గోద్రా
గోద్రా, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, పంచమహల్ జిల్లాలోని ఒక పురపాలక పట్టణం. ఇది పంచమహల్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. వాస్తవానికి ఈ పేరు గోవు నుండి వచ్చింది. అంటే "ఆవు" లేదా ధారా - ఈ పదాన్ని ఎలా ఉచ్చరిస్తారు అనే దానిపై ఆధారపడి రెండు అర్థాలు ఉన్నాయి.'ధార' అంటే స్త్రీలింగ విషయం లేదా ఏదైనా "పట్టుకున్న" వ్యక్తి, సాధారణంగా "భూమి" అని అర్థం. ఇతర ఉచ్ఛారణ 'ధారా' అంటే "ప్రవాహం".అయితే, రెండవ ఉచ్చారణ ప్రజాదరణ పొందలేదు, లేదా సాధారణంగా ఈ పదం సరిపోలేదు. అందుకే 'గోద్రా లేదా గోధరా' అంటే ఆవుల భూమి అని అర్థం.
Godhra | |
---|---|
City | |
Nickname: Land of Cows | |
Coordinates: 22°46′38″N 73°37′13″E / 22.77722°N 73.62028°E | |
Country | India |
రాష్ట్రం | గుజరాత్ |
జిల్లా | Panchmahal |
Named for | Cows |
విస్తీర్ణం | |
• Total | 20.16 కి.మీ2 (7.78 చ. మై) |
Elevation | 73 మీ (240 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,43,644 |
• జనసాంద్రత | 7,100/కి.మీ2 (18,000/చ. మై.) |
Languages | |
• Spoken | Gujarati |
• Official | Gujarati, Hindi, English and Urdu |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 389001 |
Telephone code | 02672 |
Vehicle registration | GJ-17 |
Sex ratio | 935/1000 ♀/♂ |
Literacy rate | 87.51 % |
గోద్రా 2002 గుజరాత్ అల్లర్ల ప్రారంభ బిందువుగా భారతదేశంలో అంతర్జాతీయంగా, విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో గోద్రా రైలు దహనం సంఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన అల్లర్లు ప్రారంభమయ్యాయి, ఆ విధ్వసంలో సుమారు 59 మంది రైలు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.[1] గోద్రా రోడ్డు, రైలు జంక్షన్, కలప, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్య కేంద్రం. పరిశ్రమలలో నూనెగింజల నుండి గానుగ ద్వారా నూనెతయారి, పిండిమరలు అడించటం, గాజుల తయారీ లాంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వివిధ జైన ప్రబంధాల ఆధారంగా జావర్‌చంద్ మేఘానీ రచించిన గుజరాతీ చారిత్రాత్మకమైన గుజరాతీ నవలలో నగరాన్ని గోధ్‌పూర్ (గోధపూర్) గా వర్ణిస్తుంది.[2]
చరిత్ర
మార్చుసా.శ. 975 నుండి లార్డ్ రిషభనాథ్ కంచు అకోటాలో కనుగొనబడింది. ఇది గోహద్ర కులాన్ని ప్రస్తావిస్తుంది. అంటే గోహద్రలోని జైన సన్యాసుల పాఠశాల.[3] గోధ్రా చారిత్రక పేరు "గోధ్రాహ్క్", దీనిని సా.శ. 1415లో ధుధుల్ మాండలిక్ అనే పర్మార్ రాజు స్థాపించాడు. సా.శ. 15వ శతాబ్దంలో సెయింట్ వల్లభాచార్య తన ఉదయం చేసే ఆచార ప్రసంగంలో తన కలల నగరానికి ఉదాహరణగా నిలిచాడు. తన కుమార్తెకు కలలో కనిపించి, నగరాన్ని ముస్లిం నివాసి, హిందూ కుటుంబానికి ఎలా అప్పగించిందో అతను వివరించాడు.
ప్రభుత్వం, రాజకీయాలు
మార్చుగోద్రా నగరం స్థానిక స్వపరిపాలన సంస్థచే పాలించబడుతుంది.[4] పరిపాలన నిమిత్తం నగరం 12 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు కౌన్సిలరు ప్రాతినిధ్యం వహిస్తాడు.[5] గోద్రా నగరం పంచమహల్ లోక్‌సభ నియోజకవర్గం (పూర్వపు గోద్రా లోక్‌సభ నియోజకవర్గం) లో ఒక భాగం. 2019 సాధారణ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి భారత జనతా పార్టీకి చెందిన రతన్‌సిన్హ్ రాథోడ్ ఎన్నికయ్యాడు.[6] గోద్రా శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన సికె రౌల్జీ, లోక్‌సభ సభ్యుడు రతన్‌సిన్హ్ రాథోడ్ ఈ నగరంతో అనుభంధం ఉన్న ఈ రెండు నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.[7] II చుండ్రిగర్, పాకిస్తాన్ మాజీ ప్రధాని 1897లో గోద్రాలో జన్మించాడు. వల్లభ్‌భాయ్ పటేల్ 1917లో గోద్రాలో గాంధీని తొలిసారిగా కలిశారు. ఆ తర్వాత భారత స్వాతంత్ర్య పోరాటంలోకి ఆకర్షితులయ్యాడు.[8]
మత హింస
మార్చుభారతదేశానికి స్వాతంత్ర్యానికి ముందు, తరువాత గోద్రాలో అనేక మతపరమైన హింసాత్మక సంఘటనలు జరిగాయి. వాటిలో గుర్తించదగిన హింసాత్మక చర్యలు వివరాలు
- 1947-48 సమయంలో, భారతదేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ఘంచి ముస్లిం సమాజం, సింధీల మధ్య గోద్రాలో అల్లర్లు చెలరేగాయి.హింసలో దాదాపు 3,500 మంది ఆస్తులు దగ్ధమయ్యాయి.[9]
- 1980 అక్టోబరు, 1981 సెప్టెంబరు మధ్య, గోద్రాలోని అధిక ముస్లిం సమాజం, సింధీ ప్రజల మధ్య ఆరు ప్రధాన మతపరమైన అల్లర్లు దహన, దోపిడీలు జరిగాయి. ముస్లింలు అధికంగా ఉండే సిగ్నల్‌ఫాలియా ప్రాంతంలో సింధీ కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు.[10] హింస, ప్రాణనష్టం ఫలితంగా, ఈ కాలంలో పట్టణంలో సుమారు 245 రోజుల పాటు జనసంచార నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.[11][12]
- 1990లో గోద్రాలోని వోర్వాడ్ ప్రాంతంలో నలుగురు హిందూ ఉపాధ్యాయులను ముస్లిం గుంపు హత్య చేసింది.[10]
- గోద్రా రైలు దహనం - 2002లో గోద్రా రైల్వేస్టేషన్‌కు సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పంటించిన ముస్లిం గుంపుపై ఆరోపణలు వచ్చాయి. అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 59 మంది హిందూ యాత్రికులు అగ్నిప్రమాదంలో చనిపోయారు. ఈ సంఘటన 2002 గుజరాత్ అల్లర్లకు ఆకస్మిక హింసాత్మక చర్యగా పరిగణించబడింది.[13]
అనుసంధానం
మార్చుగుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా నిర్వహించబడే ప్రజా రవాణా సేవల ద్వారా గోద్రా నగరం నుండి, గుజరాత్‌లోని అన్ని ప్రధానపట్టణాలకు అనుసంధానించబడి ఉంది. గోద్రా నుండి గుజరాత్ రాష్ట్రంలోని, దేశంలోని వివిధ ప్రాంతాలతో గోద్రాను కలిపే రైల్వే కూడలి ఉంది. భారతదేశంలో అతిపెద్ద జాతీయ రహదారి ఢిల్లీ-ముంబై ఎక్సెప్రెస్ రహదారి గోద్రా నగరం గుండా వెళుతుంది.
సంస్కృతి
మార్చుమతపరమైన ప్రాముఖ్యత
మార్చు- గోద్రాలోని బగైడోల్ గ్రామంలో సత్ కైవల్ దేవాలయం ఉఁది. ఇది సత్ కైవల్ సంప్రదాయానికి చెందిన ఆలయం.
- భారతదేశంలోని మతపరమైన ప్రదేశాలలో గోద్రా ఒకటి. ఇందులో వైష్ణవ సంప్రదాయం కోసం నాలుగు దేవాలయాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఆలయాలు రెండు గుసాయిజీ (విఠలనాథ), హిత్ హరివంశ్ మహాప్రభు ఆలయాలు ఉన్నాయి. భారతదేశంలో మహాప్రభుజీ, గుసియాంజీ, గోకుల్నాథ్జీల ముగ్గురి ఆలయాలు ఉన్న ఏకైక నగరం.
- గోద్రాలో మూడు జైన దేవాలయాలు ఉన్నాయి. జైన దేవాలయంలోని ప్రధాన విగ్రహం శాంతినాథ్ (లేదా ముల్ నాయక్ ). ఇందులో భామయ్యా ప్రాంతంలో (అహ్మదాబాద్ రోడ్) దాదా భగవాన్ స్థాపించిన 'త్రిమందిర్' అనే మతతత్వం లేని ఆలయం ఉంది.[14]
- గోద్రాలో బి.ఎ.పి.ఎస్. స్వామినారాయణ దేవాలయం ఉంది.
- మకర సక్రాంతి, మహా శివరాత్రి, హోలీ, దీపావళి, ఈద్ అల్-ఫితర్, బైశాఖి, రక్షాబంధన్, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, ఈద్ అల్-అధా, ముహర్రం, క్రిస్మస్, దసరా, ఈస్టర్ పండగలు జరుపుకుంటారు.
ప్రకృతి దృశ్యం
మార్చుఈ ప్రాంతంలో భౌగోళిక, మానవ నిర్మిత లక్షణాలలో మెశ్రీ నది, రాంసాగర్ సరస్సు, వోహర్వాడ్ మస్జిద్ టవర్, పోలన్ బజార్, మెథడిస్ట్ చర్చి, నహెరు ఉద్యానవనం తూర్పున కనేలావ్ సరస్సు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ Dasgupta, Manas (2011-03-06). "It was not a random attack on S-6 but kar sevaks were targeted, says judge". The Hindu. Retrieved 2016-10-27.
- ↑ Meghani, Zaverchand (April 2011). Gujaratno Jay. Ahmdabad: Gurjar Sahitya Bhavan. p. 65. ISBN 978-81-8461-481-7.
- ↑ Akota Bronzes, Umakant P. Shah, 1959, p. 57-58.
- ↑ "Public Utilities | Panchmahals, Gujarat, India | India". Retrieved 2020-09-17.
- ↑ Naqvi, Jawed (2011-03-09). "Godhra: fact and fiction". DAWN.COM. Retrieved 2020-09-17.
- ↑ "Panchmahal MP (Lok Sabha) Election Results 2019 Live: Candidate List, Constituency Map, Winner & Runner Up - Oneindia". www.oneindia.com. Archived from the original on 2020-08-04. Retrieved 2020-09-17.
- ↑ "No intention to vote for Cong in RS polls: BJP MLA from Godhra". The Indian Express. 2020-03-19. Retrieved 2020-09-17.
- ↑ Gandhi, Rajmohan (1 January 2011). Patel a Life. Navjivan trust. ISBN 978-8172291389.
- ↑ Engineer, Asghar Ali. “Communal Riots in Godhra: A Report.” Economic and Political Weekly, vol. 16, no. 41, 1981, pp. 1638–1640. JSTOR. Accessed 27 Feb. 2021.
- ↑ 10.0 10.1 "Gujarat election 2012: Deeply divided by religion, Godhra braces for second phase poll - Indian Express". Indian Express. December 14, 2012. Retrieved 27 February 2021.
- ↑ "Communal holocaust simmers dangerously over Godhra town in Gujarat". India Today. December 15, 1981. Retrieved 27 February 2021.
- ↑ "Curfew Eased in West India". New York Times. August 3, 1981. Retrieved 27 February 2021.
- ↑ "What is the 2002 Godhra train burning case?". Indian Express. 9 October 2017. Retrieved 27 February 2021.
- ↑ "The Godhra Trimandir". Retrieved 2018-04-20.