గోపాలపురం (రావులపాలెం)

ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల గ్రామం

గోపాలపురం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం మండలానికి చెందిన గ్రామం.

గోపాలపురం (రావులపాలెం)
పటం
గోపాలపురం (రావులపాలెం) is located in ఆంధ్రప్రదేశ్
గోపాలపురం (రావులపాలెం)
గోపాలపురం (రావులపాలెం)
అక్షాంశ రేఖాంశాలు: 16°42′32.760″N 81°48′50.220″E / 16.70910000°N 81.81395000°E / 16.70910000; 81.81395000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంరావులపాలెం
విస్తీర్ణం13.5 కి.మీ2 (5.2 చ. మై)
జనాభా
 (2011)
9,679
 • జనసాంద్రత720/కి.మీ2 (1,900/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు4,886
 • స్త్రీలు4,793
 • లింగ నిష్పత్తి981
 • నివాసాలు2,803
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533274
2011 జనగణన కోడ్587675

ఇది మండల కేంద్రమైన రావులపాలెం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 46 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామం జాతీయ రహదారి సంఖ్య 5 కి చేర్చి, రావులపాలెం నుంచి 6.7 కిలోమీటర్ల దూరంలో వశిష్ఠ నదిని (గోదావరి ఉపపాయ) ఆనుకుని ఉంది.

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2803 ఇళ్లతో, 9679 జనాభాతో 1350 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4886, ఆడవారి సంఖ్య 4793. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1754 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 77. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587675[2].

2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,209.ఇందులో పురుషుల సంఖ్య 4,675, మహిళల సంఖ్య 4,534, గ్రామంలో నివాసగృహాలు 2,307 ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

మార్చు
 
గోపాలపురం ఉన్నత పాఠశాల

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రావులపాలెంలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజమండ్రిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్‌ రావులపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల పలివెలలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం రావులపాలెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమండ్రి లోనూ ఉన్నాయి. విద్య విషయంలో రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన వాళ్ళు, పదవతరగతి పోటీల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణతతో పాటు, ప్రైవేటు విద్యాసంస్థలు సైతం పోటీకి జంకే విధంగా ఇక్కడి విద్యార్థుల ప్రతిభ ఉంటుంది. గ్రామంలో విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసినవారిలో మైగాపుల తాతయ్యకాపు ఒకరు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల స్థలదాత ఈయన.

పాఠశాలలు

  • 1. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గోపాలపురం
  • 2. శ్రీ సరస్వతీ విద్యానికేతన్, గోపాలపురం
  • 3. శ్రీ శారదా పబ్లిక్ స్కూల్, గోపాలపురం
  • 4. శ్రీ నీలం సంజీవ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గోపాలపురం
  • 5. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, గోపాలపురం

కళాశాలలు

  • 1. ప్రభుత్వ జూనియర్ కళాశాల- రావులపాలెం
  • 2. శ్రీ సత్యసాయి జూనియర్ కాలేజ్ - రావులపాలెం
  • 3. ప్రభుత్వ డిగ్రీ కళాశాల -రావులపాలెం

వైద్య సౌకర్యం

మార్చు

రెండు సంవత్సరాల క్రితమే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి) ఏర్పాటు చేసినా, ఆశించిన ఫలితాలు ఈ మధ్యనే కనిపిస్తున్నాయి. క్రమేణా ప్రజల్లో ఈ ప్రభుత్వాసుపత్రి పట్ల నమ్మకం కుదురుతోంది. టీ.బీ. వం టి రోగులపట్ల ఈ ఆసుపత్రి చూపించే శ్రద్ధ చుట్టు ప్రక్కల అన్నిగ్రామాల్లోనూ ప్రసంసలు అందుకుంది. ఐతే అంటువ్యాధులపట్ల, పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించటంలో మండలంలో లానే ఈ గ్రామం కూడా వెనుకబడి ఉంది. చుట్టు ప్రక్కల గ్రామాల్లో వైద్యం ఖరీదు కావటంతో, ఈ ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయించే పేదలు, మధ్యతరగతివారు వందల్లో ఉంటారు. ప్రభత్వ సివిల్ సర్జన్ గా రిటైర్ అయిన డాక్టర్ కృష్ణబ్రహ్మం పేదలకోసం ఒక ఆసుపత్రి స్థాపించి నామమాత్రపు ఫీజుతో వైద్యం చేస్తూ ఎల్ల వేళలా చుట్టు ప్రక్కల అన్ని గ్రామాలకు అందుబాటులో ఉంటారు. ఈయన చొరవవల్లే గ్రామ పి.హెచ్.సికి కనీస సౌకర్యాలు కల్పించబడ్డాయి.

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

గోపాలపురంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

గోపాలపురంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

గోపాలపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 451 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 3 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 895 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 207 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 687 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

గోపాలపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 313 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 374 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

గోపాలపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి,, కొబ్బరి, అరటి, చెరకు వంగ, మిరప, మొక్కజొన్న, టమేటా, కందవంటి ఆహార, వాణిజ్య పంటలతో పాటు మినుములు, పెసలు వంటి అపరాలు కూడా ఈ నేలలో పండుతాయి.

