గోపాల్ బోస్
గోపాల్ బోస్ (1947, మే 20 - 2018, ఆగస్టు 26) పశ్చిమ బెంగాల్ కు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్ తోపాటు 1974లో భారతదేశం తరపున ఇంగ్లాండ్‌తో అంతర్జాతీయ వన్డే మ్యాచ్ (13 పరుగులు, ఒక వికెట్) ఆడాడు.[2]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | 1947, మే 20 కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2018, ఆగస్టు 26 బర్మింగ్‌హామ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్, బౌలింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1974 జూలై 15-16 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 2006 ఫిబ్రవరి 8 |
జననం
మార్చుగోపాల్ బోస్ 1947, మే 20న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో జన్మించాడు.[3]
క్రికెట్ రంగం
మార్చుసుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యంతో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో మంచి ఆటతీరు కనబరచాడు. సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక ) పర్యటన కోసం జాతీయ క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు. సునీల్ గవాస్కర్‌తో 194 పరుగుల భాగస్వామ్యం చేశాడు.[4] 1974-75 వెస్టిండీస్ పర్యటన కోసం 14-సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు, కానీ ప్లేయింగ్ ఎలెవెన్ నుండి తప్పించబడ్డాడు. తన కెరీర్ మొత్తంలో అనేక విజయాలతో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గోపాల్ బోస్ 1968/69 - 1978/79 మధ్యకాలంలో 78 ఫస్ట్ క్లాస్ గేమ్‌లలో ఎనిమిది సెంచరీలు, 17 అర్ధసెంచరీలతో 3757 పరుగులు చేశాడు. 72 వికెట్లు కూడా తీశాడు.[5]
కోల్‌కతా క్రికెట్ క్లబ్ ఆఫ్ ధాకురియాకి ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.[6]
మరణం
మార్చుగోపాల్ బోస్ 2018 ఆగస్టు 26న గుండెపోటుతో బర్మింగ్‌హామ్‌లో మరణించాడు.[7]
మూలాలు
మార్చు- ↑ "Gopal Bose Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
- ↑ "IND vs ENG, India tour of England 1974, 2nd ODI at London, July 15 - 16, 1974 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
- ↑ "Gopal Bose Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
- ↑ "Former Bengal captain Gopal Bose passes away at 71". The Indian Express (in ఇంగ్లీష్). 2018-08-27. Retrieved 2023-08-04.
- ↑ "Former Bengal captain Gopal Bose passes away". Times of India. Retrieved 2023-08-04.
- ↑ Ghosh, Avijit. "Gopal Bose was Bengal's great cricket hope in the early 1970s". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-08-04.
- ↑ "Gopal Bose, former India player, passes away". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.