గోళ్ళమూడి
గోళ్ళమూడి గుంటూరు జిల్లా, పెదకాకాని మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గోళ్ళమూడి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°20′01″N 80°30′51″E / 16.3335931°N 80.5141306°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | పెదకాకాని |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 509 |
ఎస్.టి.డి కోడ్ | 0863 |
గ్రామ చరిత్ర
మార్చుఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
మార్చుతాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామ పంచాయతీ
మార్చు- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఓరుగంటి జ్యోతి, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఉపసర్పంచిగా శ్రీ నడింపల్లి సత్యనారాయణ, ఎన్నికైనారు. వీరు పదవిలో ఉండగానే, 66 సంవత్సరాల వయసులో, 2014, ఆగస్టు-25న అనారోగ్యంతో కన్నుమూసినారు.
గ్రామ విశేషాలు
మార్చునంబూరు (పెదకాకాని మండలం) గ్రామంలోని "వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ" కళాశాల ఛైర్మన్ అయిన వాసిరెడ్డి విద్యాసాగర్, గోళ్ళమూడి గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామంగా తీర్చిదిద్దటానికై, ఆ గ్రామన్ని దత్తత తీసుకున్నారు.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.