లింగంపల్లి - కాకినాడ పోర్ట్ గౌతమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది లింగంపల్లి, కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

గౌతమి ఎక్స్‌ప్రెస్
12738 Gowthami Express 13052018.jpg
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్
స్థితిOperating
స్థానికతతెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వె
మార్గం
మొదలుకాకినాడ
ఆగే స్టేషనులు20
గమ్యంసికింద్రాబాదు జంక్షన్
ప్రయాణ దూరం566 km (352 mi)
సగటు ప్రయాణ సమయం10 గంటల, 15 నిమిషాలు
రైలు నడిచే విధంప్రతీరోజూ
సదుపాయాలు
శ్రేణులుSleeper, Ac 1,2,3 General
కూర్చునేందుకు సదుపాయాలుIndian Rail standard
ఆహార సదుపాయాలుCatering available
చూడదగ్గ సదుపాయాలుLarge windows in all carriages, cleanliness
బ్యాగేజీ సదుపాయాలుBelow the seats
సాంకేతికత
రోలింగ్ స్టాక్Two
పట్టాల గేజ్Broad (1,676 mm)
విద్యుతీకరణ5,350 hp (3,989 kW)
వేగం55 km/h (Average)
మార్గపటం
Goutami Express Route map.jpg
Gowthami Express route map with important halts en route.

చరిత్రసవరించు

గౌతమీ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే జోన్ లో అతి ప్రతిష్ఠాకరమైన ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు, కాకినాడ పోర్టును కలుపుతుంది. ఈ రైలు జూలై 2007 లో సూపర్ ఫాస్టు విభాగంలోనికి అప్ గ్రేడు అయినది. ఈరైలు 12737 / 12738 సంఖ్యలు కలిగి ఉంటుంది. అప్ గ్రేడు కాక పూర్వం ఈ రైలు 7047 / 7048 సంఖ్యలతో పిలువబడేది. ఈ రైలు 24 భోగీలతో కూడుకొని ఉన్న అతి పెద్ద రైళ్ళలో ఒకటి. ఈ రైలులో 4 ఎసి, 15 స్లీపర్, 3 సెకండ్ క్లాస్ జనరల్, 2 లగేజ్ కం బ్రేక్ వాన్స్ ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ లోని డెల్టా జిల్లాలలోని ప్రజలను విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదుకు చేరవేసే ముఖ్యమైన రైలు. ఈ రైలును 1987 అక్టోబరు 3 న ప్రారంభించారు. ఈ రైలు విశాఖపట్నం నుండి హైదరాబాదుకు ప్రయాణించు గోదావరి ఎక్స్‌ప్రెస్ కు సిస్టర్ ట్రైన్ గా పిలువబడుతుంది. ఈ రైలు పరిశుభ్రంగా ఉన్న రైళ్ళలో ఒకటి. ఇది ఫిబ్రవరి 2010 నుండి WAP7 ఇంజనుతో లాగబడుతుంది. అంతకు పూర్వం WAP4 ఇంజను లాగేది.

ఇంజను లింకులుసవరించు

ఈ రైలు కాకినాడ నుండి విజయవాడ వరకు ఏరోడ్ ఆధారిత WAP4 ఇంజనుతో లాగబడుతుంది. విజయవాడలో ఇంజను మార్చబడుతుంది. కొన్ని సార్లు WAP7 లభ్యం కాని పక్షంలో ఇది లాలాగూడా ఆధారిత WAP4 తో విజయవాడ నుండి సికింద్రాబాదుకు లాగబడుతుంది.