గ్రామ విశేషాలు

మార్చు

గత దశాబ్దకాలంగా ఈపంటల సాగు విస్తీర్ణంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గోదావరి నీటి ఉధృతి కారణంగా ఎకరాలకొద్దీ లంకభూమి కోతకి గురయ్యింది. గోదావరి వరదల కారణంగా ఇక్కడ రైతుకి పంట చేతికి వచ్చేదాకా కంటిమీద కునుకు ఉండదంటే అది అతిశయోక్తి కాదు. తరచూ వరదలకు గురౌతూ ఉండటం, పంటలాభం నికరం లేకపోవటం ఇక్కడి రైతుల్లో తెగువని పెంచిందని చెప్పవచ్చు. దానికి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతపు లంక భూముల్లో కనిపిస్తూ ఉండే పంట - తమలపాకు.సుమారు పదేళ్ళ కిందటే ఈ తమలపాకు తోటల పెంపకం మొదలైనా, గత అయిదారేళ్ళగా ఈ పంటసాగు తారస్థాయికి చేరుకుంది. అది ఎంతగా అంటే - దేశ నలుమూలలకీ ఇక్కడినుంచి తమలపాకులు ఎగుమతి చేసేటంత, తమలపాకు పండించే గ్రామాలలో ఇక్కడి "నాణ్యత"కి ఎదురేలేనంతగా గోపాలపురం ప్రసిద్ధి చెందింది.సగటు మనిషి కనీస సదుపాయాలకి లోటు లేకపోవటంతో ఇక్కడికి వలసలు ఎక్కువయ్యాయి.ఇలా వలస వచ్చినవారి సంఖ్య గ్రామస్తులలో మూడోవంతుకి తక్కువ కాకుండా ఉంటుంది.

విజ్ఞానం

మార్చు

గ్రామస్తులకు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయం ఈ ఊళ్ళో ఉంది. విలువైన, అరుదైన పుస్తకాలను ఈ గ్రంథాలయానికి గ్రామస్థులు బహూకరించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. ఈ ఊరి గ్రంథాలయం లోని పుస్తకాలతో చదివి ప్రయోజకులైన వాళ్ళు పదుల్లో ఉన్నారు. గ్రంథాలయం ఆధ్వర్యంలో బాలబాలికలకు ఆటలపోటీలు సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహించబడుతూఉండేవి . ఏమైతేనేం ? ఎంతోమందికి ప్రయోజనాన్ని కూర్చిన గ్రంథాలయం ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉంది.

ఆర్ధిక - సామాజిక - రాజకీయం

మార్చు

ఆర్ధికంగా అన్ని తరగతులవారూ ఇక్కడ ఉంటారు . ప్రతిభకి కొదువలేదు, కష్టానికి నష్టం లేదు.సామాజికంగా మండలంలో గణాంక స్థాయిలో ఉన్న గ్రామం. కుల మతాలకి అతీతంగా కలిసిగట్టుగా ఉండే గ్రామం - గోపాలపురం .

రాజకీయంగా కొత్తపేట నియోజక వర్గంలో ఈ ఊరు ప్రాముఖ్యత కలది. కొత్తపేట నియోజక వర్గ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందినవారిలో ఇద్దరు ఈ గ్రామానికి చెందినవాళ్ళు కావటం విశేషం.

నైసర్గిక స్వరూపం

మార్చు

తూర్పున-గోదావరి - (అవతల సిద్దాంతం - పశ్చిమ గోదావరి జిల్లా ) పశ్చిమాన - ( పొడగట్ల పల్లి, జిత్తుకపాడు) ఉత్తరాన - (గోదావరి అవతల మల్లేశ్వరం ) దక్షిణాన - ( ముమ్మిడివరప్పాడు ) కలవు .

ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాలు

మార్చు
  • 1. గ్రామ పంచాయితీ కార్యాలయం
  • 2. పోస్టాఫీసు
  • 3. పశువుల ఆసుపత్రి
  • 4. సొసైటీ (సహకార )బ్యాంకు
  • 5. ఇండియన్ బ్యాంక్
  • 6. ప్రభుత్వ మార్కెట్ యార్డ్

దేవాలయాలు

మార్చు
  • 1. శ్రీ గోకులాంబ అమ్మ వారి దేవస్థానం ( గోపాలపురం గ్రామ దేవత )
  • 2. శ్రీ సత్తెమ్మ అమ్మ వారి దేవస్థానం
  • 3. శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానం
  • 4. శ్రీ అన్నపూర్ణాదేవి వారి దేవస్థానం
  • 5. శ్రీ వరసిద్ది వినాయక ఆలయం
  • 6. శ్రీ సిద్ది వినాయక దేవస్థానం
  • 7. శ్రీ షిర్డీ సాయిబాబా వారి దేవస్థానం
  • 8. శ్రీ సాయిబాబా వారి దేవస్థానం
  • 9. శ్రీ యాళ్ళ వారి రామాలయం
  • 10.శ్రీ పట్టాభిరామ రెడ్ల రామాలయం
  • 11.శ్రీ విష్ణ్వాలయం
  • 12.శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి దేవస్థానం ( శివాలయం )
  • 13.శ్రీ మణికంఠ స్వామి వారి దేవాలయం
  • 14.ఏ.పీ. ఫాసియా లూధరన్ చర్చి
  • 15.బైబిల్ మిషన్ చర్చి.

మూలాలు

మార్చు
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు