు. 1000 అడుగుల లోతు తవ్వినా నీరు పడని పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపాల్టీ తరపున 2015లో దాదాపు రూ.50 లక్షలు వెచ్చించి 40 బోర్లు తవ్వించగా మొదట్లో కొంత నీరు వచ్చినా, 2016 నాటికి అన్ని ఎండిపోయాయి. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో మణేసముద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫీజో మీటర్‌లోనే భూగర్భ జలమట్టం 38 మీటర్లు కనిపిస్తోంది. భూగర్భ జలమట్టం జిల్లాలో 19 మీటర్లు ఉండగా హిందూపురంలో 38 మీటర్లకు చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో లాతూరు లా మారనుంది[1].

నీటి ఖర్చుసవరించు

పురంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పట్టణంలోనే కేవలం నీటి కోసం చేస్తున్న ఖర్చు ఏడాదికి రూ.50 కోట్లు. అక్షరాలా ఇది నిజం. ఏడాదికి మున్సిపాల్టీ వారు నీటి సరఫరా కోసం రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వారు ఇచ్చే నీరు ఏ మూలకు సరిపోక పోవడంతో ప్రజలు పేద, ధనికులు అని తేడా లేకుండా నిత్యం కొనుగోలు చేస్తున్నారు. నిత్యం 1,000కి పైగా ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్నారు. ట్యాంకరు నీరు సగటున రూ.400. ఇలా రోజుకు రూ.4 లక్షలకు పైగానే ప్రైవేటు వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ఇక తాగడానికి తప్పనిసరిగా శుద్ధి చేసిన నీటిని క్యాన్‌ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఖర్చు దాదాపు రూ.6-7 లక్షలు. ఏడాదికి శుద్ధజలం కోసం పట్టణవాసులు రూ.20-25 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఇలా అంతా కలిపి ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చవుతోంది[1].

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "కన్నీటి.. 'పురం'! ీ". ఈనాడు. 2016-5-27. Archived from the original on 2016-06-02. Retrieved 2016-5-27. Check date values in: |accessdate= and |date= (help)

బయటి లింకులుసవరించు