గోరంతదీపం: ఇది 1978లో విడుదలైన ఒక తెలుగుచిత్రం. ముత్యాలముగ్గు తరువాత బాపు, శ్రీధర్ ను హీరోగా తీసిన చిత్రం.ఘండికోట బ్రహ్మాజీరావు వ్రాసిన "ఒక దీపం వెలిగింది" నవల ఆధారంగా ఈ చిత్రం తీయబడింది. ఈ చిత్రంలో వాణిశ్రీ మేకప్ లేకుండా నటించింది. మోహన్ బాబు నుంచి, అత్తమామల నుంచి వాణిశ్రీ తనను తాను రక్షించుకోవడం చిత్రకథ. వాణిశ్రీ తండ్రిగా కాంతారావు నటించారు. చిత్రంలో కాంతారావుకు రాసిన సంభాషణలు గమనించదగ్గవి. ('నువ్వుతిన్న ఆహారాన్ని నువ్వే జీర్ణంచేసుకోవాలి', 'నువ్వు సుఖదుఖాలకు నువ్వేబాధ్యత వహించాలి' వంటివి.) పాటలలో కొన్ని'రాయినైనా కాకపోతిని', 'గోరంతదీపం కొండంత వెలుగు'. మోహన్ బాబుకు కొన్ని చరణాలు పి.బి.శ్రీనివాస్ పాడటం విశేషం.

గోరంత దీపం
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం శ్రీధర్,
వాణిశ్రీ,
మోహన్ బాబు
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ చిత్ర కల్పన
భాష తెలుగు

పాటలు

మార్చు

ఈ సినిమా కోసం ఆరుద్ర నాలుగు పాటలను రచించారు.[1]

పాట రచయిత సంగీతం గాయకులు
గోరంత దీపం కొండంత వెలుగు చిరురంత ఆశ జగమంత వెలుగు సినారె కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
రాయినైనా కాకపోతిని రామపాదము తాకగా బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యము రాయగా ఆరుద్ర కె.వి.మహదేవన్ పి.సుశీల
 1. గోడకు చెవులుంటేనో ... నోనో.. ఈ మేడకు కళ్ళుంటే - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
 2. గోరొంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: డా.సినారె
 3. చందమామ రావోయి జాబిల్లి రావోయి చిన్నదాని బుగ్గమీద - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
 4. చెల్‌మోహనరంగా చెల్‌చెల్ నీకు నాకు ఈడుజోడు కదరా - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
 5. పూలు తాకినంత కందిపోయే ఆ పాదాలు - ఎస్.పి.బాలు, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సినారె
 6. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతినా - పి.సుశీల - రచన: ఆరుద్ర
 7. చెలిచూపులు చలిమంటలుగా చెలి నవ్వులు తొలి పంటలగా - ఎస్.పి. బాలు
 8. చీరమార్చి బొట్టుతీర్చి చిన్ని..మాతరం మాతరం - ఎస్.పి.బాలు, పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరథి
 9. హరి హరి హరి హరి ఆది నారాయణ కరుణించి మమ్ము - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర

మూలాలు

మార్చు
 1. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
 • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.