భండారా జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో భండారా జిల్లా (హిందీ: भंडारा जिल्हा) ఒకటి. జిల్లా కేంద్రం భండారా. జిల్లా వైశాల్యం 4087చ.కి.మీ. జనసంఖ్య 12,00,334. వీరిలో పురుషుల సంఖ్య 6,05,520 పురిషుల సంఖ్య 5,94,814. జనాభాలో, నగరవాసుల సంఖ్య 19.48%.[1] ప్రస్తుత భండారా మూలపదం భాన అంటే ఇత్తడి అని అర్ధం. ఈ నగరం ఇత్తడి వస్తువుల ఉత్పత్తికి ప్రసిద్ధి. నగరానికి లోపల, వెలుపల 3,500 చిన్న సరస్సులు ఉన్నాయి. అందువలన దీనిని సరస్సుల నగరం అని కూడా అంటారు. నగరం ఆర్థికంగా వ్యవసాయం, పరిశ్రమలు, అరణ్యసంపద మీద ఆధారపడి ఉంది. భండారా జిల్లాలో వరి కూడా అత్యధికంగా పండుతుంది. అందువలన దీనిని " రైస్ బౌల్ ఆఫ్ మహారాష్ట్ర " అని కూడా అంటారు.

భండారా జిల్లా

भंडारा जिल्हा
మహారాష్ట్ర పటంలో భండారా జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో భండారా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనునాగపూర్
ముఖ్య పట్టణంభండారా
మండలాలు1. Bhandara, 2. Tumsar, 3. Pauni and 4. Mohadi, 5. Sakoli, 6. Lakhni, 7. Lakhandur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుభండారా గోందియా
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం4,087 కి.మీ2 (1,578 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం12,00,334
 • సాంద్రత290/కి.మీ2 (760/చ. మై.)
 • విస్తీర్ణం
19.48%
ప్రధాన రహదార్లుNH-6
సగటు వార్షిక వర్షపాతం1327 మి.మీ.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

పరిశ్రమలుసవరించు

జిల్లాలో గడేగావ్ వద్ద అశోక్ లేలాండ్, సంఫ్లాలాగ్ స్టీల్, శివమంగళ్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్డినెంస్ ఫ్యాక్టరీ ఉన్నాయి. భండారా ఆఫ్ ది ఆర్డినెంస్ ఫ్యాక్టరీస్ బోర్డ్ ఇండియన్ ఆర్మ్‌ఫోర్సెస్‌ ఉత్పత్తులను అందిస్తుంది.

విద్యసవరించు

జవహర్‌నగర్ కాలనీ అని పిలువబడే ఎస్టేట్‌లో 2 స్కూల్స్ (కేంద్రీయ విద్యాలయ భండారా, ఆర్డినెంస్ ఫ్యాక్టరీ స్టేట్ స్కూల్స్) ఉన్నాయి. ఇదే జిల్లాలో ఉన్న ఒకేఒక కేంద్రీయ విద్యాలయ పాఠశాల ఇదే. జిల్లాలో నవగావ్ బంద్ వద్ద నవోదయ విద్యాలయ (దివంగత రాజీవ్ గాంధీ మానస పుత్రిక) ఉంది.

భండారాలో అంబాగాడ్ కోట, బ్రాహ్మి, చించ్గాడ్, దిఘోడి మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. జిల్లాలో ఖండోభా (నవంబరు, డిసెంబరు), మహాశివరాత్రి, అష్టి, ధపెవాడ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి

చరిత్రసవరించు

గోదావరి దక్షిణ ప్రాంతంలో ఆదిమవాసులు నివాసితప్రాంతంగా మార్చుకున్నారు. రామాయణ కాలంలో వారు రాక్షసులు అని పిలువబడ్డారు. 7వ శతాబ్దంలో జిల్లాప్రాంతం హర్యానారజపుత్రుల రాజ్యంతో విలీనం చేయబడింది. చత్తీస్ గఢ్‌ను పాలించిన హైహయ రాజ్యాన్ని మహాకోసల అని పిలిచేవారు. నాగార్ధన్ తరువాత కాలానికి చెందిన హిందూ రాజులగురించిన పుస్తకాలు ఉమేష్ కాంచన్ భండారా వద్ద భద్రపరచబడి ఉన్నాయి.

పాన్వారాలుసవరించు

12వ శతాబ్దంలో ఈ ప్రాంతం పాంవార్‌లు పాలించారు. పాంవార్‌లను తొలగించి ఈ ప్రాంతాన్ని గోండులు స్వాధీనపరచుకుని స్వతంత్రం ప్రకటించుకున్నారు. 1753లో సతారాకు చెందిన రఘోజీ విదర్భరాజుగా ప్రకటించుకున్నాడు. 1755లో రఘోజీ భోంస్లే మరభించిన తరువాత ఆయన కుమారుడు జనోజీ ఈ ప్రాంతాన్ని స్వాధీనపరచుకున్నాడు.

