గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి

గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా గెలిచారు.ref name="రికార్డు బ్రేక్‌.. ఆధిక్యం.. అద్భుతం"Sakshi (12 March 2019). "రికార్డు బ్రేక్‌.. ఆధిక్యం.. అద్భుతం". Sakshi. Archived from the original on 2 December 2021. Retrieved 2 December 2021.</ref>

గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి


శాసనసభ్యులు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం
ముందు కాసు వెంకట కృష్ణారెడ్డి
నియోజకవర్గం నరసరావుపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 అక్టోబర్ 1968
బుచ్చిపాపన్నపాలెం, రొంపిచర్ల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకటేశ్వర రెడ్డి, సుబ్బాయమ్మ
జీవిత భాగస్వామి సుష్మిత రెడ్డి
సంతానం తరుణ్ వెంకట సిద్దార్థ రెడ్డి, ఓజేస్విత
పూర్వ విద్యార్థి మాహె విశ్వవిద్యాలయం, కర్ణాటక
మతం హిందూమతం

జననం, విద్యాభాస్యం మార్చు

గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండలం, బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో వెంకటేశ్వర రెడ్డి, సుబ్బాయమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాధమిక విద్యాభాస్యం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో, కోరుకొండ లోని సైనిక్ స్కూల్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంబిబిఎస్, కర్ణాటక లోని మాహె యూనివర్సిటీ నుండి 1999లో ఎం.ఎస్.(ఆర్థో) పూర్తి చేశాడు.

వృత్తి జీవితం మార్చు

గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వైద్య విద్య పూర్తి చేశాక 1999లో బెల్లంపల్లిలోని సింగరేణి హాస్పిటల్ & హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో కొంతకాలం వైద్యుడిగా పని చేశాడు. ఆయన 2001లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆసుపత్రిని ప్రారంభించి వైద్య సేవలను ప్రారంభించాడు.

రాజకీయ జీవితం మార్చు

గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి శాససభ్యుడిగా గెలిచి తొలిసారి శాసనసభకి ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 32,277 ఓట్ల మెజారిటీతో రెండోసారి శాసనసభ్యుడిగా గెలిచాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.