గౌలిగూడ బస్టాండ్
గౌలిగూడ బస్టాండ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఉన్న బస్టాండ్. దీనిని సిబిఎస్ లేదా సెంట్రల్ బస్ స్టేషను అని కూడా పిలుస్తారు.[1] 1932 నుండి సెంట్రల్ బస్ స్టేషనుగా సేవలందించిన గౌలిగూడ బస్టాండ్ 2018, జూలై 5న కూలిపోయింది.[2]
గౌలిగూడ బస్టాండ్ (సిబిఎస్ లేదా సెంట్రల్ బస్ స్టేషను) | |
---|---|
![]() గౌలిగూడ బస్టాండ్ | |
స్టేషన్ గణాంకాలు | |
చిరునామా | గౌలిగూడ, హైదరాబాదు |
భౌగోళికాంశాలు | 17°13′26″N 78°17′07″E / 17.2240°N 78.2852°ECoordinates: 17°13′26″N 78°17′07″E / 17.2240°N 78.2852°E |
నిర్మాణ రకం | ఇనుము |
వాహనములు నిలుపు చేసే స్థలం | ఉంది |
సైకిలు సౌకర్యాలు | ఉంది |
సామాను తనిఖీ | ఉంది |
ఇతర సమాచారం | |
ప్రారంభం | 1930 |
మూసివేయబడినది | 2018 |
యాజమాన్యం | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ |
రద్దీ | |
ప్రయాణీకులు () | రోజూ 85వేలమంది |
విషయ సూచిక
నిర్మాణంసవరించు
దాదాపు 88 సంవత్సరాలుగా హైదరాబాదులో ఒక చారిత్రాత్మక చిహ్నంగా నిలిచి, అనేకమంది ప్రయాణికులకు సేవలందించిన గౌలిగూడ బస్టాండు (సీబీఎస్ హ్యాంగర్)ను ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లో మూసీ నది పక్కన నిర్మించాడు. బట్లర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (అమెరికా) నుంచి దిగుమతి చేసుకొని 350 అడుగుల పొడవుతో, 150 అడుగుల వెడల్పుతో, 60 అడుగుల ఎత్తులో అర్ధచంద్రాకారంలో విశాలంగా నిర్మించిన ఈ మిసిసిపీ హెలికాప్టరు హ్యాంగర్‌ను నిజాం తన వ్యక్తిగత ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోసం ఉపయోగించేవాడు.
బస్ స్టేషనుగాసవరించు
నాలుగెకరాల స్థలంలో 1.77 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గౌలిగూడ బస్టాండ్ హైదరాబాద్‌లోనే మొట్టమొదటిది. 1932 జూన్‌లో 30 ప్లాట్‌ఫారాలతో 27 బస్సులతో మరియు 166 మంది నిజాం రోడ్ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులతో ప్రారంభమైన గౌలిగూడ హ్యాంగర్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల నడిచాయి. 1951 నుండి రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఆధీనంలోకి వచ్చిన గౌలిగూడ బస్టాండ్, 1994లో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఏర్పాటైన తరువాత హైదరాబాదు బస్సులకే పరిమితమైంది.[3] 2006 వరకు జిల్లాల నుండి వచ్చే బస్సులు కూడా సీబీఎస్ లోనే ఆగేవి. నిత్యం రోజూ వివిధ డిపోలకు చెందిన 250కి పైగా బస్సులు మరియు 85వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
శిధిలావస్థ - కూలడంసవరించు
షెడ్ కోసం ఉయోగించిన ఇనుప రాడ్లు, బోల్టులు తుప్పు పట్టి శిధిలావస్థకు చేరాయి. ఈ విషయాన్ని గమనించిన అధికారులు ముందస్తు చర్యగా జూన్ 29న అక్కడి ప్రాంతాన్ని ఖాళీ చేయించి, బస్టాండును మూసివేశారు. 2018, జూలై 5 గురువారం తెల్లవారుజామున తుప్పుపట్టిన షెడ్డు భాగం భారీశబ్దంతో సగానికి చీలిపోయి కుప్పుకూలింది.
మూలాలుసవరించు
- ↑ నమస్తే తెలంగాణ (6 July 2018). "కుప్పకూలిన గౌలిగూడ హ్యాంగర్". మూలం నుండి 6 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 6 July 2018. Cite news requires
|newspaper=
(help) - ↑ తెలంగాణ టుడే (6 July 2018). "Hyderabad loses a landmark". Yuvraj Akula. మూలం నుండి 6 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 6 July 2018. Cite news requires
|newspaper=
(help) - ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (6 July 2018). "'గౌలిగూడ' కనుమరుగు!". మూలం నుండి 6 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 6 July 2018. Cite news requires
|newspaper=
(help)