రైలు సమయ పట్టికసవరించు

సంఖ్య కోడ్ స్టేషన్ దూరం చేరే సమయం. సమయం బయలు. సమయం నిలుపు అరైవల్ డే రాష్ట్రం
1 CoA కాకినాడ పోర్ట్ మూలం 20:20 - అన్ని రోజులు ఆంధ్రప్రదేశ్
2 CCT కాకినాడ టౌన్ 3 కి.మీ 20:28 20:33 5 నిమిషాలు అన్ని రోజులు ఆంధ్రప్రదేశ్
3 SLO సామర్లకోట జంక్షన్ 15 కి.మీ 20:49 20:50 1 నిమిషం అన్ని రోజులు ఆంధ్రప్రదేశ్
4 DWP ద్వారపూడి 45 కి.మీ 21:10 21:11 1 నిమిషం అన్ని రోజులు ఆంధ్రప్రదేశ్
5 RJY రాజమండ్రి 65 కి.మీ 21:35 21:40 5 నిమిషాలు అన్ని రోజులు ఆంధ్రప్రదేశ్
6 KVR కొవ్వూరు 73 కి.మీ 21:52 21:53 1 నిమిషం అన్ని రోజులు ఆంధ్రప్రదేశ్
7 NDD నిడదవోలు జంక్షన్ 88 కి.మీ 22:06 22:07 1 నిమిషం అన్ని రోజులు ఆంధ్రప్రదేశ్
8 TDD తాడేపల్లిగూడెం 107 కి.మీ 22:22 22:24 2 నిమిషాలు అన్ని రోజులు ఆంధ్రప్రదేశ్
9 EE ఏలూరు 155 కి.మీ 22:56 22:57 1 నిమిషం అన్ని రోజులు ఆంధ్రప్రదేశ్
10 BZA విజయవాడ జంక్షన్ 215 కి.మీ 00:15 00:30 15 నిమిషాలు అన్ని రోజులు ఆంధ్రప్రదేశ్
11 MDR మధిర 264 కి.మీ 01:22 01:23 1 నిమిషం అన్ని రోజులు తెలంగాణ
12 KMT ఖమ్మం 308 కి.మీ 01:48 01:50 2 నిమిషాలు అన్ని రోజులు తెలంగాణ
13 DKJ డోర్నకల్ జంక్షన్ 331 కి.మీ 02:13 02:14 1 నిమిషం అన్ని రోజులు తెలంగాణ
14 MABD మహబూబ్బాద్ 355 కి.మీ 02:34 02:35 1 నిమిషం అన్ని రోజులు తెలంగాణ
15 NKD నెకొండ 386 కి.మీ 02:50 02:51 1 నిమిషం అన్ని రోజులు తెలంగాణ
16 WL వరంగల్ 416 కి.మీ 03:28 03:29 1 నిమిషం అన్ని రోజులు తెలంగాణ
17 KZJ కాజీపేట జంక్షన్ 436 కి.మీ 03:44 03:45 1 నిమిషం అన్ని రోజులు తెలంగాణ
18 Zn జనగాం 484 కి.మీ 04:29 04:30 1 నిమిషం అన్ని రోజులు తెలంగాణ
19 ALER ఆలేరు 498 కి.మీ 04:50 04:51 1 నిమిషం అన్ని రోజులు తెలంగాణ
20 BG భువనగిరి 521 కి.మీ 05:14 05:15 1 నిమిషం అన్ని రోజులు తెలంగాణ
21 BG సికింద్రాబాద్ జంక్షన్ 576 కి.మీ 06:35 గమ్యం అన్ని రోజులు తెలంగాణ

కోచ్ల కూర్పుసవరించు

ఈ రైలుకు 24 బోగీలు ఉంటాయి. ఆ కోచ్‌లు కూర్పు వివరాలు: -

12737 (అప్) /;12738 (డౌన్)

కాకినాడ ఫోర్టు నుండి సికింద్రాబాదుకు నడిచే ఈ రైళ్ళలో కోచ్ ల అమరిక ఈ విధంగా ఉంటుంది.[2]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ జనరల్ హెచ్1 A2 A1 బి2 బి1 ఎస్14 ఎస్13 ఎస్12 ఎస్11 ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ SLR  

సంఘటనలుసవరించు

  • జూలై, 2008 లో అర్థరాత్రి విద్యుత్ షాట్ సర్క్యూట్ ఫలితంగా మంటలు ఏర్పడినవి. మొదట ఎస్.9 భోగీలో మంటలు చెలరేగి ఎస్ 10, ఎస్ 11, ఎస్ 12, ఎస్ 13 వరకూ వ్యాపించి పూర్తిగా దగ్ధమయిపోయాయి. వరంగల్ కె.సముద్రం మధ్య గల తాళ్ళ పూసలపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 50 మంది వరకూ తీవ్రస్ధాయిలో గాయపడ్డారు.ముగ్గురు ప్రయాణీకులు సజీవదహనం చెందారు.[3]
  • 2009 సెప్టెంబరు 20 : కాకినాడ వెళుతున్న గౌతమి ఎక్స్ ప్రెస్ లో దొంగలు పడ్డారు. చైన్ లాగిన దోపిడీ దొంగలు ఆనక ఎస్ 7, 10, 15 బోగీల్లో వరుసగా ప్రయాణికుల నుంచి ఆభరణాలను దోచుకొని రైలు దిగి చీకట్లోకి పరారయ్యారు. వరంగల్ - ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోని డోర్నకల్ - పాపెడిపల్లి సమీపంలోని బర్లగూడెం వద్ద ఈ సంఘటన రాత్రి జరిగింది.[4]
  • 2015 ఏప్రిల్ 11: సికింద్రాబాద్- కాకినాడ గౌతమి ఎక్స్ ప్రెస్ లో బంగారం చోరీ జరిగింది. ఈ రైలు విజయవాడ సమీపంలోని రాయనపాడుకు చేరుకునే సమయంలో ప్రయాణికుల నుంచి రూ.లక్ష విలువైన బంగారాన్ని దుండగులు దోచుకుని ఉడాయించారు.[5]

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు