గోల్డ్ పెంటాఫ్లోరైడ్
గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ ఒక రసాయన సంయోగపదార్ధం. ఇది ఒక అకర్బన రసాయనపదార్ధం. బంగారం, ఫ్లోరిన్ మూలకాల పరమాణు సంయోగం వలన గోల్డ్(V) ఫ్లోరైడ్ ఏర్పడినది. ఈ ఫ్లోరైడ్ సమ్మేళనపదార్థంలో బంగారం అత్యంత ఎక్కువ స్థాయిలో, +5ఆక్సీకరణ స్థితిని పొంది ఉంది. ఎర్రని గోల్డ్(V) ఫ్లోరైడ్ ఘనపదార్థం హైడ్రోజన్ ఫ్లోరైడ్ లో కరుగుతుంది, కాని కరిగిన తరువాత ఈ ద్రవణాలు వియోగం చెంది, ఫ్లోరిన్ విడుదల అగును. గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ రసాయన సంకేత పదం Au2F10/ AuF5
పేర్లు | |
---|---|
IUPAC నామము
గోల్డ్(V)ఫ్లోరైడ్
| |
ఇతర పేర్లు
గోల్డ్ పెంటాఫ్లోరైడ్
Perauric fluoride | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [57542-85-5] |
ధర్మములు | |
AuF5 | |
మోలార్ ద్రవ్యరాశి | 291.959 g/mol |
స్వరూపం | red unstable solid |
ద్రవీభవన స్థానం | 60 °C (140 °F; 333 K) (decomposes) |
Decomposes | |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
orthorhombic (Pnma) |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | Corrosive, toxic |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతర కాటయాన్లు
|
SbF5, BrF5, IF5 |
సంబంధిత సమ్మేళనాలు
|
AuF3, AuF7 |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక లక్షణాలు
మార్చుగోల్డ్ పెంటా ఫ్లోరైడ్ ఒక అస్థిరమైన ఎర్రని ఘనపదార్థం. గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ అణుభారం 291.959 గ్రాములు /మోల్. గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం 60 °C (140 °F; 333K, ఈ ఉష్ణోగ్రతవద్ద వియోగం చెందును. నీటిలో వియోగం చెందును.గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ ఒక శక్తివంతమైన/దృఢమైనటువంటి ఫ్లోరిన్ అయాన్ గ్రహీత(ion acceptor). అంటిమొని పెంటాక్సైడ్ కన్న ఎక్కువస్థాయిలో గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటాఫ్లోరైడ్, ఫ్లోరిన్ అయాన్‌ను స్వీకరిస్తుంది/గ్రహిస్తుంది.
సంశ్లేషణ
మార్చుఆక్సిజన్, ఫ్లోరిన్ వాయుపూరిత వాతావరణప్రదేశంలో,370°Cవద్ద,8 అట్మాస్‌ఫియర్ వత్తిడి వద్ద బంగారాన్ని వేడి చెయ్యడం వలన డైఆక్సిజేనిల్ హెక్సాఫ్లోరో ఆరేట్(O2AuF6(s) ఏర్పడును.
- Au(s) + O2(g) + 3 F2(g) → O2AuF6(s)
ఇలా ఏర్పడిన డైఆక్సిజేనిల్ హెక్సాఫ్లోరోఆరేట్ లవణపదార్ధం 180 °Cవద్ద గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటాఫ్లోరైడ్‌ను ఏర్పరచును.
- 2O2AuF6(s) → Au2F10 (s) + 2 O2(g) + F2(g)
క్రిప్టాన్ డైఫ్లోరైడ్ అత్యంత శక్తివంతమైన ఆక్సీకరణకారకం, ఫ్లోరినేటింగు కారకం.ఇది బంగారాన్ని, బంగారం యొక్క అతిఎక్కువ ఆక్సీకరణస్థితి అయిన +5 స్థితికి ఆక్సీకరిస్తుంది.
- 7 KrF2 (g) + 2Au (s) → 2 KrF+AuF−6 (s) + 5 Kr (g)
KrF+AuF−6 అనునది 60°Cవద్ద గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటా ఫ్లోరైడ్, క్రిప్టాన్, ఫ్లోరిన్ వాయువులుగా వియోగం చెందును.