కాసు వెంకట కృష్ణారెడ్డి

కాసు వెంకట కృష్ణా రెడ్డి (జననం 1947 సెప్టెంబరు 28) భారతీయ రాజకీయ నాయకుడు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు.[1][2]

కాసు వెంకట కృష్ణా రెడ్డి

పదవీ కాలం
2007-2009
నాయకుడు వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి
నియోజకవర్గం నరసరావుపేట

సహకార మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పదవీ కాలం
2010-2014
నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
నియోజకవర్గం నరసరావుపేట

పదవీ కాలం
1989-1996
ముందు కాటూరి నారాయణ స్వామి
తరువాత కోట సైదయ్య
నియోజకవర్గం నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1978 - 1983
ముందు దొండేటి కృష్ణారెడ్డి
తరువాత కోడెల శివప్రసాదరావు
నియోజకవర్గం నరసరావుపేట
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2014
ముందు కోడెల శివప్రసాదరావు
తరువాత గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
నియోజకవర్గం నరసరావుపేట

వ్యక్తిగత వివరాలు

జననం 28 సెప్టెంబర్ 1947
నరసరావుపేట, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు కాసు వెంగల్ రెడ్డి
సంతానం కాసు మహేష్ రెడ్డి
పూర్వ విద్యార్థి ఉన్నత విద్యావంతుడు
B.Sc, ఆంధ్ర విశ్వవిద్యాలయం (లయోలా కళాశాల, విజయవాడ)
మతం హిందూమతం

రాజకీయ జీవితం

మార్చు

కాసు వెంకట కృష్ణారెడ్డి రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుండి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1971 నుండి 1975 వరకు గుంటూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నరసరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన తరువాత గుంటూరు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. కాసు వెంకట కృష్ణారెడ్డి 1989, 1991లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.

కాసు వెంకట కృష్ణారెడ్డి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నరసరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి తిరిగి 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర సహకారశాఖ మంత్రిగా పనిచేశాడు.[3]

మూలాలు

మార్చు
  1. [1]. ది టైమ్స్ ఆఫ్ ఇండియా.
  2. సిబ్బంది (14 జనవరి 2013). "కాంగ్రెస్‌కి మరో ఎమ్మెల్యే YSRCలో చేరండి". టైమ్స్ న్యూస్ నెట్‌వర్క్ (ది టైమ్స్ ఆఫ్ ఇండియా ద్వారా). 26 జూలై 2015న తిరిగి పొందబడింది.
  3. Sakshi (13 November 2013). "ఆంటోని కమిటీ ఏమైంది?: మంత్రి కాసు కృష్ణారెడ్డి". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.