గోవిందగిరి
గోవిందగిరి (1858–1931) భారతీయ సామాజిక, మత సంస్కర్త. 1900ల ప్రారంభంలో దేశంలోని నేటి రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గిరిజన సరిహద్దు ప్రాంతాలలో ఆయన సమాజ సంస్కర్త[1] 18వ శతాబ్దంలో మొదటగా ప్రారంభించబడిన భగత్ ఉద్యమాన్ని ఆయనే ప్రాచుర్యంలోకి తెచ్చినట్లుగా పరిగణించబడుతుంది.[2] ఆయనని గోవింద్ గురు బంజారా అని కూడా పిలుస్తారు,
గోవిందగిరి | |
---|---|
జననం | 1858 బన్సియా, దుంగార్‌పూర్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం రాజస్థాన్) |
మరణం | 1931 అక్టోబరు 30 లింబ్డీ సమీపంలోని కాంబోయి (ప్రస్తుతం పంచమహల్ జిల్లా, గుజరాత్) | (వయసు 72–73)
ఇతర పేర్లు | గోవింద్ గురు బంజారా |
వృత్తి | సామాజిక, మత సంస్కర్త |
జీవితం తొలి దశలో
మార్చుదుంగార్పూర్ రాష్ట్రంలో, ప్రస్తుత రాజస్థాన్‌లోని బన్సియా గ్రామంలో బంజారా కుటుంబంలో గోవిందగిరి జన్మించాడు. ఆయన తన గ్రామంలోని పూజారి సహాయంతో ప్రాథమిక విద్యను అభ్యసించాడు.[3] అతను హాలీగా ఉండేవాడు, అనగా శాశ్వత ఎస్టేట్ సేవకుడు.[4] ఆయన భార్య, బిడ్డ 1900 కరువులో మరణించినట్లు చరిత్ర, కాగా, ఆయన పొరుగున ఉన్న సుంత్ రాష్ట్రానికి మారాడు.[5] అక్కడ, గోవిందగిరి తన సోదరుడి వితంతువును వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత, హిందూ సన్యాసి (గోసైన్) రాజగిరికి శిష్యుడు అయ్యాడు; రాజగిరి గౌరవార్థం, విందా తన పేరును గోవిందగిరిగా మార్చుకున్నాడు.[6] 1909లో ఆయన తన భార్య, పిల్లలతో కలిసి దుంగార్పూర్ రాష్ట్రాలోని వెడ్సా గ్రామానికి తిరిగి వచ్చాడు.[7]
గుర్తింపు
మార్చు- గోవింద్ గురు సమాధి మందిర్, కంబోయిలో స్మారక మందిరం, అతని అనుచరులు సందర్శిస్తారు.[8]
- గోవింద్ గురు స్మృతి వాన్ అనే బొటానికల్ గార్డెన్‌ను గుజరాత్ ప్రభుత్వం 2012 జూలై 31న ప్రారంభించింది.
- 2012లో, ఆయన మనవడు మాన్ సింగ్‌ను అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 80,000 మందికి పైగా గిరిజనుల సమక్షంలో సత్కరించారు.[9][10]
- 2015లో , గోద్రాలోని శ్రీ గోవింద్ గురు విశ్వవిద్యాలయం స్థాపించబడింది.[11]
- 2012లో, బన్స్వారలో స్థాపించబడిన గోవింద్ గురు గిరిజన విశ్వవిద్యాలయం ఆయన పేరుతో 2016లో మార్చబడింది.
మూలాలు
మార్చు- ↑ Natani, Prakash (1998). राजस्थान का स्वाधीनता आंदोलन. Jaipur: Granth Vikas. pp. 54–58.
- ↑ Sahoo, Sarbeswar (2013). Civil Society and Democratization in India: Institutions, ideologies and interests. Oxon: Routledge. p. 127. ISBN 9780203552483.
- ↑ Shah, Ghanshyam (2004). Social Movements in India: A Review of Literature. New Delhi: Sage Publications. pp. 107. ISBN 9780761998334.
- ↑ Yajnik, Indulal (1921). Agrarian Disturbances in India. Lahore B.P.L. Bedi. pp. 85.
- ↑ Sehgal, K.K. (1962). Rajasthan District Gazetteers: Dungarpur. Jaipur: Directorate, District Gazetteers. pp. 51.
- ↑ Fuchs, S. (1965). "Messianic Movements in Primitive India". Asian Folklore Studies. 24 (1): 11–62. doi:10.2307/1177596. JSTOR 1177596. Archived from the original on 2016-03-04. Retrieved 2023-10-27.
- ↑ Fuchs, S. (1965). "Messianic Movements in Primitive India". Asian Folklore Studies. 24 (1): 11–62. doi:10.2307/1177596. JSTOR 1177596. Archived from the original on 2016-03-04. Retrieved 2023-10-27.
- ↑ Mahurkar, Uday (1999-11-30). "Descendants of Mangad massacare seek recognition for past tragedy". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-29.
- ↑ Mahurkar, Uday (1999-11-30). "Descendants of Mangad massacare seek recognition for past tragedy". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-29.
- ↑ K. Bhatia, Ramaninder (2012-07-24). "63rd van mahotsav to be a tribute to tribal freedom fighters". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-29.
- ↑ "Govind Guru University inaugurated in Godhra | Vadodara News - Times of India". The Times of India.