గోపాలుడు భూపాలుడు

గోపాలుడు భూపాలుడు జి. విశ్వనాథం దర్శకత్వంలో 1967లో విడుదలైన జానపద చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, జయలలిత ముఖ్యపాత్రలు పోషించారు. ఎన్. టి. ఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రాన్ని గౌరి ప్రొడక్షన్స్ పతాకంపై వై. వి. రావు నిర్మించాడు.[1]

గోపాలుడు భూపాలుడు
Gopaludu Bhoopaludu.jpg
దర్శకత్వంజి.విశ్వనాథం
తారాగణంనందమూరి తారక రామారావు,
జయలలిత,
రాజశ్రీ,
రాజనాల,
పద్మనాభం
సంగీతంఎస్.పీ. కోదండపాణి
నిర్మాణ
సంస్థ
గౌరి ప్రొడక్షన్స్
భాషతెలుగు

తారాగణంసవరించు

  • ఎన్. టి. రామారావు
  • జయలలిత
  • రాజశ్రీ
  • రాజనాల
  • పద్మనాభం

నిర్మాణంసవరించు

నిర్మాత వై. వి. రావు స్వస్థలం రాజమహేంద్రవరం. 1948లో సువర్ణమాల అనే చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చూసుకునేందుకు మద్రాసు వెళ్ళాడు. అది 1952లో విడుదలైంది. ఈలోగా ఆయనకు జర్నలిజం వైపు ఆసక్తి కలిగింది. తర్వాత కొద్ది రోజులు పత్రికలు నిర్వహించాడు. 1966 లో ఆయన బావయైన ఎస్. భావనారాయణతో కలిసి 1966 నుంచి చిత్రాలు నిర్మించడం ప్రారంభించాడు. వారి తొలి సినిమా లోగుట్టు పెరుమాళ్ళకెరుక. తర్వాత చిత్రం భారీ తారాగణంతో నిర్మితమైన ఈ చిత్రం.

పాటలుసవరించు

ఈ చిత్రానికి ఎస్. పి. కోదండపాణి సంగీత దర్శకత్వం వహించాడు.[2][3]

  1. ఇదేనా తరాతరాల చరిత్రలో జరిగింది ఇదేనా - టి. ఎం. సౌందర్‌రాజన్
  2. ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో కన్నె మనసున వన్నె తలపున - లత బృందం
  3. ఎంత బాగున్నది ఎంత బాగున్నది అందరాని చందమామ - ఎస్.జానకి, ఘంటసాల
  4. ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు కవ్వించి పోవయ్యా - ఎస్.జానకి, ఘంటసాల
  5. కోటలోని మొనగాడా వేటకు వచ్చావా, జింకపిల్ల కోసమో ఇంక దేనికోసమో - పి.సుశీల, ఘంటసాల
  6. చూడకు చూడకు మరీ అంతగా చూడకు మనసుతో - సుశీల, ఘంటసాల
  7. మరదలా చిట్టి మరదలా మేటి మగధీరుడంటే మాటలా - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి

మూలాలుసవరించు

  1. ఆచారం, షణ్ముఖాచారి. "ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం... 'గోపాలుడు భూపాలుడు'". సితార. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  2. కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  3. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.