పేష్వాలుసవరించు

1707లో ఔరంగజేబు మరణించిన తరువాత ఛత్రపతి షాహూను ముహమ్మద్ ఆజం విడుదల చేసిన తరువాత మరాఠీ ప్రముఖుడు పరసోజి భోంస్లేను ఖండేష్‌లో కలుసుకున్నాడు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతం మీద పేష్వాలు దాడిచేసి జిల్లా ప్రాంతాన్ని బేరర్ సామ్రాజ్యంలో భాగం చేసాడు. 1850 నాటికి పేష్వాలను తొలగించి నిజాంలు బేరర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత నిజాం బేరర్ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చింది. 1903లో నిజాం బేరర్ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాకు లీజుకు ఇచ్చింది. తరువాత ఇది సెంట్రల్ ప్రొవింస్‌లో భాగం అయింది. 1956లో రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగిన సమయంలో భండారా ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి బాంబే ప్రొవింస్‌లో చేర్చబడింది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రం రూపొందించిన సమయంలో భండారా మహారాస్గ్ట్ర జిల్లాగా అయింది. 1991 గణాంకాల తరువాత జిల్లా భండారా, గోండియా జిల్లాలుగా విభజించబడింది.

పాలకుకులుసవరించు

ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, చాళుఖ్యులు, రాష్ట్రకూటులు, ఒకతకాలు, యాదవ రాజులు, రాజపుత్ర రాజ్యాలు, రాష్ట్రిక - పెటెనికాలు, భోజ - పెటెనికాలు, డియోగర్ గోండ్ రాజ్యం, పేష్వా, మరాఠీలు, భోంస్లేలు, పండరీలు, మొగలులు, లాంజీ రాజ్యం, నిజాం, బ్రిటిష్ పాలించారు. ఈ ప్రాంతం వరి ఉత్పత్తికి పేరుపొందింది. భండారా ఇత్తడి నగరంగా పేరుపొందింది. నగరంలో బృహత్తరమైన ఇత్తడి తాయారుచేసే పరిశ్రమ ఉంది.

రాక్షసులుసవరించు

గోదావరి నదికి దక్షిణ ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకున్న ఆదిమ మానవులను రామాయణ కాలంలో రాక్షసులు అనే వారు. 7వ శతాబ్దంలో ఈ ప్రాంతం చత్తిస్‌గడ్ పాలించిన హైహయ సామ్రాజ్యంలో చేర్చబడింది. వారి రాజ్యం మాహాకోసల అని పిలువబడింది. భండారా వద్ద ఈప్రాంతాన్ని పాలించిన హిందూ రాజుల వివరాలు ఉన్నాయి.

12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పొంవార్లు పాలించారు. వారిని తొలగించి ఈ ప్రాంతాన్ని గోండులు స్వాధీనం చేసుకున్నారు. వారి తరువాత రఘోజీ ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. రఘోజీ 1743 లో తనకు తానే విదర్భా రాజుగా ప్రకటించుకున్నాడు. 1755 లో రఘోజీ మరణించిన తరువాత ఆయనకుమారుడు జనోజీ ఈ ప్రాంతానికి అధిపతిగా ప్రకటించుకున్నాడు.

నిజాములుసవరించు

17వ శతాబ్దంలో ఈ ప్రాంతం మీద దాడి చేసారు. పేష్వాలు ఈ ప్రాంతాన్ని బేరర్ రాజ్యంలో విలీనం చేయడానికి కారణం అయ్యారు. 1850లో పేష్వాల తరువాత ఈ ప్రాంతానికి నిజాములు పాలకులు అయ్యారు. నిజాములు ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చారు. 1903లో నిజాములు ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాకు లీజుకు ఇచ్చారు. తరువాత ఇది సెంట్రల్ ప్రొవింస్‌లో భాగం అయింది. 1956లో రాష్ట్రాల పునర్నిర్మాణ సమయంలో భండారా మధ్యప్రదేశ్ నుండి బాంబే ప్రొవింస్‌కు మార్చబడింది. 1960 లో మహారాష్ట్ర రాష్ట్రం రూపుదిద్దుకున్నప్పుడు ఈ ప్రాంతం ఇది జిల్లాగా చేయబడింది. 1991 గణాంకాల తరువాత ఈ జిల్లాను భండారా, గొండియా జిల్లాగా విభజించబడింది.

