గోరిపర్తి నరసింహరాజు యాదవ్

గోరిపర్తి నరసింహ రాజు యాదవ్ భరతీయ వ్యవసాయదారుడు. వ్యవసాయంలో అనేక విజయాలను సాధించాడు.[1] ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా లోని గూడూరు గ్రామానికి చెందినవాడు. ఆయన ఒక హెక్టారు విస్తీర్ణం గల పొలంలో 7.5 నుండి 8.3 టన్నుల పూసా బాస్మతి 1 ధాన్యాన్ని, ఒక హెక్టారుకు 3 టన్నుల మినుములు, ఒక హెక్టారుకు 4 నుండి 5 టన్నుల వేరుశనగ పంటను పండించి రికార్డు సాధించాడు.[2] ఆయన 10,000 శాఖలతో ఉలవలు పంటను ఒక మామిడి చెట్టు 22,000 పండ్లను ఒక సీజన్ లో పండించాడు.

గోరిపర్తి నరసింహరాజు యాదవ్
జననం
గూడూరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తిరైతు
పురస్కారాలుపద్మశ్రీ
కృషక రత్న
కృషి రత్న
కృషి సామ్రాట్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చివారి జగ్జీవన్ రం కృషి పురస్కార్

ఆయన ఇండియన్ రైస్ డెవలప్‌మెంటు కౌన్సిల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికచ్లర్ రీసెర్చ్ సంస్థలలో సభ్యునిగా ఉన్నారు. ఆయనకు అనేక పురస్కారాలు లభించాయి. ఆయన కృషక రత్న, క్రిషి రత్న, క్రిషి సామ్రాట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వారి జాగివన్ రాం కిషన్ పురస్కారం (1999) అందుకున్నారు.[3] ఆయన వ్యవసాయ రంగంలో చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 2009లో నాల్గవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందించి సత్కరించింది.[4]

మూలాలు మార్చు

  1. "Mr. Greenfingers offers Rs.10 lakh as prize". The Hindu. 27 February 2013. Retrieved February 27, 2016.
  2. "A field of his own". India Today. 15 June 1995. Retrieved February 27, 2016.
  3. "Farmer extra-ordinant". The Hindu Business Line. 10 May 2000. Retrieved February 27, 2016.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved January 3, 2016.