గోండి (భాష)

దక్షిణ మధ్యభరత దేశంలో గోండులు మాట్లాడే భాష తెలంగాణ లో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాల్లో మాట్లాడబడు

గోండి భాష : మధ్యభరత దేశంలో గోండులు మాట్లాడే భాష . గోండి భాషను మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర , ఒడిషా , గుజరాత్ , కర్ణాటక , వంటి అనేక రాష్ట్రాల్లో మరియు తెలంగాణ లోని ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాల్లో మాట్లాడబడుతుంది. ఈ భాషను సుమారు 30 లక్షల మంది దాక మాట్లాడతారు. గోండి భాష ద్రవిడ భాషా కుటుంబానికి చెందినది , తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండి భాష నుండే తెలుగు భాష పుట్టింది అని భాషావేత్తలు నిర్ధారించారు, గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు. ప్రధాన్‌ , తోటి, మురియా,ఓజా వంటి ఇతర గిరిజన జాతులకు కూడా ఇదే మాతృభాష. గోండి భాషా కేవలం భారతదేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా లో కూడా మాట్లాడబడుతుంది.

గుంజాల గోండి లిపి
గోండు విద్యార్థులు

కొన్ని పదాలు

మార్చు
  1. ఎడ్కి - జ్వరము,
  2. పిర్ - వాన,
  3. మర్మి - పెండ్లి,
  4. కేడ పేన్ - అడవి దేవుడు,
  5. పాడి - ఇంటి పేరు,
  6. నాడి - రేపు,
  7. నర్ క - రాత్రి,
  8. సక్ రే - ప్రొద్దున,
  9. ఆటుం - అంగడి,
  10. సారి - రొట్టె,
  11. ఉద - కూర్చో,
  12. రోన్ - ఇల్లు,
  13. సమ్దిర్ - అందరు,
  14. చొకోట్ - క్షేమం,
  15. కాండి - కొడుకు,
  16. పేడి - కూతురు,
  17. కరుమ్ - దగ్గర,
  18. లంగ్ - దూరం,
  19. పోడ్ దరి - సాయంకాలం,
  20. జోప్(కూర్క్)- నిద్ర,
  21. తరస్ - పాము,
  22. పెర్స - పెద్ద,
  23. యేర్ - నీరు,
  24. గాటో - అన్నం,
  25. కై కాల్ - కాలు చేతులు,
  26. మంత - ఉంది,
  27. సిల్లె - లేదు,
  28. పొరోల్ - పేరు,
  29. బత పొరోల్? - ఏమిపేరు?,
  30. గాటో తిత్తికీ ?- అన్నం తిన్నవా?

పుస్తకాలు

మార్చు
 
గోండు భాషలో మహాభారత పుస్తకం

అదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన తొడసం కైలాష్ ఆను ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల(ఇంద్రవెల్లి మండలం, గౌరా పూర్ గ్రామం)లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గిరిజనుల అభివృద్ధి కొరకు గోండు భాష లోకి తెలుగు లిపిలో పుస్తకాలు రాశాడు.

  1. పండోక్న మహా భారత్ కథ: 18 పర్వాలు, 272 పేజీలు. రామకృష్ణ మఠం వారు 5 సంపుటాలలో వెలువరించిన బాలల మహా భారతాన్ని గోండు భాష లోకి అనువదించారు. మహాభారతాన్ని గిరిజనులకు చేరువ చేయడానికి ఈ ప్రయత్నం చేశారు.
  2. సద్ విచార్: పిల్లలు, యువతలో మంచి ఆలోచనలు కలిగించడానికి రాశారు.
  3. వేలిత పాట :[1] గోండుల సంస్కృతి‌ గురించి మైఖెల్ యొర్క్ రాసిన పుస్తకం

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. గోండు భాషలో మహాభారతం. ఈనాడు. 7 July 2024