గోందియా జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా

గోందియా జిల్లా (మరాఠీ: गोंदिया जिल्हा), భారతదేశంలో మహారాష్ట్రకు చెందిన జిల్లా. ముఖ్యపట్టణం గోందియా. జిల్లా యొక్క విస్తీర్ణం 5,431 కి.మీ.². 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 1,200,707. అందులో 11.95% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు (as of 2001).[1] జిల్లా నాగపూరు విభాగంలో ఉంది. ఈ జిల్లాలో (ప్రాంతంలో) గోండియా భాష మాట్లాడేవారు అధికంగా కానవస్తారు.

గోందియా జిల్లా

गोंदिया जिल्हा
మహారాష్ట్ర పటంలో గోందియా జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో గోందియా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనునాగపూరు విభాగం
ముఖ్య పట్టణంగోందియా
మండలాలు1. గోందియా, 2. గోరేగావ్, 3. తిరోరా, 4. అర్జునీ మోరేగావ్, 5. దేవురీ, 6. అమ్‌గావ్, 7. సలేకాసా, 8. సడక్ అర్జునీ
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలు1. భండారా-గోందియా ( భండారా జిల్లాతో పంచుకోబడింది), 2. గడ్‌చిరోలీ-చిమూర్ ( గడ్‌చిరోలీ జిల్లా , చంద్రపూర్ జిల్లాతో పంచుకోబడింది)
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం4,843 కి.మీ2 (1,870 చ. మై)
జనాభా వివరాలు
(2001)
 • మొత్తం12,00,151
 • సాంద్రత250/కి.మీ2 (640/చ. మై.)
 • విస్తీర్ణం
11.95%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత67.67%
 • లింగ నిష్పత్తి1005
సగటు వార్షిక వర్షపాతం1197 మి.మీ.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

గోందియా పట్టణాన్ని బియ్యపు నగరంగా కూడా అభివర్ణిస్తారు. ఈ పరిసర ప్రాంతాల్లో వరి పండిస్తారు. గోందియా పట్టణం పరిసర ప్రాంతంలో 250కి పైగా బియ్యపు మిల్లులు ఉన్నాయి. ఇది ప్రముఖ వ్యాపారకేంద్రం. జిల్లా గుండా వెళుతున్న ఏకైక జాతీయ రహదారి ముంబై-నాగపూరు-కోల్‌కతా రోడ్డు, జిల్లాలో 99.37 కిలోమీటర్లు మేరకు ఉంది. గోందియా నుండి జబల్పూరు, నాగపూరు , బాలాఘాట్ పట్టణాలకు బస్సు సౌకర్యం ఉంది. జిల్లా రెడ్ కారిడార్లో భాగంగా ఉంది.[2]

పాలనా విభాగాలుసవరించు

జిల్లా రెండు రెవిన్యూ విభాగాలు, ఎనిమిది తాలూకాలుగా విభజించబడింది. అవి గోందియా విభాగం , దేవుడీ విభాగం. ఒక్కొక్క విభాగంలో నాలుగు తాలూకాల చొప్పున ఉన్నాయి. గోందియా విభాగంలో గోందియా, గోరేగావ్, తిరోరా , అర్జునీ మోరేగావ్ తాలూకాలు, దేవుడీ విభాగంలో దేవుడీ, అమ్‌గావ్, సలేకాస , సడక్ అర్జునీ తాలూకాలున్నాయి. జిల్లా మొత్తంలో 556 గ్రామ పంచాయితీలు, 8 పంచాయితీ సమితులు, 954 రెవిన్యూ గ్రామాలున్నాయి. జిల్లాలో రెండు పురపాలక సంఘాలున్నవి. అవి గోందియా , తిరోరా.

