గోల్డ్(I)క్లోరైడ్

గోల్డ్(I) క్లోరైడ్ ఒక రసాయనిక సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన సంయోగపదార్థం. బంగారు లోహం, క్లోరిన్ వాయువుల పరమాణువుల సంయోగంవలన గోల్డ్ క్లోరైడ్ ఏర్పడినది.ఈ సమ్మేళనపదార్థం లోని మూలకాలలో బంగారం లోహం కాగా క్లోరిన్ అనునది వాయువు.ఈ సంయోగపదార్థం యొక్క సంకేతపదం AuCl. గోల్డ్(I) క్లోరైడ్ అనుపదంలో (I)అనునది, సమ్మేళనములోని బంగారం యొక్క ఆక్సిడేసన్/ ఆక్సీకరణ స్థితిని తెలుపుచున్నది.

గోల్డ్(I)క్లోరైడ్
పేర్లు
ఇతర పేర్లు
గోల్డ్(I)క్లోరైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10294-29-8]
పబ్ కెమ్ 27366
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30078
SMILES [Au]Cl
ధర్మములు
AuCl
మోలార్ ద్రవ్యరాశి 232.423 g/mol
స్వరూపం yellow solid
సాంద్రత 7.6 g/cm3 [1]
ద్రవీభవన స్థానం 170 °C (338 °F; 443 K)
బాష్పీభవన స్థానం 298 °C (568 °F; 571 K) (decomposes)
very slightly soluble
ద్రావణీయత soluble in HCl, HBr organic solvents
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Tetragonal, tI16
I41/amd, No. 141
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము MSDS
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతికలక్షణాలు

మార్చు

గోల్డ్(I) క్లోరైడ్ పసుపు రంగులో ఉన్న ఘనపదార్థం. గోల్డ్(I) క్లోరైడ్ అణుభారం 232.423 గ్రాములు/మోల్. సాధారణ ఉష్ణోగ్రత వద్ద (25 °C) గోల్డ్(I) క్లోరైడ్ సాంద్రత 7.6 గ్రాములు/సెం.మీ 3.గోల్డ్(I)క్లోరైడ్ సంయోగపదార్థం ద్రవీభవన స్థానం 170 °C (338 °F; 443K)., గోల్డ్(I) క్లోరైడ్ బాష్పీభవన స్థానం 298  °C (568 °F; 571K).బాష్పీభవన ఉష్ణోగ్రత దగ్గర గోల్డ్(I) క్లోరైడ్ వియోగం చెందును. గోల్డ్(I) క్లోరైడ్ నీటిలో అత్యంత స్వల్ప ప్రమాణంలో కరుగును.హైడ్రోజన్ క్లోరైడ్(HCl),హైడ్రోజన్ బ్రోమైడ్(HBr) ఆర్గానిక్ ద్రావణాలలో(organic solvents)కరుగును.

ఉత్పత్తి

మార్చు

గోల్డ్(III)క్లోరైడ్‌ను తాప/ఉష్ణ విమోచనం /విఘటన చెందించడం వలన గోల్డ్(I) క్లోరైడ్ ఏర్పడును.

రసాయన చర్యలు

మార్చు

సాధారణ వాతావరణ పరిస్థితులలో(ambient conditions) గోల్డ్(I) క్లోరైడ్ సంయోగపదార్థం మెటాస్టేబుల్ గా ఉండును.గోల్డ్(I) క్లోరైడ్ సంయోగ పదార్థాన్ని నీటితో కలిపి వేడి చేసిన అసమతుల్యత వియోగం చెందిబంగారం, గోల్డ్(III) క్లోరైడ్ గా ఆటోరెడాక్స్ చర్య(autoredox )(అనగా చర్య వలన రసాయనపదార్థం క్షయికరన,,ఆక్సీకరణ చెందటం)వలన ఏర్పడును.

3 AuCl → 2 Au + AuCl3

పొటాషియం బ్రోమైడ్ తో చర్య చెందటం వలన పొటాషియం అరిక్‌బ్రోమైడ్, పొటాషియం క్లోరైడ్ ఏర్పడి,బంగారం వేరు పడును.

3 AuCl + 4 KBr → KAuBr4 + 2 Au + 3 KCl

భద్రత/సురక్షత

మార్చు

గోల్డ్(I) క్లోరైడ్ సంయోగపదార్థం చర్మం లేదా కళ్ళను తాకిన ఇరిటేసన్/ప్రకోపం కల్గును. కడుపులోకి/ జీర్ణకోశంలోకి వెళ్ళిన మూత్రపిండాల నిర్వహణ పై ప్రభావంచూపి, నష్ట పరచును. రక్తం లోనితెల్ల రక్తకణాలు తెల్ల రక్తకణాల సంఖ్యను తగ్గించును.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. Pradyot Patnaik. Handbook of Inorganic Chemicals. McGraw-Hill, 2002, ISBN 0-07-049439-8