భౌగోళికంసవరించు

మహారాష్ట్ర లోని ప్రధాన జిల్లాలలో భండారా జిల్లా ఒకటి. ఇది నాగపూర్ డివిషన్లో ఉంది. ఇది 21°10' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79°39' డిగ్రీల దక్షిణ రేఖాంశంలో ఉంది.

సరిహద్దులుసవరించు

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు బాలాఘాట్ జిల్లా మధ్యప్రదేశ్
దక్షిణ సరిహద్దు చంద్రపూర్ జిల్లా
తూర్పు సరిహద్దు గోండియా జిల్లా
పశ్చిమ సరిహద్దు నాగపూర్ జిల్లా
వైశాల్యం 3716 చ.కి.మీ
  • జిల్లా రెండు విభాగాలుగా, 7 తాలూకాలుగా విభజించబడింది.

పాలకులుసవరించు

17వ శతాబ్దంలో జిల్లా ప్రాంతాన్ని పేష్వాలు బేరర్ రాజ్యంలో భాగంగా మార్చారు. 1699 లో పేష్వాలు ఈ ప్రాంతం మీద దండయాత్ర సాగించారు. తరువాత ఈ ప్రాంతం పరసోజి భోంస్లే ఆధీనంలోకి మారింది. విదర్భ, బేరర్ కూడా పరసోజీ భోంస్లే ఆధీనంలో ఉండేవి. 1743లో పరసోజీ భోంస్లే విదర్భ అధికారాన్ని స్వీకరించాడు. 1755 లో పరసోజీ భోంస్లే కుమారుడు అధికారపీఠం అధిష్టించాడు.1818 - 1830 మద్యకాలంలో భూస్వామ్య రాజ్యం లాంజీ పాలన కొంతకాలం కొనసాగింది. 1821లో ఈ ప్రాంతం భండారా జిల్లాగా రూపొందించబడింది.

1850లో నిజాంలు పేష్వాలను తొలగించి అధికారం చేపట్టారు. 1903 లో నిజాం ప్రభుత్వం జిల్లా ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి స్వంతం చేసారు. 1956 రాష్ట్రాల పునర్నిర్మాణం సమయంలో భండారా బాంబే ప్రొవింస్‌కు ఇవ్వబడింది. 1960లో మహారాష్ట్ర రూపుదిద్దుకున్న తరువాత భండారా జిల్లాగా రూపుదిద్దుకున్నది. 1999 మే 1 న మునుపటి భండారా జిల్లా విభజించిన సమయంలో సరికొత్తగా గోండియా నగరం రూపుదిద్దుకున్నది.

పేరువెనుక చరిత్రసవరించు

భండారా జిల్లా పేరుకు మూలం బన్నారా. రత్నపూర్‌లో లభించిన శిఅలాశానాలలో ఈ పేరు పేర్కొనబడింది. భండారా జిల్లా ప్రాంతంలో నిర్వహించిన త్రవకాలలో లభించిన ఆధారాలు 11వ శతాబ్దం నుండి ఇది నివాసితప్రాంతంగా ఉందని నిరూపిస్తున్నాయి. రామాయణ కాలంలో ఇక్కడ నివసించిన ఆదిమవాసులను రాక్షసులని పిలిచారు. ఇది హైహయ రాజ్యంలో ఇది అంతర్భాగంగా ఉంది. 12 వ శతాబ్దంలో పాంవార్లు ఈ ప్రాంతానికి పాలకులు అయ్యారు. తరువాత ఈ ప్రాంతం గోండు రాజప్రతినిధులు పాలించారు.

ప్రస్తుత భండారా మూలపదం భాన అంటే ఉత్తడి అని అర్ధం. ఈ నగరం ఇత్తడి వస్తువుల ఉతోత్తికి ప్రసిద్ధి. నగరానికి లోపల వెలుపల 3,500 చిన్న సరసులు ఉన్నాయి. అందువలన దీనిని సరసుల నగరం అని కూడా అంటారు. నగరం ఆర్థికంగా వ్యవసాయం, పరిశ్రమలు, అరణ్యసంపద మీద ఆధారపడి ఉంది. భండారా జిల్లాలో వరి కూడా అత్యధికంగా పండించబడుతుంది. అందువలన దీనిని " రైస్ బౌల్ ఆఫ్ మహారాష్ట్ర " అని కుడా పిలివబడుతుంది.