జిల్లాలో4 విధాన సభ నియోజవర్గాలున్నవి. అవి అర్జునీ-మోరేగావ్ (షె,కు), గోందియా, తిరోరా , అమ్‌గావ్ (షె.తె). మొదటి మూడు నియోజకవర్గాలు భండారా-గోందియా లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైతే, చివరిది ఘడ్చిరోలి-చిమూరు (షె,తె) లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[3]

ఆర్ధిక రంగంసవరించు

2006లో భారతదేశపు పంచాయితీరాజ్ శాఖ గోందియా, దేశంలో కెళ్ళా బాగా వెనుకబడిన 250 జిల్లాలలో (మొత్తం 640 జిల్లాలు) ఒకటిగా ప్రకటించింది.[4] మహారాష్ట్రలో వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ కార్యక్రమం (బి.ఆర్.జి.ఎఫ్)లో భాగంగా ఆర్థిక సహాయం అందుకుంటున్న పన్నెండు జిల్లాలలో గోందియా కూడా ఒకటి.[4]

జనాభా గణాంకాలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం గోందియా జిల్లా మొత్తం జనాభా 1,322,331,[5] ఇది మారిషస్ దేశపు జనాభాతో [6] లేదా అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్రంతో సరిసమానం.[7]. భారతదేశంలో 640 జిల్లాలో జనాభా పరంగా గోందియా 369వది.[5] జిల్లా యొక్క జనసాంద్రత చ.కి.మీకు 253 .[5] 2001-2011 వరకు సాగిన దశాబ్దంలో జిల్లా యొక్క జనాభా 10.13%. వృద్ధి చెందింది[5] గోందియా జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 996 మంది స్త్రీలు ఉన్నారు[5]. జిల్లాలో అక్షరాస్యత శాతం 85.41%.[5]

శీతోష్ణస్థితిసవరించు

 
గోందియా సరాసరి ఉష్ణోగ్రతలు

గోందియా జిల్లా శీతోష్ణస్థితిలో మార్పులు తీవ్రంగా ఉంటాయి. వేసవికాలం చాలావేడిగానూ, చలికాలంలో చాలా చల్లగాను ఉంటుంది. ఇక్కడ సరాసరి గాలిలో తేమ 62 శాతం. వర్షాకాలంలో ప్రతిసంవత్సరం సాధారణంగా 1200 మి.మీలకు పైగా వర్షాన్ని నమోదు చేసుకుంటుంది. మేనెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు 42°సె చేరతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 28°సె వద్ద ఉంటాయి. మే నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 48 °C, అత్యల్ప ఉష్ణోగ్రత 20 °C. డిసెంబరు నెల చివర్లో, జనవరి నెలల్లో ఉష్ణోగ్రత సాధారణంగా గరిష్ఠం 29°సెకు చేరుతుంది. రాత్రిళ్ళు ఉష్ణోగ్రత 13°సెకు పడిపోతుంది. ఇటీవల కాలంలో జనవరి నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 38°సె, అత్యల్ప ఉష్ణోగ్రత 0°సె.

Gondia-శీతోష్ణస్థితి
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
సగటు అధిక °C (°F) 27.6 31.1 35.2 39.0 42.1 38.1 30.5 29.9 30.8 31.0 29.3 27.9
సగటు అల్ప °C (°F) 13.3 15.4 19.6 24.6 28.9 27.4 24.3 24.1 23.9 21.2 15.2 12.9
అవక్షేపం mm (inches) 18.0 30.7 16.0 16.0 13.7 219.2 503.9 443.5 222.3 66.5 22.9 5.8
Source: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-03-01.
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  3. "Districtwise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2010-03-18. Retrieved 2009-03-31.
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 10 (help)
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 {{cite web}}: line feed character in |quote= at position 14 (help)

వెలుపలి లింకులుసవరించు


మహారాష్ట్ర జిల్లాలు
అకోలా - అమరావతి - అహ్మద్‌నగర్ - ఉస్మానాబాద్ - ఔరంగాబాద్ - కొల్హాపూర్ - గఢ్ చిరోలి - గోందియా - చంద్రపూర్ - జలగావ్ - జాల్నా - ధూలే - నందుర్బార్ - నాగపూర్ - నాశిక్ - నాందేడ్ - ఠాణే - పర్భణీ - పూణే - బీడ్ - బుల్ఢానా - భండారా - ముంబై నగర - ముంబై శివారు - యావత్మల్ - రత్నగిరి - రాయిగఢ్ - లాతూర్ - వార్ధా - వాశిమ్ - సతారా - సాంగ్లీ - సింధుదుర్గ్ - సోలాపూర్ - హింగోలి