జిల్లాలో అశోక్ లేలాండ్, సంఫ్లాగ్ స్టీల్, ఆర్డినెంస్ ఫ్యాక్టరీ ఉన్నాయి. భండారాలో అంబాగాడ్ కోట, బ్రాహ్మి, చించ్గాడ్, దిఘోడి మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. జిల్లాలో ఖండోభా (నవంబరు, డిసెంబరు), మహాశివరాత్రి, అష్టి, ధపెవాడ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.

జిల్లాలో పలు ఆలయాలు, పురాతన స్మారకచిహ్నాలు, అందమైన సరోవరాలు, పార్కులు, శాక్చ్యురీలు ఉన్నాయి. వార్షికంగా భండారా జిల్లాకు అనేక మది పర్యాటకులు వస్తుంటారు. భండారా జిల్లాలో పర్యటించడానికి అక్టోబరు, నవంబరు నెలలు అనుకూలంగా ఉంటాయి.భండారా జిల్లా కేద్రానికి 60 కి.మీ దూరంలో ఉన్న నాగపూర్ విమానాశ్రయం జిల్లాకు అత్యంత సమీపంలోని విమానాశ్రయంగా భావించవచ్చు. జిల్లాలోని భండారా రోడ్, తుంసర్ రోడ్ వద్ద రైలు స్టేషన్లు ఉంటాయి. జాతీయరహదారి 6 ద్వారా జిల్లాకు బసు వసతులు కల్పించబడుతున్నాయి.

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో భండరాజిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మహారాష్ట్ర రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలుసవరించు

భండారా జిల్లా రెండు ఉపవిభాగాలుగా విభజించబడింది. జిల్లా అదనంగా జిల్లా 7 తాలూకాలుగా విభజించబడింది. భండారా ఉపవిభాగంలో భండారా, తుంసర్, పౌని, మొహాడి తాలూకాలు ఉంటాయి. సకొలి ఉప విభాగంలో సకోలి, లఖాని, లఖంపూర్ తాలూకాలు ఉన్నాయి.

Language, People & Culture.సవరించు

జిల్లాలో 98% ప్రజలకు మరాఠీ వాడుకభాషగా ఉంది. భండారా జిల్లా నాటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది.

సంస్కృతిసవరించు

భండారా నగరంలో ఇతర రాష్ట్రాలు, మతాలకు చెందిన ప్రజలు అధికంగా నివసిస్తుంటారు.

మాధ్యమంసవరించు

భండారా జిల్లాలో ఆంగ్లం, హిందీ, మరాఠీ భాషలలో పలు దినపత్రికలు ప్రచురించబడుతున్నాయి. వీటిలో హిత్వాడా ఆంగ్ల దినపత్రిక జిల్లాలో లభిస్తున్న పురాతన వార్తాపత్రికగా భావించబడుతుంది. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో టైంస్ ఆఫ్ ఇండియా భండారా టైంస్ కూడా ప్రాంతీయ అనుబంధంగా ప్రచురిస్తుంది. పలు హిందీ వార్తాపత్రికలకు భండారాలో కార్యాలయాలు ఉన్నాయి. భండారా జిల్లా మతసమైక్యతకు నిలయంగా ఉంటుంది. భండరా జిల్లాలో సంవత్సరమంతా మత సంబంధిత ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.

  • జిల్లాలో 3 అసెబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: తుంసర్, భండారా (ఎస్.సి), సకొలి.
  • శాసనసభ నియోజకవర్గాలన్నీఅలాగే 2 పార్లమెంటు నియోజవర్గాలలో ఉన్నాయి.[3]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,200,334,[4]
ఇది దాదాపు. తైమూర్ - లెస్టే దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 397వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 294 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 5.65%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 982:1000 [4]
అక్షరాస్యత శాతం. 83.76%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. "Districtwise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2009-02-25. Retrieved 2014-11-27.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Timor-Leste 1,177,834 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 12 (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 {{cite web}}: line feed character in |quote= at position 13 (help)

వెలుపలి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లింకులుసవరించు


మహారాష్ట్ర జిల్లాలు
అకోలా - అమరావతి - అహ్మద్‌నగర్ - ఉస్మానాబాద్ - ఔరంగాబాద్ - కొల్హాపూర్ - గఢ్ చిరోలి - గోందియా - చంద్రపూర్ - జలగావ్ - జాల్నా - ధూలే - నందుర్బార్ - నాగపూర్ - నాశిక్ - నాందేడ్ - ఠాణే - పర్భణీ - పూణే - బీడ్ - బుల్ఢానా - భండారా - ముంబై నగర - ముంబై శివారు - యావత్మల్ - రత్నగిరి - రాయిగఢ్ - లాతూర్ - వార్ధా - వాశిమ్ - సతారా - సాంగ్లీ - సింధుదుర్గ్ - సోలాపూర్ - హింగోలి